ఏలూరు జిల్లా కొయ్యలగూడెం మండలం రామానుజపురం దారుణం చోటుచేసుకుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో కట్టుకున్న భార్యను పట్టపగలే నడి రోడ్డుపై కత్తితో నరికిన హత్య చేశాడు భర్త.
అదో దోపిడి గ్యాంగ్. హైవేలపై కాపు కాస్తుంది... దాబాల వద్ద మాటు వేస్తుంది...హైదరాబాద్ నుంచి ముంబై వెళ్లే ట్రావెల్స్ బస్సులే టార్గెట్ గా రెక్కి నిర్వహిస్తుంది. ప్రయాణికులు బస్సులో నుంచి దిగగానే అందిన కాడికి దోచుకు వెళ్తారు. ఇది మధ్యప్రదేశ్ కంజర గ్యాంగ్ ముఠా పని. చోరీల్లో ఆరితేరిన ఈ గ్యాంగ్ ఆట కట్టించారు సంగారెడ్డి జిల్లా పోలీసులు.
ప్రేమించిన యువతి బంధువులు తన ఇంటిపై రాత్రి దాడి చేయడంతో ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన హైదరాబాద్లోని కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని మహంకాళి నగర్లో చోటుచేసుకుంది.
సంగారెడ్డి జిల్లాలో భారీగా బంగారం పట్టుబడింది. ముంబై నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఆరెంజ్ ట్రావెల్స్ బస్సులో 4.8 కిలోల బంగారాన్ని టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు.
Dowry harassment: అన్యోన్యంగా సాగాల్సిన సంసారంలో భర్త కట్న పిచాశిగా మారాడు. ఉత్తర్ ప్రదేశ్ లక్నోకి చెందిన 40 ఏళ్ల మహిళను దారుణంగా వేధించాడు. చైనాలో ఉద్యోగం చేసే భర్త, ఆ దేశంలో ఉన్న సమయంలో ఆఫ్రికా వ్యక్తితో లైంగిక సంబంధం పెట్టుకోవాలని, అశ్లీల చిత్రాలను చూడాలని ఒత్తిడి చేసేవాడని ఆమె ఆరోపించింది.
'ప్రాణాలతో ఉండి మా పిల్లలను బాగా చూసుకోలేకపోయాం... దగ్గరివారు ఎవరైనా మా పిల్లలను బాగా చూసుకుంటారని ఆశిస్తున్నాను.. ఇద్దరం మా ఇష్ట ప్రకారం ఆత్మహత్య చేసుకుంటున్నాం...' అని ఓ హోటల్లో దంపతులు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన ప్రయాగ్రాజ్లో చోటు చేసుకుంది.