భారతదేశంలో నేరాలు చేసి విదేశాలకు పారిపోవడం లేదా భారత్ లోని అజ్ఞాత ప్రాంతాల్లో తలదాచుకునే నేరస్థుల ఆటకట్టించేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్త టెక్నాలజీని అందుబాటులోకి తీసుకొస్తుంది. దీని కోసం 'భారత్‌పోల్' అనే పోర్టల్‌ను సీబీఐ తయారు చేసింది. దీన్ని ఈరోజు (జనవరి 7) కేంద్ర హోం మంత్రి అమిత్‌షా ప్రారంభించనున్నారు.
మహిళలపై నేరాలకు సంబంధించిన కేసుల విచారణకు సంబంధించి సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. మహిళలపై నేరాలకు సంబంధించిన కేసుల విచారణలో కోర్టులు సున్నితంగా వ్యవహరించాలని సుప్రీంకోర్టు పేర్కొంది.
రాష్ట్రంలో సైబర్ నేరాల మినహా అన్ని రకాల నేరాలలో పూర్తిగా తగ్గుదలలో ఉన్నాయని డీజీపీ అంజనీ కుమార్ పేర్కొన్నారు. కేవలం హైదరాబాద్‌లోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా సైబర్ లిటరసీ గణనీయంగా పెరగడంతో పాటు సైబర్ నేరాలు కూడా అదే స్థాయిలో పెరుగుతున్నాయని తెలిపారు.
నార్సింగి దారి దోపిడీ కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కానిస్టేబుల్ రాజుపై దాడికి పాల్పడ్డ కరణ్ సింగ్‌పై నేర చరిత్ర ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.