Off The Record: అంచనాలను అందుకోని కమలం..! బీజేపీ ఎందుకు ప్రభావం చూపలేకపోయింది..?
- తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో అంచనాలను అందుకోని కమలం..
- ఆ జిల్లాల్లో బీజేపీ ఎందుకు ప్రభావం చూపలేకపోయింది ?..
- షరామాములుగానే.. ఆ జిల్లాల్లో ఎందుకు చతికిల పడింది ?..
- తెలంగాణలో కమల వికాసం అనేది అగ్ర నేతల మాటల వరకేనా ?..
- చేతల్లో చూపించడం లేదా ? ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Off The Record: తెలంగాణలో జరిగిన మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ ఆశించిన స్థాయిలో ఫలితాలు సాధించలేదకపోయింది. 116 మున్సిపాలిటీలు…7 కార్పొరేషన్లలో పార్టీల బలాబలాలు ఏంటో తేలిపోయింది. ఏ పార్టీ ఎక్కడ సత్తా చాటింది ఎక్కడ చతికిల పడ్డది క్లారిటీ వచ్చింది. కమలం పార్టీ గతంలో ఎక్కడ అయితే ప్రభావం చూపిందో…ఇప్పుడు కూడా బలాన్ని నిరూపించుకుంది. ఆ మూడు ఉమ్మడి జిల్లాల ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాల్లో…ఆ పార్టీ గతం కన్నా ఏం మాత్రం మెరుగు పడలేదు. లెక్కలు చూస్తే ఈ మూడు ఉమ్మడి జిల్లాల్లో కలిపి మొత్తం 890 వార్డులు ఉన్నాయి. ఇందులో బీజేపీ 29 వార్డులను మాత్రమే గెలుచుకుంది. మొత్తం రాష్ర్ట వ్యాప్తంగా బీజేపీ 11.2 శాతం వార్టులను గెలుచుకుంటే…ఈ మూడు ఉమ్మడి జిల్లాల్లో కేవలం 3.2 శాతానికే పరిమితం అయింది. మొత్తం 38 మున్సిపాలిటీల్లో 22 మున్సిపాలిటీల్లో బీజేపీ ఒక్క వార్డు కూడా గెలుచుకోలేదు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో మొత్తం 407 వార్డులు ఉంటే…ఇందులో బీజేపీ గెలిచిన వార్డులు 19 మాత్రమే.
బీజేపీ ఖాతా తెరవని మున్సిపాలిటీలు 9 ఉన్నాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాల్లో 8 మున్సిపాలిటీల్లో మొత్తం వార్డులు 223 ఉండగా, బీజేపీ గెలిచిన వార్డులు జస్ట్ రెండు మాత్రమే. బీజేపీ ఖాతా తెరవని మున్సిపాలిటీలు 6 ఉన్నాయి. ఇక ఉమ్మడి వరంగల్ జిల్లా మొత్తం 12 మున్సిపాలిటీల లో 260 వార్డ్ లకు ఎన్నికలు జరిగాయి. 7 మున్సిపాలిటీలలో అసలు ఖాతానే తెరవలేదు. ఈ లెక్కలను బట్టి ఆ మూడు ఉమ్మడి జిల్లాలో కమలం పార్టీ ఎంత దయనీయ స్థితిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. పట్టణ ప్రాంతాల్లోనే ఆ పార్టీ అలా ఉంటే…గ్రామీణ ప్రాంతాల్లో ఇంకెలా ఉందో అర్థం చేసుకోవచ్చని ఆ పార్టీ నేతలే అంటున్నారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో కూడా బిజెపి ఇక్కడ దారుణమైన ఫలితాలనే చవి చూసింది. మున్సిపల్ ఎన్నికల్లో సైతం అదే పరిస్థితి. పార్టీ నాయకత్వం ఇక్కడ ప్రత్యేక దృష్టి పెట్టకపోతే…రాష్ట్రంలో అధికారం అందుకోవడం అనేది అందని ద్రాక్షనే అనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది.
Also Read
తాజావార్తలు
-
Rahul Gandhi: బ్రిక్స్ డిన్నర్ మెనూపై రాహుల్ రాజకీయం..
-
India: అమెరికా, చైనాలను దాటి భారత్ నెంబర్-1.. యూఎస్ ఆర్థికవేత్త సంచలన వ్యాఖ్యలు..
-
Ganesh Idol Protest: ‘వినాయకుడి’తో వినూత్న నిరసన.. దేవుడికి ఈ తిప్పలు తప్పలేదా..?
-
New Smart Phone: 10,000mAh బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా.. కనీవినీ ఎరుగని రీతిలో రెడ్ మీ కొత్త సిరీస్.. సెప్టెంబర్ 15న లాంచ్..
-
AA24 Secret Out: ఇండస్ట్రీని షేక్ చేస్తున్న AA24 సీక్రెట్ లీక్! అల్లు అర్జున్ అడ్డాలో ఆ స్టార్ రైటర్..
ట్రెండింగ్
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!