Bharatpol: జాతీయ, అంతర్జాతీయ నేరగాళ్ల నెట్‌వర్క్‌ను ట్రాక్ చేసి పట్టుకోవడం ఇప్పుడు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు మరింత ఈజీగా మారనుంది. భారతదేశంలో నేరాలు చేసి విదేశాలకు పారిపోవడం లేదా భారత్ లోని అజ్ఞాత ప్రాంతాల్లో తలదాచుకునే నేరస్థుల ఆటకట్టించేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్త టెక్నాలజీని అందుబాటులోకి తీసుకొస్తుంది. ఈ టెక్నాలజీతో ఇండియన్ పోలీసులు తక్షణమే క్రిమినల్ రికార్డులు షేర్ చేసి ఆ వివరాలను అప్‌లోడ్ చేయడంతో ఇంటర్‌పోల్‌ను అలర్ట్ చేయవచ్చు అన్నమాట. దీని కోసం ‘భారత్‌పోల్’ అనే పోర్టల్‌ను సీబీఐ తయారు చేసింది. దీన్ని ఈరోజు (జనవరి 7) కేంద్ర హోం మంత్రి అమిత్‌షా ప్రారంభించనున్నారు.
Read Also: Ghatkesar: కారు దగ్ధం కేసులో ట్విస్ట్.. సజీవదహనం అయిన ఆ జంట ఎవరంటే..!
కాగా, నేరస్థులపై సకాలంలో ఉక్కుపాదం మోపడంతో పాటు వారిని ట్రాక్ చేసి పట్టుకోవడమే ఈ ‘భారత్‌పోల్’ ముఖ్య లక్ష్యం. అయితే, సాధారణంగా భారతదేశంలో, విదేశాలలో తలదాచుకున్న నేరస్థులను అరెస్టు చేసేందుకు.. సమాచారాన్ని పొందడానికి రాష్ట్ర పోలీసులు, దర్యాప్తు సంస్థలు ఇంటర్‌పోల్‌ను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఉంటుంది. దాని కోసం రాష్ట్ర ప్రభుత్వం ముందుగా సీబీఐని కాంటాక్ట్ కావాలి.. ఆ తర్వాత సీబీఐ ఇంటర్‌పోల్‌ను సంప్రదించి అవసరమైన నోటీసులు ఇస్తుంది. ఈ మొత్తం ప్రక్రియ చాలా సంక్లిష్టంగా ఉండటంతో ‘భారత్‌పోల్’తో ఈ సమస్య సత్వర పరిష్కారం సాధ్యమవుతుందని సీబీఐ వెల్లడించింది.
Read Also: Venkatesh: పెళ్ళాలకి మీ ఫ్లాష్ బ్యాకులు చెప్పొద్దు
ఇక, తాజా టెక్నాలజీతో దర్యాప్తు సంస్థలు, రాష్ట్రాలు నేరుగా భారత్‌పోల్‌తో కనెక్ట్ అయి ఉంటాయి. నేరగాళ్ల సమాచారం లేదా స్థానాన్ని కనుగోల్సి వచ్చినప్పుడు పోలీసులు భారత్‌పోల్ ద్వారా నేరుగా ఇంటర్‌పోల్‌కు రిక్వెస్ట్ పంపిస్తారు. ఇంటర్‌పోల్ ఆ అభ్యర్థనను ఒప్పుకుంటే, సంబంధిత నేరస్థుడికి వ్యతిరేకంగా రెడ్ నోటీసు, డిఫ్యూజన్ నోటీసులు, ఇతర రకాల నోటీసులను జారీ చేస్తుంది. ఇంటర్‌పోల్‌తో కమ్యూనికేషన్‌ను ఈజీగా చేయడం, వేగవంతం చేయడమే భారత్‌పోల్ యొక్క ముఖ్య ఉద్దేశం.