Gujarat: గుజరాత్‌లో దారుణం జరిగింది. మనవడిని కంటికి రెప్పలా, ప్రేమగా చూసుకోవాల్సిన బామ్మే కసాయిగా మారింది. 14 నెలల చిన్నారిని చిత్రహింసలకు గురిచేసి చంపింది. రాష్ట్రంలోని అమ్రేలి తాలుకాలో ఈ ఘటన జరిగింది. నిందితురాలైన మహిళ మనవడు నిరంతరం ఏడుస్తున్నాడనే కోసంతో అతడిని తీవ్రంగా కొట్టింది. అనంతరం చిన్నారి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు.
Read Also: Maharashtra: ఎంతటి విషాదం.. భుజాలపై బిడ్డల శవాలతో 15 కి.మీ నడక.. వైరల్ అవుతున్న వీడియో..
ఈ ఘటన సెప్టెబర్ 3న రాజస్థలి గ్రామంలో చోటు చేసుకుంది. అమ్రేలి రూరల్ పోలీసులు కుల్షన్ సయ్యద్ అనే మహిళని అరెస్ట్ చేసి, ఆమెపై కేసు నమోదు చేశారు. తీవ్రగాయాలతో ఉన్న చిన్నారిని తల్లిదండ్రులు అమ్రేలి సివిల్ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు వైద్యులు చెప్పారు. బాలుడి కుడి చెంప, కన్ను, నుదురు, చేతులు, కాళ్లపై కొరికిన గుర్తులు ఉన్నాయి. నోరు, తొడలు, చేతులపై కూడా తీవ్రగాయాలు ఉన్నాయి.
మూఢ నమ్మకాల కారణంగా మహిళ, చిన్నారి పట్ల క్రూరంగా ప్రవర్తించి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. భావ్‌నగర్ సివిల్ హాస్పిటల్‌లో నిర్వహించిన ప్రాథమిక పోస్ట్‌మార్టం నివేదికలో, తీవ్రంగా కొరికి కొట్టడం వల్లే చిన్నారి మృతి చెందినట్లు నిర్ధారించారు. పోలీసులు మహిళపై హత్య కేసు నమోదు చేశారు. కుల్షన్ సయ్యద్ తన కొడుకు ఇద్దరు పిల్లలను మధ్యాహ్నం ప్రత్యేక గదికి తీసుకెళ్లారని పోలీసులు చెప్పారు. 14 నెలల చిన్నారి ఏడుపు ప్రారంభించడంతో, నానమ్మ ఆవేశంతో చిన్నారిని కొరికి, కొట్టడంతో మరణించాడు.