Narsingi Robbery Case: : నార్సింగి దారి దోపిడీ కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కానిస్టేబుల్ రాజుపై దాడికి పాల్పడ్డ కరణ్ సింగ్‌పై నేర చరిత్ర ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. మైనర్‌గా ఉన్నప్పటి నుంచి నేరాలకు అలవాటు పడ్డాడు కరణ్ సింగ్. కరణ్ సింగ్ ఆగడాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. వైట్నర్ వంటి మత్తుపదార్థాలు తీసుకోవడం, అమ్మాయిలను వేధించడం, దాడిచేసి డబ్బులు, నగలు దోచుకోవడం అలవాటుగా మార్చుకున్నాడు కరణ్ సింగ్. మైనర్ స్టేజ్ నుంచే కత్తితో దాడి చేయడం, చంపేందుకు కూడా వెనుకాడలేదు.
Boy Shoots Teacher: టీచర్‌ను తుపాకీతో కాల్చిన ఆరేళ్ల బుడ్డోడు.. అందుకేనా?
10 మందితో కరణ్ సింగ్ బ్యాచ్ ఏర్పాటు చేసుకున్నాడు. చోరీ చేసిన బైక్‌లపై అత్తాపూర్, రాజేంద్రనగర్, చంద్రాయణగుట్ట, పహాడిషరీఫ్ ప్రాంతాల్లో హల్చల్ చేసేవాడని పోలీసులు గుర్తించారు. తల్వార్‌తో దాడి చేసి దారిదోపిడీలకు పాల్పడేవాడు. ఔటర్ రింగ్ రోడ్డులో రాత్రివేళల్లో సెక్స్ వర్కర్స్ కోసం కరణ్ సింగ్ నిత్యం చక్కర్లు.. వారివద్దకు వచ్చే విటులే టార్గెట్‌గా దాడి-దోపిడీలకు పాల్పడేవాడు. అత్తాపూర్ పరిధిలో కరణ్ సింగ్‌పై 5 కేసులు నమోదు కాగా.. ఇందులో 3 కేసులు మైనర్‌గా ఉన్నప్పుడే నమోదయ్యాయి. కరీంనగర్‌లో ఖరీదైన కారు చోరీ కేసు.. జగద్గిరిగుట్టలో ప్రేమ పేరుతో మైనర్‌పై వేధింపులకు పాల్పడగా కేసు నమోదైంది. అత్తాపూర్ పీఎస్‌లో ఇప్పటికే కరణ్ సింగ్‌పై రౌడీ షీట్ ఓపెన్ చేయబడింది.