Pawan Kalyan : పవన్ కళ్యాణ్ – సురేందర్ రెడ్డి సినిమాకు బ్రేక్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్, స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి కలయికలో సినిమా కోసం మెగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఏ ఏడాది ఉగాది కానుకగా ఈ చిత్రాన్ని అట్టహాసంగా ప్రారంభించాలని మేకర్స్ ప్లాన్ చేశారు. అయితే, తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా స్క్రిప్ట్ విషయంలో పవన్ కళ్యాణ్ ఇంకా పూర్తి సంతృప్తిగా లేరని తెలుస్తోంది. రచయిత వక్కంతం వంశీ మరియు సురేందర్ రెడ్డి కలిసి సిద్ధం చేసిన కథాంశం పవన్ కళ్యాణ్‌కు మొదట్లో నచ్చినప్పటికీ, పూర్తి స్థాయి నేరేషన్ విషయంలో ఆయన కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఈ ఏడాది ఇప్పటికే రెండుసార్లు సురేందర్ రెడ్డి పవన్‌ను కలిసి కథను వివరించినప్పటికీ, అందులో కొన్ని మార్పులు చేయాలని పవన్ సూచించారు.
Also Read : Siva Karthikeyan : వెంకట్ ప్రభు – శివకార్తికేయన్ కాంబోలో భారీ సైన్స్ ఫిక్షన్ సినిమా
Also Read
పవన్ సూచించిన మార్పుల ప్రకారం సురేందర్ రెడ్డి టీమ్ స్క్రిప్ట్‌లో మార్పులు చేసినా, రీ-నేరేషన్ సమయంలో పవన్ ఇంకా సంతృప్తి చెందలేదు. దీంతో, మరోసారి స్క్రిప్ట్‌పై కూర్చుని, కథను మరింత పర్ఫెక్ట్ గా రెడీ చేయమని పవన్ స్పష్టం చెప్పారట. పవన్ కళ్యాణ్ ఈ ఫైనల్ నేరేషన్‌తో పూర్తిగా కన్విన్స్ అయిన తర్వాతే కాల్ షీట్లు ఇస్తానని చెప్పడంతో, ప్రస్తుతం దర్శకుడు సురేందర్ రెడ్డి మరియు వక్కంతం వంశీ స్క్రిప్ట్‌ను మెరుగుపరిచే పనిలో బిజీగా ఉన్నారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే, ఈ సినిమా షూటింగ్ మే నెలలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత రామ్ తాళ్లూరి నిర్మిస్తున్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ చేతిలో ఉన్న ఏకైక కొత్త ప్రాజెక్ట్ ఇదే కావడం విశేషం. మిగిలిన చిత్రాలను పూర్తి చేసిన తర్వాతే ఆయన ఈ సినిమా సెట్స్‌లోకి అడుగుపెట్టనున్నారు.
తాజావార్తలు
-
BrahMos Missile Export: డిఫెన్స్ రంగంలో భారత్ సత్తా.. బ్రహ్మోస్ ఎగుమతులతో గ్లోబల్ మార్కెట్లో దూకుడు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?