Istabul Court: టర్కీలో ముస్లిం మత ప్రబోధకుడు అద్నాన్ అక్తర్ కు టర్కీలోని ఇస్తాంబుల్ కోర్టు ఏకంగా 8 వేల 6 వందల 58 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. ఇస్తాంబుల్ కోర్టు చరిత్రలోనే ఇది కనీవినీ ఎరుగని విధమైన శిక్ష. 66 ఏళ్ల అద్నాన్ 2018 నుంచి జైలులోనే ఉన్నాడు. అద్నాన్ టీవీ షోలలో భారీ మేకప్, పొట్టి దుస్తులు ధరించిన మహిళల మధ్య కూర్చొని మతమరమైన చర్చలు నిర్వహించేవాడంట. వారితో చాలా అసభ్యంగా ప్రవర్తించేవాడు కూడా.. ఈ క్రమంలో అతడిపైన ఫోకస్ పెట్టిన టర్కీ.. అతడి ఛానల్స్ పైన నిషేధం విధించింది. పోలీసులు, అవినీతి నిరోధక శాఖ అధికారులు అద్నాన్ నివాసాలపై దాడులు చేసి 2018లోనే అతడిని అరెస్టు చేశారు. అతని అనుచరులను కూడా అదుపులోకి తీసుకున్నారు.
Read Also: Viral video: అరె అయ్యా..! అది సైకిల్ అనుకున్నావా.. ఏం అనుకున్నావ్..?
అయితే విచారణలో పోలీసులకి కళ్లు బైర్లు కమ్మే విషయాలు తెలిసాయి. నేరాలను, నేరస్తులను ఎంకరేజ్ చేయడం, మైనర్లను లైంగికంగా వేధించడం, అత్యాచారం కేసులు, బ్లాక్ మెయిలింగ్ ఇలా అభియోగాలు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో అతనిపైన 10 కేసులు నమొదు కావడంతో దోషిగా తేల్చిన న్యాయస్థానం కఠిన కారాగార శిక్షను విధించింది. అతనితో పాటుగా అతని అనుచరులకు కూడా అదే శిక్షను విధించింది న్యాయస్థానం. మహిళలపై లైంగిక దాడులు, మైనర్లపై లైంగిక వేధింపులు, మోసం, మిలిటరీపై గూఢచర్యం తదితర కేసుల్లో ఆయనకు గత ఏడాదే కోర్టు 1,075 ఏళ్ల శిక్షను విధించింది. కానీ, ఈ తీర్పును ఇస్తాంబుల్ క్రిమినల్ కోర్టు కొట్టేసి కేసును మళ్లీ విచారించింది. అద్నాన్‌తో పాటు మరో పదిమంది అనుచరులకు కలిపి ఏకంగా 8,658 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది.