నంద్యాల జిల్లా వాసి బ్యాంకాక్‌లో కిడ్నాప్ అయిన కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఉద్యోగానికి బెంగుళూరు నుంచి బ్యాంకాక్ వెళ్తున్నట్టు కిడ్నాప్ అయిన మధుకుమార్ కుటుంబ సభ్యులకు చెప్పి వెళ్లాడు.
అనకాపల్లిలో దారుణం జరిగింది. అనకాపల్లి పట్టణానికి చెందిన 19 ఏళ్ల యువతిని కిడ్నాప్ చేసి ఓ యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. తన స్నేహితులతో సింహాచలం వెళ్లి వస్తున్న యువతని కిడ్నాప్ చేసి అనకాపల్లి పట్టణంలోని హ్యాపీ హౌస్ ఫంక్షన్ హాల్లో అత్యాచారానికి పాల్పడినట్లు తెలిసింది.
Woman Killed By Brothers: పాకిస్తాన్లో మైనారిటీలకే కాదు, అక్కడి మహిళలకు పెద్దగా స్వాతంత్య్రం ఉండదు. ప్రేమ పెళ్లిళ్లు చేసుకున్నా, పెద్దలకు ఎదురు చెప్పినా పరువు హత్యలు అక్కడ చాలా సాధారణం. తాజాగా కరాచీలో ఒక మహిళను సొంత సోదరులే చంపారు. మూడో పెళ్లి చేసుకోవాలనే కోరికను వెలిబుచ్చడంతో మహిళతో ఆమె సోదరులు వాగ్వాదం పెట్టుకున్నారు.
కర్నూలు నగర పరిధిలోని ట్రిపుల్ ఐటీలో విద్యార్థి ఆత్మహత్య కలకలం సృష్టించింది. భవనంపై నుంచి దూకి విజయనగరం జిల్లాకు చెందిన సాయి కార్తీక్ నాయుడు(19) ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ విద్యార్థి ట్రిపుల్ ఐటీలో ఈసీఈ మూడో సంవత్సరం చదువుతున్నాడు.
బ్యాంకాక్‌లో నంద్యాల జిల్లా వాసి కిడ్నాప్ ఘటన కలకలం రేపుతోంది. నంద్యాల జిల్లా డోన్ మండలం చిన్న మల్కాపురంకు చెందిన మధు కుమార్ అనే వ్యక్తి కిడ్నాప్ అయ్యాడు. కిడ్నాప్ చేసిన దుండగులు 8 లక్షలు డిమాండ్ చేసినట్లు తెలిసింది.
Bengaluru Hostel Murder: బెంగళూర్‌లోని ఓ హాస్టల్లో 24 ఏళ్ల యువతి కృతి కుమారిని హత్య చేయడం సంచలనంగా మారింది. నిందితుడి అభిషేక్‌ని భోపాల్‌లో పోలిసులు అరెస్ట్ చేశారు. ఈ హత్యకు దారి తీసిన కారణాలను పోలీసులు గుర్తించారు.
MP Shocker: ఇటీవల కాలంలో ఇంటర్నెట్లో ‘పోర్న్’ విపరీతంగా చూడటం నేరాలకు కారణమవుతోంది. మైనర్లు అత్యాచారాలకు, హత్యలకు పాల్పడుతుండటం ఆందోళన కలిగిస్తోంది. పిల్లలపై తల్లిదండ్రుల పర్యవేక్షణ తగ్గడం కూడా పోర్న్ అడిక్షన్ని పెంచుతోంది. తాజాగా మధ్యప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన ఈ ఘటన ఈ జాఢ్యం ఎంతలా పెరిగిందనే విషయాన్ని తెలియజేస్తోంది.
Tattoo artist: మహారాష్ట్రలో అకోలా జిల్లాలోని ముర్తిజాపూర్ పట్టణంలో అస్సాంకు చెందిన 26 ఏళ్ల మహిళా టాటూయిస్ట్ తలకు గాయాలై మృతి చెందింది. ప్రియుడే ఆమెను హత్య చేసి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. సోషల్ మీడియాలో పరిచయమైన లవర్ ఈ ఘటనకు పాల్పడినట్లు సమచారం. ప్రస్తుతం అతను పరారీలో ఉన్నాడని, పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నామని పోలీసులు చెప్పారు.
టెంపుల్ సిటీ అయిన తిరుపతిలో దారుణం జరిగింది. ఓ వ్యక్తి కత్తితో దాడి చేసి ముగ్గురిని హత్య చేసి, అనంతరం తానూ ఆత్మహత్య చేసుకోవడం తిరుపతి పద్మావతి నగర్లో కలకలం రేపుతోంది. అన్నమీద కోపంతో ఓ తమ్ముడు.. వదినతో పాటు, వారి ఇద్దరి కూతుళ్లను కిరాతకంగా నరికి చంపిన ఘటన పద్మావతి వర్సిటీ సమీపంలోని పద్మావతి నగర్లో బుధవారం రాత్రి చోటుచేసుకుంది.
AP Crime News: అన్ని రంగాల్లో అభివృద్ధి చెందినా నైతికత విషయంలో రోజు రోజుకీ దిగజారిపోతున్నాం. రోజు రోజుకు సమాజంలో ఆకృత్యాలు పెరిగిపోతున్నాయి. చిన్న పిల్లలు, బాలికలు, మహిళలపై లైంగిక దాడులు ఆగడం లేదు. కామాంధులు దేహదాహానికి అవధులు లేకుండా పోతున్నాయి. ఎన్ని చట్టాలొచ్చినా.. అస్సలు భయపడకుండా హద్దు మీరుతున్నారు. ఎక్కడ చూసినా అత్యాచారాలతో దేశం అట్టుడికిపోతోంది. నిర్భయ లాంటి ఎన్ని చట్టాలొచ్చినా బాలికల సంరక్షణ ప్రశ్నార్థకంగానే మిగిలిపోతుంది. ఇక మరో ఘటన సైతం ఆందోళన కలిగిస్తుంది.…