భారతీ సిమెంట్స్ లో జగన్ కు 2 కోట్ల 38.లక్షల 60 వేల 435 షేర్లు ఉన్నాయని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి తెలిపారు. వీటి విలువ రూ.2,500 కోట్లు పైనే ఉంటుందని పేర్కొన్నారు. జగన్ పేదవాడు ఎందుకు అవుతాడు.. ఇప్పుడు పేదలెవరో, పెత్తందార్లు ఎవరో జగనే చెప్పాలి అని ఆయన డిమాండ్ చేశారు. భార్య.. భర్తలకు కలిపి రూ.4వేల కోట్లకి పైగా షేర్లు ఉన్నాయి.. భారతీ సిమెంట్స్ లాభాల్లో ఉంది.. ఒక త్రైమాసికంలో రూ.235 కోట్లు ఆదాయం చూపారు.. 2001 నుంచి 2024 వరకూ భారతి సిమెంట్స్ టర్నోవర్ రూ.2వేల కోట్లుకు ఎలా పెరిగింది అని ఆనం వెంకట రమణారెడ్డి ప్రశ్నించారు.
Read Also: Home Loans: తక్కువ వడ్డీకే హోమ్ లోన్.. దీపావళి ఆఫర్ ప్రకటించిన పలు బ్యాంకులు..!
ఇక, వైఎస్ఆర్ ఉన్నపుడు 30 లక్షల హౌసింగ్ ఇళ్లకు భారతీ సిమెంటు వాడారా? లేదా? చెప్పాలని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆనం వెంకట రమణారెడ్డి డిమాండ్ చేశారు. వైఎస్ భారతి ఏడాదికి రూ.2కోట్ల 90 లక్షల జీతం, రూ.కోటి మేర ఎలవెన్సులు తీసుకుంటున్నది వాస్తవం కాదా?.. మీ భార్యాభర్తలు పేదవాళ్లు ఎలా అవుతారు? అని ఆయన ప్రశ్నించారు. 2018లో రూ.1077కోట్లుగా ఉన్స్ ఆదాయం గత ఏడాదిలో రూ.2009 కోట్లకి ఎలా పెరిగింది.. మూడు నెలల్లో రూ.952కోట్లు టర్నోవర్ సాధించండం చిన్న విషయం కాదు.. భారతీ సిమెంట్స్ పుణ్యమాని మిగిలిన సిమెంటు కంపెనీలు అన్నీ మూతపడే పరిస్థితికి వచ్చాయని ఆనం వెంకట రమణారెడ్డి మండిపడ్డారు. భారతదేశంలోనే ఒక్క రూపాయి బ్యాంకు అప్పులేని సిమెంట్ కంపెనీ భారతీ సిమెంట్సే అని పేర్కొన్నారు.