గుంటూరు జిల్లా తాడేపల్లిలో ఘాతుకానికి పాల్పడ్డాడు ఓ ప్రేమోన్మాది. తన ప్రేమను అంగీకరించకపోవడంతో ఓ ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. నర్సుగా పని చేస్తున్న కావ్య(23) అనే యువతిపై బ్లేడుతో దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో కావ్యకు గాయాలు అయ్యాయి.
ఆంధ్రప్రదేశ్లో రాజకీయ హత్యల పరంపర కొనసాగుతోంది. తాజాగా నంద్యాల జిల్లాలో సంచలనం చోటుచేసుకుంది. నంద్యాల జిల్లా మహానంది మండల పరిధిలోని సీతారామపురంలో వైసీపీ నేత సుబ్బారాయుడిని దుండగులు రాళ్లతో అత్యంత కిరాతకంగా కొట్టి చంపేశారు. 40 మంది దుండగులు దాడికి పాల్పడ్డారు.
నంద్యాల జిల్లా మహానంది మండలం సీతారామపురంలో 65 ఏళ్ల వృద్ధుడు పెద్ద సుబ్బారాయుడు దారుణ హత్యకు గురయ్యారు. పెద్ద సుబ్బారాయుడు ఇంటిపై తెల్లవారుజామున ప్రత్యర్థులు దాడికి పాల్పడి.. ఆయన ఇంట్లోని సామగ్రిని, వస్తువులను ధ్వంసం చేశారు.
Drugs Mafia: డ్రగ్స్పై తెలంగాణ పోలీస్ ఉక్కుపాదం మోపింది. డ్రగ్స్ ని పూర్తిస్థాయిలో కట్టడి చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. అంతేకాదు డ్రగ్స్ మాట వినపడద్దని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. డ్రగ్స్ ను కట్టడి చేసేందుకు వెనుకాడ వద్దని అధికారులకు ప్రభుత్వం కరాకండిగా చెప్పింది. అంతేకాకుండా స్కూల్ స్థాయి వరకు చేరిపోయిన డ్రగ్స్ ని నియంత్రణ చేయకపోతే భవిష్యత్తు తరాలు పూర్తిగా నాశనం అయ్యే అవకాశం ఉందని ప్రభుత్వం అభిప్రాయ పడింది. ఈ నేపథ్యంలోనే డ్రగ్స్…
శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం మండలం తూమకుంటలో దారుణం జరిగింది. ఆ గ్రామంలోని ఓ సైకో రెచ్చిపోయాడు. ఏడేళ్ల చిన్నారిని కిరాతకంగా హత్య చేశాడు. అనంతరం చిన్నారి మృతదేహాన్ని గ్రామ శివారులోని పెన్నానది ఒడ్డున పాతిపెట్టాడు.
Maharashtra Shocker: మహారాష్ట్ర నేవీ ముంబైలో యశశ్రీ హత్య ఘటన మరవకముందే, సతారాలో ప్రియుడి చేతిలో మరో యువతి హత్యకు గురైన సంఘటన వెలుగులోకి వచ్చింది. యువతిని ఆమె ప్రియుడు బిల్డింగ్పై నుంచి తోసేసి హత్య చేశాడు.
రాష్ట్రంలో అవినీతి అధికారుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. ప్రజలకు సేవ చేయాల్సిన అధికారులే.. వారి రక్తాన్ని జలగల్లా పీలుస్తున్నారు. ఏ శాఖలో చూసినా అవినీతి మరకలు కనిపిస్తూనే ఉన్నాయి.సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడి చేయగా.. ఇద్దరు అవినీతి అధికారులు పట్టుబడినట్లు తెలిసింది.
Man Kills Wife: పాకిస్తాన్లో దారుణం జరిగింది. అనుమానంతో భార్యను సజీవ దహనం చేశాడు. ఈ ఘటన ఆ దేశంలోని పంజాబ్ ప్రావిన్సులో చోటు చేసుకుంది. కొత్తగా పెళ్లైన 19 మహిళను ఆమె భర్త పరువు పేరుతో కాల్చి చంపినట్లు పోలీసులు బుధవారం తెలిపారు. బాధితురాలు సబా ఇక్బాల్ని భర్త అలీ రజా అక్రమ సంబంధం ఉందనే అనుమానంతో జూలై 28న లాహోర్కి 400 కి.మీ దూరంలోని బహవల్ నగర్ లో హత్య చేశాడు.