కేవలం రూ.9వేల రూపాయలకోసం బావ బావమరిదిల మధ్య తలెత్తిన వివాదం హింసాత్మకంగా మారింది. ఇరువురి తరపున వర్గీయులు పరస్పర దాడులకు పూనుకున్నారు. ఈ ఘటనలో ఒకరు హత్యకు గురికాగా, మరో ముగ్గురు కత్తిపోట్లకు గురయ్యారు.
దేశ రాజధానిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. పిల్లలు లేని తల్లిదండ్రులు ఎంతో బాధపడుతుంటే.. ఈ కసాయి తండ్రి మాత్రం కవల ఆడపిల్లలు పుట్టారని చంపేశాడు. ఇద్దరు ఆడపిల్లలు పుట్టడం ఇష్టం లేదని.. ఈ క్రమంలో తండ్రి, అతని కుటుంబం ఆ పిల్లలను చంపి.. పూడ్చిపెట్టారు. కాగా.. ఈ ఘటనపై నిందితుడి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ క్రమంలో.. ఢిల్లీ పోలీసులు రంగంలోకి దిగి, న్యాయ ఆదేశాల మేరకు శిశువుల మృతదేహాలను బయటకు తీశారు. అనంతరం…
నంద్యాలలో దారుణం జరిగింది. వేధింపులు తాళలేక కట్టుకున్న భర్తను భార్య కత్తితో పొడిచి హత్య చేసింది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. నంద్యాలకు చెందిన వెంకటేశ్, మమత భార్యాభర్తలు. వెంకటేష్ ఫొటోగ్రాఫర్‌గా పని చేస్తున్నాడు. భార్య భర్తల మధ్య కొన్ని నెలలుగా విభేదాలు నెలకొన్నాయి.
యూపీలోని హమీర్‌పూర్‌లో ఓ సంచలన కేసు వెలుగులోకి వచ్చింది. ప్రేమికుడి చేతిలో మోసపోయిన ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది. తనతో పాటు తన ఇద్దరు పిల్లలకు విషమిచ్చి సూసైడ్ చేసుకుంది. ఒక్కసారి ముగ్గురు మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాలను అదుపులోకి తీసుకుని పోస్టుమార్టంకు తరలించారు. ఈ ఘటన ముస్కరా పోలీస్ స్టేషన్ పరిధిలోని బంద్వా గ్రామంలో చోటుచేసుకుంది.
విహార యాత్రలో విషాదం చోటుచేసుకుంది. స్నేహితులతో కలిసి సరదాగా సముద్ర తీరంలో గడిపేందుకు వచ్చిన ఇద్దరు యువకులు సముద్రంలో మునిగి మృతి చెందిన ఘటన బాపట్ల జిల్లా వేటపాలెం మండలం రామాపురం సముద్ర తీరం వద్ద చోటుచేసుకుంది.
విజయనగరం జిల్లా గజపతినగరం మండలం బంగారమ్మపేటలో మర్డర్ మిస్టరీని పోలీసులు ఛేదించారు. బంగారమ్మపేట గ్రామానికి చెందిన వివాహిత తాడితూరి అనూష (20) అనుమానాస్పద స్థితిలో సోమవారం మృతి చెందింది.
Uttar Pradesh : ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లోని మామిడితోటలో నీటిపారుదల వివాదంలో కాల్పులు జరిగిన సంఘటన వెలుగులోకి వచ్చింది. ఇక్కడ నివారి ప్రాంతంలో మామిడి తోటకు కాపలాగా ఉన్న ముగ్గురు వ్యక్తులపై దుండగులు కాల్పులు జరిపారు.
యూపీలోని బిజ్నోర్‌లో విషాదం చోటు చేసుకుంది. అక్రమ సంబంధం కారణంగా బావ, మరదలు ఆత్మహత్యకు పాల్పడ్డారు. వీరిద్దరి మధ్య ప్రేమ వ్యవహారం నడిచింది. ఈ క్రమంలో.. కొంతకాలం క్రితం వీరు ఇంట్లో నుంచి పారిపోయారు. వివరాల్లోకి వెళ్తే.. రాఖీ అనే మహిళకు ఇప్పటికే పెళ్లై ఇద్దరు పిల్లలు ఉన్నారు. మరోవైపు.. వరుసకు బావ అయ్యే డేవిడ్ అనే వ్యక్తితో సంబంధం ఏర్పడింది. వీరిద్దరు కలిసి నెల రోజుల క్రితం ఇంట్లో నుంచి పారిపోయారు. ఈ ఘటనపై కుటుంబ…
Uttar Pradesh: ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో ఘోరం చోటు చేసుకుంది. ఒక పురుషుడికి బలవంతంగా ‘‘లింగమార్పిడి’’ చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. యూపీలోని ముజఫర్‌నగర్‌లోని స్థానిక వైద్య కళాశాలకు చెందిన వైద్యులు, మరో వ్యక్తితో కుమ్మక్కై బాధితుడికి ఇలా సర్జరీ చేశారు.
మియాపూర్ బాలిక అనుమానాస్పద కేసులో కొత్త ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. బాలిక వసంతని తండ్రి హత్య చేసినట్లుగా పోలీసులు నిర్ధారించారు. మియాపూర్ పోలీసుల కథనం ప్రకారం.. తండ్రి నరేష్ బాలికను నిర్మానుష ప్రాంతంలోకి తీసుకెళ్లి తన కోరికను తీర్చాలని బలవంత పెట్టాడు.