Crime: పనికోసం వచ్చిన గిరిజన బాలికపై భూయజమాని అత్యాచారం.. గర్భం దాల్చడంతో అబార్షన్!
- రంగారెడ్డి జిల్లా ఎర్రకుంట తండాలో దారుణం
- మైనర్ బాలికపై కామాంధుడు అత్యాచారం
- బాధితురాలు గర్భం దాల్చడంతో అబార్షన్ చేయించిన నీచుడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rangareddy Crime: మహిళలపై అత్యాచారాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. కీచకులు చిన్నా, పెద్దా తేడాలేకుండా తమ పశువాంఛ తీర్చుకుంటున్నారు. ప్రతిరోజు ఏదో ఒక మూల.. ఎక్కడో ఒకచోట బాలికలు, మహిళలపై అత్యాచారాలకు ఒడిగడుతూనే ఉన్నారు. చిన్నారులు, యువతులు, మహిళలు ఒంటరిగా కనపడితే చాలు.. మగాళ్లు మృగాళ్లుగా మారి వారి జీవితాలను అంధకారం చేస్తూ.. పైశాచిక ఆనందం పొందుతున్నారు. తాజాగా రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం ఎర్రకుంట తండాలో దారుణం జరిగింది. మైనర్ బాలికపై కామాంధుడు అత్యాచారానికి ఒడిగట్టాడు. బాధితురాలు గర్భం దాల్చడంతో అబార్షన్ చేయించాడు ఆ దుర్మార్గుడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Read Also: Boy Kidnap: మెట్‌పల్లిలో బాలుడి కిడ్నాప్ కలకలం
Also Read
- Homemade Sesame Oil: మెషిన్ అవసరం లేకుండా ఇంట్లోనే 100% స్వచ్ఛమైన నువ్వుల నూనె.. తయారీ విధానం చాలా సింపుల్!
- AP Municipal Elections: మున్సిపల్ ఎన్నికల సీట్లపై కూటమి కసరత్తు.. చంద్రబాబు ముందు పవన్ కల్యాణ్ కీలక ప్రతిపాదనలు..!
- Pet Hair Cleaning Tips: సోఫా, బెడ్, కార్పెట్‌పై పెంపుడు కుక్క లేదా పిల్లి హెయిర్ పోవడం లేదా? ఈ ట్రిక్స్‌తో ఈజీగా తొలగించండి
- 144Hz AMOLED డిస్‌ప్లే, 7,200mAh బ్యాటరీ, ZEISS కెమెరా వ్యవస్థతో Vivo V80 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
అసలేం జరిగిందంటే.. తండ్రితో కలిసి పనికి వెళ్లి గిరిజన బాలికపై ఓ కామాంధుడు కన్నేశాడు. ఆమెపై కన్నేసిన భూయజమాని కృష్ణారెడ్డి(30) బెదిరించి బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అతడికి భయపడి ఆమె నోరు విప్పలేదు. దీన్ని అవకాశంగా తీసుకుని పలుమార్లు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఫలితంగా ఆమె గర్భం దాల్చింది. బాలికను ఆ యజమాని కొత్తూరుకు తీసుకెళ్లాడు. ప్రాణానికి ముప్పు ఉంటుందని తెలిసినా వైద్యుడికి డబ్బు ఇచ్చి అబార్షన్ చేయించాడు. ఈ విషయం బయటకు పొక్కకుండా మంగళవారం తన వ్యవసాయ క్షేత్రంలో తండా, గ్రామపెద్దలను కూర్చోబెట్టి రాజీ కుదిర్చే ప్రయత్నం చేశారు. ఎలాగో తప్పు జరిగిందని.. ఎంతో కొంత ఇచ్చి రాజీ చేసుకుంటానని చెప్పుకొచ్చాడు. బాలిక డబ్బులకు లొంగలేదు. మంగళవారం సాయంత్రం శంషాబాద్ పోలీసులను ఆశ్రయించారు. ఫిర్యాదు మేరకు పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. కొత్తూర్ గ్రామంలోని శ్రీనివాస హాస్పిటల్ డాక్టర్ రంజిత్ రెడ్డి గర్భం తీసేసినట్లు తెలిసింది. నిందితుడు కృష్ణారెడ్డితో పాటు డాక్టర్ రంజిత్ రెడ్డి,మరో ఇద్దరిపై కేసు నమోదు చేసి శంషాబాద్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
తాజావార్తలు
-
Adarsha Kutumbam : ఆదర్శ కుటుంబం కోసం GV ప్రకాష్.. అసలు మ్యాటర్ ఏంటంటే?
-
Homemade Sesame Oil: మెషిన్ అవసరం లేకుండా ఇంట్లోనే 100% స్వచ్ఛమైన నువ్వుల నూనె.. తయారీ విధానం చాలా సింపుల్!
-
AP Municipal Elections: మున్సిపల్ ఎన్నికల సీట్లపై కూటమి కసరత్తు.. చంద్రబాబు ముందు పవన్ కల్యాణ్ కీలక ప్రతిపాదనలు..!
-
Shreyas Iyer History: శ్రేయస్ అయ్యర్ నయా రికార్డు.. సెంచరీ చేసిన మొదటి కెప్టెన్‌గా సర్పంచ్ సాబ్!
-
Pet Hair Cleaning Tips: సోఫా, బెడ్, కార్పెట్‌పై పెంపుడు కుక్క లేదా పిల్లి హెయిర్ పోవడం లేదా? ఈ ట్రిక్స్‌తో ఈజీగా తొలగించండి
ట్రెండింగ్
-
144Hz AMOLED డిస్‌ప్లే, 7,200mAh బ్యాటరీ, ZEISS కెమెరా వ్యవస్థతో Vivo V80 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
10,000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ మన్నిక, AMOLED డిస్‌ప్లేతో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ మొబైల్ vivo S2 FE లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే..!
-
Shreyas Iyer: నేను ఎక్కడ ఉన్నానో కూడా అర్థం కాలేదు.! కలలు నిజమయ్యాయి.. కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు.!
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?