ఏపీలో పోలీసుల పనితీరు మెరుగుపడిందని, పోలీసులు బెనిఫిట్స్ గురించి ఎక్కువగా చింతించకండి ప్రభుత్వం త్వరలోనే పరిష్కరిస్తుందని అన్నారు ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి.రాజమండ్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన పోలీస్ కన్వెన్షన్ సెంటర్ ను డీజీపీ కె.వి. రాజేంద్రనాథ్ రెడ్డి ప్రారంభించారు.ఏలూరు రేంజ్ డీఐజీ పాలరాజు, జిల్లా ఎస్పీ సుధీర్ కుమార్ రెడ్డి, పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ రవి ప్రకాష్ పాల్గొన్న ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న డిజిపి పోలీస్ అధికారులు, సచివాలయ మహిళా పోలీసులను ఉద్దేశించి ప్రసంగించారు.
Read Also: BJP MLA: వీధికుక్కల నిర్మూలన మీవల్ల కాదా.? అయితే నాగాలాండ్ ప్రజలను పిలవండి..
మహిళా పోలీసుల ద్వారా చిన్న చిన్న గొడవలు పరిష్కారం అవుతున్నాయని డీజీపీ అభినందించారు.గత ఏడాది కాలంలో 77వేల కేసులు తగ్గించామని తెలిపారు. ఎ.పి పోలీస్ శాఖకు ఇది చాలా పెద్ద ఘనత అంటూ కొనియాడారు. అలాగే, కాకినాడ జిల్లాలో యువతిని నడిరోడ్డుపై నరికిన వాడికి నాలుగు నెలల్లో శిక్ష వేయించామని వెల్లడించారు.ఏపీ పోలీసు శాఖపై విశ్వసనీయత పెరిగిందని, దిశ చట్టం వచ్చేలోపు ఆస్ఫూర్తితో ముందుకు వెళుతున్నామని వివరించారు.ప్రతి సిఐ, ఎస్ఐ కి 10 కేసులు చొప్పున దర్యాప్తు పూర్తిచేసేలా అప్పగిస్తున్నామని అన్నారు. హెల్మెట్ లేని వారికి జరిమానాలు వేయకండి కౌన్సిలింగ్ మాత్రమే ఇవ్వండని ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి సూచించారు.
ప్రతిపక్షాలు గొంతుక మేమెందుకు నొక్కుతామని, ఇటీవల పలు రాజకీయ పార్టీల నేతలు చేస్తున్న వ్యాఖ్యలకు డీజీపీ కె.వి. రాజేంద్రనాథ్ రెడ్డి స్ట్రాంగ్ గా కౌంటర్ ఇచ్చారు. పోలీసులు నిర్దేశించిన ప్రకారం ఖాళీ ప్రదేశాల్లోనే బహిరంగ సభలు పెట్టుకోవాలని సూచించారు. ఇరుకైన ప్రదేశాల్లో సభలు అంగీకరించమని స్పష్టం చేశారు. రాజమండ్రిలో డీజీపీ కె.వి. రాజేంద్రనాథ్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ప్రతిపక్ష నేత చంద్రబాబు నిబంధనలను అతిక్రమించి అనపర్తిలో సభ నిర్వహించడాన్ని తప్పుపట్టారు అనపర్తి కేసులపై దర్యాప్తు వివరాలు వెల్లడిస్తామని అన్నారు. కళాశాలల్లో గంజాయి అమ్మకాలపై నిఘా పెట్టామని, సమాచారం ఇస్తే చర్యలు తీసుకుంటామని అన్నారు.
Read Also: Leela Pavitra: నడిరోడ్డుపై పవిత్ర దారుణ హత్య.. అక్కడ 16 సార్లు కసితీరా పొడిచి