Kanjara Gang: కరుడుగట్టిన కంజర గ్యాంగ్ ఆట కట్టించిన సంగారెడ్డి పోలీసులు
- ఘరానా దొంగలుగా పేరొందిన కంజర గ్యాంగ్ అరెస్ట్
- గ్యాంగ్ ఆట కట్టించిన సంగారెడ్డి జిల్లా పోలీసులు
- బస్సులో బంగారం చోరీ ఘటన ఛేదించిన పోలీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kanjara Gang: అదో దోపిడి గ్యాంగ్. హైవేలపై కాపు కాస్తుంది… దాబాల వద్ద మాటు వేస్తుంది…హైదరాబాద్ నుంచి ముంబై వెళ్లే ట్రావెల్స్ బస్సులే టార్గెట్ గా రెక్కి నిర్వహిస్తుంది. ప్రయాణికులు బస్సులో నుంచి దిగగానే అందిన కాడికి దోచుకు వెళ్తారు. ఇది మధ్యప్రదేశ్ కంజర గ్యాంగ్ ముఠా పని. చోరీల్లో ఆరితేరిన ఈ గ్యాంగ్ ఆట కట్టించారు సంగారెడ్డి జిల్లా పోలీసులు.
గత నెల జూలై 26న అర్థరాత్రి సంగారెడ్డి జిల్లాలోని NH-65పై భారీ చోరి జరిగింది. చిరాగ్ పల్లి వద్ద కోహినూర్ దాబా వద్ద ఆగి ఉన్న ఆరెంజ్ ట్రావెల్స్ బస్సులో నుంచి 2.9 కిలోల బంగారు ఆభరణాల బ్యాగును దొంగలు ఎత్తుకెళ్లారు. హైదరాబాద్ నుంచి నగలను ముంబై తీసుకెళ్తున్న గుమాస్తా గమనించి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సీసీ కెమెరాల్లో చోరీ ఘటన ఆధారంగా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మొదట్లో గుమాస్తానే అనుమానించిన పోలీసులు ఆ తర్వాత వేరే కోణంలోనూ విచారణ చేపట్టారు.
Also Read
- AMOLED డిస్‌ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
- 200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
- Windfall Tax Cut on Petrol, Diesel & ATF: కేంద్రం కీలక నిర్ణయం.. పెట్రోల్, డీజిల్, ATFపై విండ్‌ఫాల్ ట్యాక్స్ తగ్గింపు.. కొత్త రేట్లు ఇవే..!
- Road Accident: టిప్పర్ లారీ బీభత్సం.. తండ్రి కూతురు మృతి..!
Read Also: Macherla Crime: మాచర్లలో విద్యార్థిని మృతి కేసులో ట్విస్ట్.. తండ్రి వల్లే..!
కేసును దర్యాప్తు చేసిన పోలీసులు చోరికి పాల్పడింది అంతరాష్ట్ర ముఠా పనేనని అనుమానించారు. ఈ నెల 4న ఎన్ హెచ్ 65 పై బర్థిపూర్ చౌరస్తా వద్ద పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తున్నారు. ఇంతలో హైదరాబాద్ కి వెళ్తున్న బ్రీజా కారుని పోలీసులు ఆపి విచారణ చేస్తుండగా.. కారులోని వ్యక్తులు పారిపోయే ప్రయత్నం చేశారు. వెంటనే పోలీసులు అలెర్ట్ కావడంతో వెహికిల్ చేజ్ చేశారు. దింతో కారు, కారులో ఉన్న డ్రైవర్ కాకుండా కారులో ఉన్న మరో ముగ్గురు పారిపోయారు. వెంటనే కారులో ఉన్న వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం బయటపడింది.
కారులో ఉన్న నిందితుడు మధ్యప్రదేశ్ ధార్ జిల్లా కంజర గ్యాంగ్‌గా చెప్పాడు. కోహినూర్ దాబా వద్ద ఆరెంజ్ ట్రావెల్స్ బస్సులో చోరీ చేసిన సొమ్ముని అమ్ముకోవడానికి అలాగే సంగారెడ్డి జిల్లాలో మరో దొంగతనానికి వెళ్తున్నట్టుగా నిందితుడు మసూమ్ ఒప్పుకున్నాడు. నిందితున్ని అరెస్ట్ చేసి నిందితులు వాడిన కారుని సీజ్ చేసి మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు జిల్లా ఎస్పీ రూపేష్. పరారీలో ఉన్న నిందితుల కోసం పోలీసు బృందాలు గాలిస్తున్నాయి.
చోరి జరిగిన పది రోజుల్లోపే ఈ కేసుని పోలీసులు చేధించడంతో జిల్లా ఎస్పీ రూపేష్ పోలీసులని అభినందించారు. కంజర గ్యాంగ్ గతంలో హైదరాబాద్ శివార్లలోనూ చోరికి పాల్పడింది. బస్సుల్లో ప్రయాణించే ప్రయాణికులు ఏ మాత్రం నిర్లక్షంగా ఉన్న ఇలాంటి ఘటనలు జరుగుతాయని నగదు, బంగారు ఆభరణాలతో ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని ఎస్పీ సూచించారు.
తాజావార్తలు
-
AMOLED డిస్‌ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
Fed Interest Rate Hike: అమెరికా ఫెడ్ కీలక నిర్ణయం.. వడ్డీ రేట్లలో 0.25% పెంపు.. భారత్‌పై ప్రభావం ఎంత?
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Windfall Tax Cut on Petrol, Diesel & ATF: కేంద్రం కీలక నిర్ణయం.. పెట్రోల్, డీజిల్, ATFపై విండ్‌ఫాల్ ట్యాక్స్ తగ్గింపు.. కొత్త రేట్లు ఇవే..!
-
IND vs AFG 3rd T20I: నేడే మూడో టీ20.. వైభవ్, ఠాకూర్‌కు ఛాన్స్.. స్టార్ ప్లేయర్లకు షాక్.. ప్లేయింగ్ 11 ఇదే!
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్‌ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!