సంగారెడ్డి జిల్లాలో భారీగా బంగారం పట్టుబడింది. ముంబై నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఆరెంజ్ ట్రావెల్స్ బస్సులో 4.8 కిలోల బంగారాన్ని టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు.
Dowry harassment: అన్యోన్యంగా సాగాల్సిన సంసారంలో భర్త కట్న పిచాశిగా మారాడు. ఉత్తర్ ప్రదేశ్ లక్నోకి చెందిన 40 ఏళ్ల మహిళను దారుణంగా వేధించాడు. చైనాలో ఉద్యోగం చేసే భర్త, ఆ దేశంలో ఉన్న సమయంలో ఆఫ్రికా వ్యక్తితో లైంగిక సంబంధం పెట్టుకోవాలని, అశ్లీల చిత్రాలను చూడాలని ఒత్తిడి చేసేవాడని ఆమె ఆరోపించింది.
'ప్రాణాలతో ఉండి మా పిల్లలను బాగా చూసుకోలేకపోయాం... దగ్గరివారు ఎవరైనా మా పిల్లలను బాగా చూసుకుంటారని ఆశిస్తున్నాను.. ఇద్దరం మా ఇష్ట ప్రకారం ఆత్మహత్య చేసుకుంటున్నాం...' అని ఓ హోటల్లో దంపతులు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన ప్రయాగ్రాజ్లో చోటు చేసుకుంది.
గుంటూరు జిల్లా తాడేపల్లిలో ఘాతుకానికి పాల్పడ్డాడు ఓ ప్రేమోన్మాది. తన ప్రేమను అంగీకరించకపోవడంతో ఓ ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. నర్సుగా పని చేస్తున్న కావ్య(23) అనే యువతిపై బ్లేడుతో దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో కావ్యకు గాయాలు అయ్యాయి.
ఆంధ్రప్రదేశ్లో రాజకీయ హత్యల పరంపర కొనసాగుతోంది. తాజాగా నంద్యాల జిల్లాలో సంచలనం చోటుచేసుకుంది. నంద్యాల జిల్లా మహానంది మండల పరిధిలోని సీతారామపురంలో వైసీపీ నేత సుబ్బారాయుడిని దుండగులు రాళ్లతో అత్యంత కిరాతకంగా కొట్టి చంపేశారు. 40 మంది దుండగులు దాడికి పాల్పడ్డారు.
నంద్యాల జిల్లా మహానంది మండలం సీతారామపురంలో 65 ఏళ్ల వృద్ధుడు పెద్ద సుబ్బారాయుడు దారుణ హత్యకు గురయ్యారు. పెద్ద సుబ్బారాయుడు ఇంటిపై తెల్లవారుజామున ప్రత్యర్థులు దాడికి పాల్పడి.. ఆయన ఇంట్లోని సామగ్రిని, వస్తువులను ధ్వంసం చేశారు.