దేశవ్యాప్తంగా మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాలు నిత్యకృత్యంగా మారాయి. ఎన్ని చట్టాలు వచ్చినా కామాంధుల తీరు మారడం లేదు. ఇక తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి దారుణంగా మారింది. కన్న బిడ్డలను కాపాడుకోవడం తల్లిదండ్రులకు కత్తిమీద సాములాగా మారింది. తాజాగా రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలోని పెత్తుల్లా గ్రామంలో జరిగిన ఓ ఘటన వెలుగులోకి వచ్చింది.
పాఠశాలలో బాలికతో మాట్లాడినందుకు పాఠశాల విద్యార్థిపై దాడి చేసిన ఘటన కర్ణాటకలోని హుబ్బళ్లిలో సోమవారం చోటుచేసుకుంది. హుబ్బళ్లి-ధార్వాడ్ పోలీస్ కమిషనర్ ఎన్.శశికుమార్ మాట్లాడుతూ.. ఐదు నుంచి ఆరుగురు సభ్యుల ముఠా ఓ పాఠశాల విద్యార్థిపై దాడికి పాల్పడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారిందని తెలిపారు.
ధన్వంతరి ఇంటర్నేషనల్ ఫౌండేషన్ పేరుతో భారీ మోసం జరిగింది. ఫౌండేషన్‌లో పెట్టుబడులు పెడితే అధిక వడ్డీ ఇస్తామంటూ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు పంతంగి కమలాకర్ శర్మ ప్రచారం చేసినట్లు బాధితులు వెల్లడించారు.
ఓ యువకుడు సెల్‌ఫోన్ కొనివ్వలేదని ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆదిలాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. తలమడుగు మండలంలోని ఉమ్రి గ్రామ శివారులో చెట్టుకు ఉరేసుకొని మేస్త్రం కృష్ణ అనే యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
Pakistan: 15 రోజుల వయసున్న నవజాత శిశువును బ్రతికి ఉండగానే ఓ తండ్రి ఖననం చేశాడు. బిడ్డ ఆసుపత్రి ఖర్చులు భరించలేక ఈ పని చేశానని చెప్పుకొచ్చాడు. గుండెలు పిండేసే ఈ హృదయవిదారక ఘటన పాకిస్థాన్ దేశంలోని సింధ్ ప్రావిన్స్‌లో వెలుగులోకి వచ్చింది.
ఈ దొంగ మామూలోడు కాదండోయ్.. గుజరాత్ పోలీసులు ఇటీవల అనేక రాష్ట్రాల్లో దోపిడీలకు పాల్పడిన ఓ దొంగను ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. గత నెలలో రోహిత్ కానుభాయ్ సోలంకి వాపిలో లక్ష రూపాయల చోరీ కేసులో పోలీసుల వలకు చిక్కాడు.
ఇటీవలి కాలంలో యువత ప్రేమ అంటూ లేని చిక్కులు తెచ్చుకుంటున్నారు. పెద్దలను ఎదిరించి ప్రేమించి పెళ్లి చేసుకుని ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. కూతురు ప్రేమించిన వ్యక్తి తమ కులానికి చెందిన వ్యక్తి కాదని కన్న తల్లిదండ్రులు దారుణాలకు పాల్పడిన ఘటనలు చాలానే ఉన్నాయి. సమాజంలో పరువు ఎక్కడపోతుందో అని భావించిన తల్లిదండ్రులు ప్రాణాలు కూడా తీసేందుకు వెనకాడటం లేదు. ఈ క్రమంలో ఓ సంచలన ఘటన వెలుగు చూసింది.
యూపీలోని ఝాన్సీలో షాకింగ్ కేసు వెలుగులోకి వచ్చింది. ఒక మహిళ తన భర్త, అత్తమామల ప్రేమను పొందడానికి ఒకసారి కాదు మూడు సార్లు వివాహం చేసుకుంది. అయినప్పటికీ ఆమె జీవితంలో ఆనందం కరువైంది. చివరికి ఆ మహిళ ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్లింది. టాయిలెట్ క్లీనర్ తాగించి తన కుమార్తెను భర్త, అత్తమామలు హత్య చేశారని ఆమె తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. పెళ్లయినప్పటి నుంచి భర్త తనను కొట్టి డబ్బులు డిమాండ్ చేసేవాడని చెబుతున్నారు. ఈ క్రమంలో టాయిలెట్…
పెళ్లయిన తొమ్మిదేళ్ల తర్వాత భర్తను వదిలేసి ఓ యువకుడితో ప్రేమాయణం నడిపించింది. తన భర్తకు దూరంగా వెళ్లి ప్రియుడితో కలిసి సంతోషంగా జీవిస్తుంది. ఇద్దరూ కలిసి నెలల తరబడి సంతోషంగా జీవించారు. కానీ.. ఒకరోజు అకస్మాత్తుగా ఆ మహిళ భర్త తన జీవితంలోకి ఎంట్రీ ఇచ్చాడు. భార్యాభర్తల మధ్య సయోధ్య కుదిరి వారు ప్రియుడిని హత్య చేశారు. ఆహారంలో విషం కలిపి ప్రేమించిన యువకుడిని మహిళ హత్య చేసింది. హత్య అనంతరం భార్యాభర్తలిద్దరూ పారిపోయేందుకు ప్రయత్నించగా.. పోలీసులు…
Marriage proposal: బీహార్‌లో దారుణం జరిగింది. తనను పెళ్లి చేసుకునేందుకు నిరాకరించిన ఓ వ్యక్తిపై మహిళ దారుణంగా ప్రవర్తించింది. అతడి ప్రైవేట్ పార్టుల్ని కోసేసింది. ఈ ఘటన రాష్ట్రంలోని సరన్ జిల్లాలో చోటు చేసుకుంది. యువకుడి ప్రైవేట్ భాగాలు కత్తిరించి ఫ్లష్ చేసినందుకు నర్సింగ్‌హోమ్‌లో పనిచేస్తున్న మహిళను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.