MP Shocker: ఏడుస్తుందని ప్రియురాలి కుమార్తెను చంపేసిన వ్యక్తి..
- ఏడ్చినందుకు ప్రియురాలి కుమార్తె హత్య..
- 20 రోజుల క్రితం భర్తను వదిలేసి ప్రియుడి ఇంటికి పాప తల్లి..
- అర్ధరాత్రి ఏడ్చినందుకు కోపంతో దారుణం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MP Shocker: మధ్యప్రదేశ్‌లో దారుణం వెలుగులోకి వచ్చింది. ప్రియురాలి కుమార్తె రాత్రి సమయంలో ఏడ్చినందుకు ఓ వ్యక్తి పసికందును నేలకేసి కొట్టి హత్య చేశాడు. రాష్ట్రంలోని శివపుర జిల్లాలో ఆగస్టు 5న అర్ధరాత్రి ఈ సంఘటన జరిగింది. పసిబిడ్డ తల్లి నేరం గురించి ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. బాలికను చంపేసిన వ్యక్తి ప్రస్తుతం పరారీలో ఉన్నాడు.
బామోర్కల పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ సంఘటన జరిగింది. చనిపోయిన ఒకటిన్నర ఏళ్ల బాలికను ఛాయాగా పోలీసులు గుర్తించారు. ఆమె తల్లి జయంతి(35), నిందితుడు భయ్యాలాల్(25)లో కలిసి ఉంటుంది. ఛాయా తల్లి జయంతి ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం.. రాత్రి 10 గంటల సమయంలో రాత్రి భోజనం చేసి నిద్రపోయామని, అర్ధరాత్రి సమయంలో పాప లేసి ఏడ్చిందని, దీంతో నిద్ర పాడైందనే కోపంతో భయ్యాలాల్ పసిబిడ్డ అని చూడకుండా నేలకేసి కొట్టాడని చెప్పింది. చిన్నారి నోరు, తల నుంచి తీవ్ర రక్తస్రావం జరిగిందని, ఆ తర్వాత నిందితుడు చిన్నారి గొంతు నులిమి హత్య చేశాడని ఫిర్యాదులో పేర్కొంది. బాలిక తల్లి జయంతి రాత్రంతా చనిపోయిన పాప శరీరాన్ని తన ఛాతీపై పెట్టుకుని ఉందని పోలీసులు తెలిపారు.
Also Read
- Se*xual Assault: తుక్కుగూడ నర్సు శిరీష హత్య కేసు.. లైంగిక దాడి చేసినట్లు నిర్ధారణ.. నిందితుడి అరెస్ట్.!
- Shamli Encounter: అంకిత్ బలియాన్ హత్య కేసులో కీలక మలుపు.. పోలీసుల ఎన్కౌంటర్లో ఇద్దరు నిందితులు హతం
- Uttar Pradesh: యూపీలో హిందూ లీడర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ హత్య..
- Mumbai: ప్రియురాలిపై అనుమానం.. విషం కలిపిన కూల్‌డ్రింక్‌తో హత్య
Read Also: Viral Video: కామాంధుడి తిక్కకుదిర్చిన అమ్మాయి.. నడిరోడ్డుపై.?
ప్రేమికుడితో కలిసి జీవించేందుకు సదరు మహిళ తన పసిపాపతో భర్తను విడిచిపెట్టినట్లు తెలిసింది. ఛాయా మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలింపు చేపట్టారు. ఈ హత్య గురించి జయంతి అత్తకు సమాచారం అందించారు. అయితే, ఆమె భర్త పరమానంద్‌ని పోలీసులు సంప్రదించలేకపోయారు. ఇద్దరు కూలీ పనిచేసుకుంటూ బెంగళూర్‌లో కలిశారని, పదేళ్ల క్రితం వివాహం చేసుకున్న జయంతి 20 రోజుల క్రితం భర్తను వదిలేసి ప్రియుడి వద్దకు వచ్చిందని పోలీసులు తెలిపారు. జయంతికి ముగ్గురు సంతానం కాగా ఛాయా చిన్నది. బెంగళూర్ నుంచి శివపురి వచ్చే సమయంలో ఛాయాను తీసుకుని వచ్చిందని, వీరిద్దరు భార్యభర్తలుగా జిల్లాలోని ఓ గ్రామంలో జీవిస్తున్నారని పోలీసులు తెలిపారు.
తాజావార్తలు
-
Ayodhya Ram Mandir: రూ.4కోట్లు చెక్ ఇచ్చింది.. అకౌంట్లో చూస్తే 3 రూపాయలే ఉన్నాయ్..అయోధ్య చెక్ బౌన్స్ కథ వింటే..
-
NBK 112 : బాలయ్య – కొరటాల సినిమాలో తమిళ స్టార్ హీరో?
-
Se*xual Assault: తుక్కుగూడ నర్సు శిరీష హత్య కేసు.. లైంగిక దాడి చేసినట్లు నిర్ధారణ.. నిందితుడి అరెస్ట్.!
-
Sardar 2: కార్తి ‘సర్దార్ 2’ ట్రైలర్ కు టైమ్ ఫిక్స్ చేసిన మేకర్స్!
-
CTET 2026: సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్.. దరఖాస్తుకు రేపే చివరి ఛాన్స్..
ట్రెండింగ్
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్‌లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!