illicit Affair: తిరుపతి జిల్లా చంద్రగిరి మండలంలో దారుణ హత్య సంచలనం రేపుతుంది. మదనపల్లికి చెందిన ఓ యువకుడు అక్రమ సంబంధం పెట్టుకోవడం కారణంగా దారుణ హత్యకు గురైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
EO Theft In Temple: శ్రీ సత్యసాయి జిల్లా కదిరి రూరల్ మండలంలో గల ఎర్రదొడ్డి గంగమ్మ ఆలయంలో ఈవో మురళీకృష్ణ ఐదు కిలోల వెండి ఆభరణాలు, చీరలు సహా ఇతర విలువైన వస్తువులను చోరీ చేస్తూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు.
Gun Violence: దక్షిణాఫ్రికాలోని రాజధాని ప్రిటోరియా సమీపంలోని సాల్స్విల్లే ప్రాంతంలో శనివారం తెల్లవారుజామున జరిగిన భయంకర కాల్పులు స్థానిక ప్రజలను భయబ్రాంతులకు గురి చేశాయి. ఈ దారుణ ఘటనలో 11 మంది మృతి చెందగా, మరికొంత మంది తీవ్రంగా గాయపడ్డారు. మరణించిన వారిలో ముగ్గురు చిన్నారులు కూడా ఉన్నారు. దక్షిణాఫ్రికన్ పోలీస్ సర్వీస్ (SAPS) తెలిపిన వివరాల ప్రకారం.. ఉదయం సుమారు 4:15 గంటల తర్వాత ఈ హత్యాకాండ చోటుచేసుకుంది. అయితే పోలీసులకు సమాచారం ఉదయం 6…
Madhya Pradesh: మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని షామ్గఢ్ నగరంలో శుక్రవారం 16 ఏళ్ల బాలిక అశ్లీల వీడియో వైరల్ అవ్వడం, ఆమెను బ్లాక్మెయిల్ చేస్తున్న భయానక ఘటన వెలుగులోకి వచ్చింది. దీంతో ఒక్కసారిగా ఆ ప్రాంతంలో ఉద్రిక్తతలు పెరిగాయి. బాధితురాలు 12వ తరగతి చదువుతోంది.
Techie Suicide: నగర పాలక సంస్థ అధికారుల వేధింపులు తట్టుకోలేక ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన బెంగళూర్లో జరిగింది. సొంతింటి కల తీరకుండానే తనువు చాలించాడు. కొత్త ఇంటి నిర్మాణానికి పదే పదే ఆటంకాలు కలిగించడం, డబ్బులు వసూలు చేసేందుకు ఒత్తిడి చేయడంతోనే బాధితులు ఆత్మహత్యకు పాల్పడినట్లు ఆయన కుటుంబం ఆరోపిస్తోంది.
Shocking M*urders: తన కన్నా ‘‘అందం’’గా ఉంటే జీర్ణించుకోలేని మనస్తత్వం ఒక మహిళను క్రూరురాలిగా మార్చింది. చిన్న పిల్లలు అని చూడకుండా పసిపిల్లల్ని దారుణంగా హత్య చేసింది. హర్యానాలోని పానిపట్లో జరిగిన 6 ఏళ్ల చిన్నారి మరణాన్ని దర్యాప్తు చేసిన పోలీసులకు షాకింగ్ విషయాలు తెలిశాయి.
Loan Fraud: హౌసింగ్ లోన్ మోసం కేసులో ఓ దంపతులకు ఏడేళ్ల జైలు శిక్షను విధించింది నాంపల్లి కోర్టు. నకిలీ పత్రాలతో లోన్లు తీసుకుని బ్యాంకులను మోసం చేసిన దంపతులు దసరథ్ నేత, లక్ష్మీబాయిగా గుర్తించారు.
Lady Gang: విజయవాడ నగరంలోని చౌకీ సెంటర్ పరిసరాల్లో లేడీ గ్యాంగ్ దోపిడీలతో స్థానిక వ్యాపారుల అవస్థలు పడుతున్నారు. అర్థరాత్రి సమయంలో ఈ గ్యాంగ్ వరుసగా దొంగతనాలకు పాల్పడుతూ మార్కెట్ ప్రాంతంలో ఆందోళనకర వాతావరణాన్ని సృష్టిస్తోంది.
Crime: ఉత్తర్ ప్రదేశ్ కౌశాంబిలో ఒక వివాహిత మహిళను సొంత బంధువైన వ్యక్తి కాల్చి చంపాడు. తన కోరికలను తిరస్కరించిన కారణంగా గురువారం ఉదయం 24 ఏళ్ల మహిళను చంపాడు. గత కొంత కాలంగా మహిళపై ఒత్తిడి తెస్తున్నప్పటికీ, ఆమె నిరాకరిస్తూ వస్తోంది. దీంతో కోపం పెంచుకున్న వ్యక్తి ఆమెను చంపేశాడు. బాధితురాలిని పోలీసులు దీపికా తివారీగా గుర్తించారు.
Man Kills Sister: తన సోదరి బాయ్ఫ్రెండ్తో మాట్లాడటాన్ని సహించలేని సోదరుడు, ఆమెను దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ షాజహాన్పూర్ జిల్లాలోని ఇటోరా గోటియా గ్రామంలో జరిగింది. బాధితురాలిని నైనా దేవీ(22)గా గుర్తించారు. ఎస్పీ రాజేష్ ద్వివేది ఈ హత్య గురించిన వివరాలు వెల్లడించారు. నిందితుడు షేర్ సింగ్ తన సోదరి చాలా మంది పురుషులతో ఫోన్లో మాట్లాడిందని, వివాహ ప్రతిపాదనల్ని కూడా తిరస్కరించిందని చెప్పాడు. Read Also: Sheikh Hasina: షేక్…