సీఎం జగన్మోహన్ రెడ్డిపై ఏపీలో శాసనమండలిలో విపక్షనేత యనమల తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నేరగాళ్లకు దేవుడు మొట్టికాయలేస్తాడని నేరగాళ్లే అనడం విడ్డూరం.దొంగే.. ‘‘దొంగ దొంగ’’ అన్నట్లుగా ఉంది జగన్ నైజం. రాష్ట్రంలో అసలు నేరగాడెవడు..? 13 ఛార్జిషీట్లున్న వ్యక్తి నేరగాడా, ఏ ఛార్జిషీట్ లేనోడు నేరగాడా..? రూ 43 వేల కోట్లు దోచేశాడని సిబీఐ చెప్పినోడు నేరగాడా, ఏ మరకా అంటని 14ఏళ్లు సీఎంగా పని చేసిన చంద్రబాబు నేరగాడా..?వ్యవస్థలను నిర్మించినోడు నేరగాడా, ధ్వంసం చేసినోడు నేరగాడా..?ఉపాధి కల్పించినోడు నేరగాడా, ఉపాధి పోగొట్టినోడు నేరగాడా…? అందుక్కాదా మీకు దేవుడన్ని మొట్టికాయలేసింది.16నెలలు 16 మొట్టి కాయలు పడిందెవరికి..?
Read Also: Chittoor Crime: బెదిరించాలని అనుకున్నాడు.. తిరిగిరాని లోకానికి వెళ్లిపోయాడు..
నాలుగు దశాబ్దాల ప్రస్థానంలో తెలుగుదేశం ఎందరినో ఎదుర్కొంది.ఇందిరాగాంధీలాంటి ఉక్కు మనిషినే ఎదుర్కొంది.. ఆమె ముందు జగనెంత, ఓ పిపీలకం కాదా..?ఏపిలో జగన్ ఒంటరి ఎందుకయ్యారు..? ఇన్ని కేసులు, ఎన్నో నేరాలు – ఘోరాలున్నాయి కాబట్టే జగనుకు అందరూ దూరం.రాకాసి బల్లి, రాబందు వంటి అంతరిస్తున్న జాతుల్లో జగన్మోహన్ రెడ్డి ఒకడు అని తీవ్రంగా విమర్శించారు యనమల రామకృష్ణుడు.
Read Also: Pakisthan : నన్ను కోర్టులో చంపేయొచ్చు.. చీఫ్ జస్టిస్ కు ఇమ్రాన్ లేఖ