Man kills wife: కర్ణాటకలో ఘోరం జరిగింది. పెళ్లయిన కొన్ని గంటలకే భార్యను కొడవలితో నరికి భర్త హత్య చేశాడు. ఈ ఘటన కోలార్ జిల్లాలో చోటు చేసుకుంది. 27 ఏళ్ల నవీన్ కుమార్ తన భార్య 18 ఏళ్ల లిఖిత శ్రీని హత్య చేసి, ఆ తర్వాత తను కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నవీన్ కుమార్, లిఖిత శ్రీలు ఇద్దరూ సమీప గ్రామాల నివాసితులు. ఆగస్టు 07న వీరిద్దరి వివాహం జరిగింది.
యూపీలోని ఫిరోజాబాద్‌లో దారుణం చోటు చేసుకుంది. ఓ వ్యక్తి తన భార్యతో దారుణానికి పాల్పడ్డాడు. మద్యం మత్తులో భర్త భార్యను కట్టేసి కొట్టాడు. అంతేకాకుండా.. అన్నకు సాయం చేసేందుకు తమ్ముళ్లు సహకారం అందించారు. తీవ్రంగా ఆ మహిళను కొట్టడంతో చనిపోయింది. మహిళ మృతదేహం పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి పంపించగా.. పోస్టుమార్టం నివేదికలో మహిళపై జరిగిన దారుణం బయటపడింది. పోస్టుమార్టంలో మహిళ పేగు దగ్గర ఎనిమిది అంగుళాల పైప్ లభ్యమైంది. రిపోర్టు చూసి డాక్టర్లు కూడా షాక్ అయ్యారు.
పల్నాడు జిల్లా బొల్లాపల్లి మండలం వెంకుపాలెంలో వైసీపీ కార్యకర్త ఒంటేరు నాగరాజును కిడ్నాప్ చేశారు. ఆటోలో కూరగాయలు అమ్ముకుంటున్న నాగరాజును బొలెరో వాహనంతో అడ్డుకుని.. బలవంతంగా తీసుకెళ్లిన ప్రత్యర్థులు.. అడ్డుకున్న నాగరాజు కుటుంబ సభ్యులపై దాడికి పాల్పడ్డారు.
iPhone: తన గర్ల్‌ఫ్రెండ్‌కి గిఫ్ట్ ఇవ్వడానికి ఏకంగా ఓ బాలుడు అమ్మ నగలనే దొంగిలించాడు. 9వ తరగతి చదువుతున్న విద్యార్థి తనతో గర్ల్ ఫ్రెండ్‌కి పుట్టిన రోజున ఐఫోన్ గిఫ్ట్‌గా ఇచ్చేందుకు బంగారాన్ని చోరీ చేశాడు. ఈ ఘటన నైరుతి ఢిల్లీలోని నజఫ్‌గఢ్ ప్రాంతంలో జరిగింది. ఈ ఆరోపణలపై బాలుడిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు బుధవారం తెలిపారు.
ఏలూరు జిల్లా కొయ్యలగూడెం మండలం రామానుజపురం దారుణం చోటుచేసుకుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో కట్టుకున్న భార్యను పట్టపగలే నడి రోడ్డుపై కత్తితో నరికిన హత్య చేశాడు భర్త.
అదో దోపిడి గ్యాంగ్. హైవేలపై కాపు కాస్తుంది... దాబాల వద్ద మాటు వేస్తుంది...హైదరాబాద్ నుంచి ముంబై వెళ్లే ట్రావెల్స్ బస్సులే టార్గెట్ గా రెక్కి నిర్వహిస్తుంది. ప్రయాణికులు బస్సులో నుంచి దిగగానే అందిన కాడికి దోచుకు వెళ్తారు. ఇది మధ్యప్రదేశ్ కంజర గ్యాంగ్ ముఠా పని. చోరీల్లో ఆరితేరిన ఈ గ్యాంగ్ ఆట కట్టించారు సంగారెడ్డి జిల్లా పోలీసులు.
ప్రేమించిన యువతి బంధువులు తన ఇంటిపై రాత్రి దాడి చేయడంతో ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన హైదరాబాద్‌లోని కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని మహంకాళి నగర్లో చోటుచేసుకుంది.