నటుడు సోనూసూద్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినిమాల్లో ఆయన చేసేది విలన్ క్యారెక్టర్స్ అయినా మనసు మాత్రం ఎంతో మంచిది. ఈ విషయాన్ని అనేక సందర్భాల్లో సోనూసూద్ ప్రూవ్ చేసుకున్నాడు. ముఖ్యంగా లాక్‌డౌన్ సమయంలో ఎందరికో సహాయం అందించి మన్ననలు అందుకున్నాడు. సోషల్ మీడియా ద్వారా ఎవరు ఎలాంటి సాయం అడిగినా అడుగు ముందుకేసి చేసేస్తుంటాడు. తాజాగా సోనూసూద్ హైదరాబాద్ జూబ్లీహిల్స్ పబ్ రేప్ కేసుపై ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడాడు. జూబ్లీహిల్స్‌లో మైనర్ బాలిక…
ఒకరు అధికారదర్పంతో అస్తి కోసం సొంత బామ్మర్దినే హత్య చేయించారు. మరికొందరు అధికారబలం ఉందని సామాన్యులపై దాడులకు తెగబడ్డారు.స్థానిక మహిళలపై కూడా జులుం ప్రదర్శిస్తున్న తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గతకొంతకాలంగా పెద్దపల్లి జిల్లా రామగుండం కార్పొరేటర్లు నాయకుల తీరు జిల్లావ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది..కబ్జాలు,బెదిరింపులతో రామగుండం కార్పొరేషన్లో కొందరి ప్రజాప్రతినిధుల తీరు స్థానిక ప్రజలను భయాందోళనలకు గురిచేస్తోంది.. రామగుండం కార్పొరేషన్ నిత్యం సమస్యలకు నిలయంగా మారింది.అక్కడి ప్రజాప్రతినిధులు ప్రజాసమస్యలపై కంటే దాడులు, బెదిరింపులకే ప్రాధాన్యత ఇవ్వడంతో బిక్కుబిక్కుమంటూ…
ఈమధ్య కాలంలో సోషల్ మీడియా ప్రభావం బాగా పెరిగింది. ప్రతి అంశాన్ని తమకు సంబంధించిన ప్రతి ఫోటోను యువత సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. దీన్నే అదునుగా భావించిన ఆకతాయిలు వీటిని మార్ఫింగ్ చేస్తూ.. వారిని బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం అంటే.. ఆకతాయులకు టార్గెట్ గా మారడమే.. కాబట్టి యువత ఆచీ తూచీ వ్యవహరించాలి.
ఫ్రెండ్లీ పోలీసింగ్‌కి అసలైన అర్థం చెబుతున్నారు సిరిసిల్ల పోలీసులు. ప్రజా చైతన్యానికి పోలీస్ నేస్తం అనే కార్యక్రమంతో ప్రజల ముంగిటనే అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. చట్టపరమైన, ఇతర సమస్యలకు కూడా పరిష్కారం చూపేలా రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసులు శ్రీకారం చుట్టారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వెంకటాపూర్ గ్రామంలో జిల్లా పోలీసులు వినూత్న ప్రయోగం చేపట్టారు. జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే పర్యవేక్షణలో శాంతిభద్రతల పరిరక్షణలో సరైన ముద్ర వేసుకుని ముందుకు సాగుతున్న జిల్లా పోలీసులు వినూత్నంగా…
ఆ పదవి నుంచి ఎవరు ఉంటారో.. మరెవరు పోతారో తెలియదు. కోర్టు నిర్ణయం.. మెడమీద కత్తిలా వేళ్లాడుతోంది. కంటిపై కునుకు లేకుండా చేస్తోందట. ఆ సంగతేంటో ఈ స్టోరీలో చూద్దాం. హైకోర్టు విచారణతో సభ్యుల ఉలికిపాటు అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్టుగా మారిపోయింది తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సభ్యుల పరిస్థితి. ప్రస్తుత రోజుల్లో టీటీడీ బోర్డులో సభ్యుడంటే ఆషామాషీ విషయం కాదు. ఎక్కడెక్కడ నుంచో సిఫారసులు వస్తున్నాయి. పారిశ్రామిక వేత్తలూ పోటీపడుతున్నారు. గతంలో…
అభం శుభం తెలియని మైనర్ బాలికలు అన్యాయానికి గురవుతున్నారు. తెలిసి తెలియని వయస్సులో కొందరు తప్పుచేస్తే.. మరికొందరు మోసపూరిత మాటలకు బలైపోతున్నారు.. ఆర్దిక ఇబ్బందులు, సమాజం పట్ల అవగాహనా రాహిత్యం, ఆధునిక ప్రపంచం పట్ల మక్కువ, అరచేతిలో ఇంటర్ నెట్ బాలికలను చిన్న వయస్సులోనే మోసపోయేలా.. మరికొందరు తప్పుదారి పట్టేలా చేస్తుంది. మోసమైనా, మోజైనా అంతిమంగా బాలికలే నష్టపోవడం ఆందోళన కలిగిస్తుంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఆందోళన కలిగిస్తున్న మైనర్ బాలికల అత్యాచార ఘటనలు సభ్య సమాజాన్ని…
రాష్ట్రంలో రాజకీయంగా ముందడుగు వేసేందుకు ప్రయత్నిస్తున్నారు. మాజీ ఐఎఎస్ అధికారి ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్. నల్లగొండ జిల్లాలో పర్యటించిన ఆయన కేసీఆర్ ప్రభుత్వంపై ఒక స్థాయిలో విరుచుకుపడ్డారు. బహుజనులు బాగుపడాలంటే బహుజన రాజ్యం రావాలన్నారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా బంజారా బిడ్డలే అత్యాచారానికి గురవుతున్నారు. నక్కలగండి ఎస్సెల్బీసీ ప్రాజెక్టుల్లో భూములు కోల్పోయిన రైతులు సెక్యూరీటీ గార్డులుగా పనిచేస్తున్నారన్నారు ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్. సీఎం జీతం 4, 25 లక్షలు వుంటే మాస్ గిరిజన బిడ్డలు…
సోషల్ మీడియా బాగా విస్తరించింది. అపరిచిత వ్యక్తులు ఏవో మెసేజ్‌లు పంపుతూ వుంటారు. వాటికి స్పందించారంటే అంతే సంగతులు. మిమ్మల్ని చాలా తెలివిగా బుట్టలో వేసుకుంటారు దుండగులు. అనవసరమైన మెసేజ్‌లకు రిప్లై ఇస్తే, జేబులకు చిల్లుపడడం ఖాయం. హైదరాబాద్‌లో అనేక మంది నుంచి భారీగా డబ్బులు వసూలు చేసింది కిలాడీ గ్యాంగ్. సెల్‌ఫోన్‌కు అవసరమైన మెసేజ్‌లతో పాటు అనవసరమైన మెసేజ్‌లు వస్తుంటాయి. ఒక నెంబర్ పంపించి… మీతో స్నేహం చేయాలని ఉందనో, లేక మీకు ఫోటోలు పంపించాం…