మధ్యప్రదేశ్‌లో హృదయ విదారక ఘటన వెలుగు చూసింది. రాజ్‌గఢ్ జిల్లాలోని బియోరాలో ఓ మహిళా కానిస్టేబుల్ తన ప్రియుడితో కలిసి ఎస్‌ఐని కారుతో ఢికొట్టి చంపేసింది. ఈ కేసు తర్వాత మహిళా కానిస్టేబుల్‌తో పాటు ఆమె ప్రియుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డిపార్ట్‌మెంట్‌లో భాగంగా ఎస్‌ఐ దీపాంకర్ లేడీ కానిస్టేబుల్ పల్లవి సోలంకితో మాట్లాడేవాడని పోలీసులు చెబుతున్నారు. దీంతో ఆమె ప్రియుడు కరణ్ సింగ్‌కు అనుమానం వచ్చింది. ఈ విషయమై ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. మంగళవారం ఎస్‌ఐ దీపాంకర్ గౌతమ్ తన ఇంట్లో ఉండగా… కుట్రలో భాగంగా భోపాల్ బైపాస్ వైపు రావాలని కరణ్, పల్లవి పిలిచారు. కరణ్, అతి వేగంతో కారు నడుపుతూ.. దీపాంకర్ బైక్ ను ఢీకొట్టాడు. తర్వాత అతన్ని చాలా దూరం ఈడ్చుకెళ్లాడు. ఈ సమయంలో ఎస్‌ఐ దీపాంకర్ గౌతమ్ మృతి చెందాడు. దీని తరువాత, పోలీసులు మహిళా కానిస్టేబుల్, ప్రియుడిపై సెక్షన్ 103 (1), 3 (5) బీఎన్ఎస్ కింద కేసు నమోదు చేశారు.
READ MORE: Telangana: సెప్టెంబర్ 17పై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
బియోరా-దేవాస్ హైవేపై దేహత్ పోలీస్ స్టేషన్ వైపు బైక్‌పై వెళ్తున్న దీపాంకర్‌ను కారుతో ఢీకొట్టారని పోలీసులు తెలిపారు. దీపాంకర్ తప్పించుకునేందుకు ప్రయత్నించగా.. 30 మీటర్ల మేర కారుతో ఈడ్చుకెళ్లారు. దీంతో దీపాంకర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ఘటన అనంతరం అక్కడే ఉన్న వ్యక్తులు ఎస్‌ఐని అంబులెన్స్‌లో సివిల్ ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలో కారు నంబర్‌ను గుర్తించిన పోలీసులు నిందితులు పల్లవి, కరణ్ అని తేలింది. పోలీసులు రెండు పోలీస్ స్టేషన్లకు పిలిపించి అర్థరాత్రి వరకు విచారించారు. నిందితులిద్దరూ ఎస్‌ఐని హత్య చేసినట్లుగా అంగీకరించినట్లు దేహత్ పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ గోవింద్ మీనా తెలిపారు. తన ప్రేమ మధ్య ఎస్ఐ వస్తున్నాడని చెప్పాడు. ప్రస్తుతం కేసు నమోదు చేసి తదుపరి చర్యలు తీసుకుంటున్నారు.
READ MORE: Sanjauli Mosque Row: సిమ్లాలో వివాదంగా ‘సంజౌలి మసీదు’.. ప్రజలపై లాఠీఛార్జ్..
కాగా.. మహిళా కానిస్టేబుల్ పల్లవి, కరణ్ మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తోందని సమాచారం. కొద్దిరోజుల క్రితం పరస్పరం గొడవల కారణంగా ఇద్దరూ విడిపోయారు. ఈ సమయంలో పల్లవి దీపాంకర్‌తో స్నేహం చేసింది. ఈ విషయం తెలుసుకున్న కరణ్ తిరిగి పల్లవి దగ్గరకు వెళ్లాడు. ఇరువురి మధ్య ఒప్పందం కుదిరింది. ఆ తర్వాత ఎస్‌ఐ దీపాంకర్‌ను దారి నుంచి తప్పించాలని ఇద్దరూ ఆలోచించారు. మంగళవారం దీపంకర్‌ను కలవాలని పల్లవి పిలిచి కారుతో ఢీకొట్టి చంపేశారు.