డ్రగ్స్ స్మగ్లింగ్‌కు సంబంధించిన కేసులో రంగారెడ్డి జిల్లా కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. హైదరాబాద్‌కు డ్రగ్స్ తీసుకొచ్చిన టాంజానియా దేశానికి చెందిన ఓ యువతికి ఏకంగా 12 ఏళ్ల జైలు శిక్ష విధించింది. వివరాల ప్రకారం.. 2021వ సంవత్సరంలో టాంజానియాకు చెందిన ఓ యువతి హైదరాబాద్‌కు డ్రగ్స్ తీసుకొచ్చింది.
Viral Video: ఉత్తర్ ప్రదేశ్‌లో ఓ యువకుడికి తాలిబాన్ తరహా శిక్ష విధించారు. అమ్రోహా జిల్లాలో ఈ అవమానకరమైన ఘటన జరిగింది. యువకుడి మొహానికి నల్లరంగు పూసి, సగం గుండు కొరిగించి, మెడలో చెప్పు దండ వేసి ఊరేగించారు.
ఓ ప్రబుద్ధుడు తాను ఐఏఎస్ ఆఫీసర్ని అంటూ యువతిని బురిడీ కొట్టించి పెళ్లి చేసుకోవడంతో పాటు.. ఆమె వద్ద నుంచి రూ.2 కోట్లు వసూలు చేశాడు. మళ్లీ అదనపు కట్నం కోసం వేధింపులకు గురి చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. నిందితుడితో పాటు అతడి తల్లిదండ్రులను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన మేడ్చల్ జిల్లా జీడిమెట్లలోని బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లోని ఓ ఫామ్‌హౌస్‌లో రియల్టర్ దారుణహత్యకు గురయ్యాడు. కేకే ఫామ్‌హౌస్‌లో కమ్మరి కృష్ణను కొందరు దుండగులు దారుణంగా హత్యకు చేశారు.
Ghazipur Triple Murder: గత రెండేళ్లుగా ప్రేమిస్తున్న తన స్రేయసితో పెళ్లికి ఒప్పుకోకపోవడంతో తల్లిదండ్రులను, సోదరుడిని అత్యంత దారుణంగా 15 ఏళ్ల బాలుడు హత్య చేశాడు. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ ఘాజీపూర్ జిల్లాలో చోటు చేసుకుంది.
TDP Worker Killed: అనంతపురం జిల్లా రాయదుర్గంలో దారుణం చోటు చేసుకుంది. రాయదుర్గం మండలం మెచ్చరి గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త ఆదెప్పను దారుణ హత్య చేశారు. ప్రత్యర్థులు కత్తులతో విచక్షిణారహితంగా పొడిచి చంపి.. మృతదేహాన్ని గ్రామ శివారులో పడవేశారు.
MP Shocker: మధ్యప్రదేశ్ గ్వాలియర్‌లో దారుణం జరిగింది. 28 ఏళ్ల నర్సుపై సహోద్యోగి గత రెండేళ్లుగా అత్యాచారానికి పాల్పడుతున్నాడు. గ్వాలియర్ ఆస్పత్రిలో పనిచేస్తున్న బాధిత మహిళ దుస్తులు మార్చుకునే గదిలో నిందితుడు అత్యాచారానికి పాల్పడ్డాడు.
ఏసీబీ పేరు చెప్పి ఎంపీడీవోకు ఐదు లక్షల రూపాయలు టోకరా వేశారు కేటుగాళ్లు. సిద్దిపేట జిల్లా బెజ్జంకి ఎంపీడీవో గా విధులు నిర్వహిస్తున్న బండి లక్ష్మప్పను కేటుగాళ్లు బురిడీ కొట్టించారు. ఏసీబీకి ఫిర్యాదు వచ్చిందని ఎంపీడీవోకు నిందితులు ఫోన్ చేశారు. ఏసీబీలో తనపై కేసు నమోదు అవుతుందని ఎంపీడీవోను ఆగంతుకులు బెదిరించారు.
హైదరాబాద్‌లోని గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో బైక్ దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. స్పెషల్ డ్రైవ్ వాహనాల తనిఖీల్లో ఈ ముఠా పట్టుబడింది. ఐదుగురు సభ్యుల ముఠాను గచ్చిబౌలి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.