Darshan Case: హత్య నేరంలో జైలులో శిక్ష అనుభవిస్తున్న కన్నడ స్టార్ దర్శన్ తనకు దుప్పటి కావాలని కోర్టును కోరాడు. బుధవారం బెంగళూరులోని ట్రయల్ కోర్టులో అదనపు దుప్పటి కోసం విన్నవించుకున్నాడు. చలి కారణంగా తనకు నిద్ర పట్టడం లేదని చెప్పాడు. విచారణ ప్రక్రియ కోసం దర్శన్‌ను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టు ముందు హాజరుపరిచారు.
Ex-Girlfriend: పెళ్లయిన వ్యక్తి, తన ఎక్స్- గర్ల్‌ఫ్రెండ్‌కు ముద్దు ఇవ్వాలని చూశారు. బలవంతంగా ‘‘కిస్’’ చేయాలని చూసిన ఆ వ్యక్తిని తగిన గుణపాఠం చెప్పింది. ముద్దు పెట్టుకోవాలని చూసిన వ్యక్తి, నాలుకను కొరికింది. దీంతో, నాలుక కొంత భాగం కోల్పోవాల్సి వచ్చింది. ఉత్తర్ ప్రదేశ్ కాన్పూర్‌లో ఈ ఘటన జరిగింది. లైంగికంగా వేధించడం, కిస్ చేయడానికి ప్రయత్నించడంతో సదరు మహిళ, ఆ వ్యక్తి నాలుకను రెండుగా ముక్కలయ్యేలా కొరికింది. Read Also: Kanpur Scam: కోట్లు దోచుకున్న…
I Bomma Ravi : ఐ బొమ్మ రవి అరెస్ట్ ఒక సంచలనంగా మారింది. ఆయన కేసులో ఎన్నో విషయాలు బయట పడుతున్నాయి. అయితే రవి తండ్రి మాత్రం తన కొడుకు చేసింది తప్పే అంటున్నారు. అతన్ని చట్ట పరంగానే శిక్షించాలని కోరుతున్నాడు. ఈ క్రమంలోనే తన మనవరాలి గురించి రవి తండ్రి చేసిన రిక్వెస్ట్ అందరినీ ఆందోళనకు గురి చేస్తోంది. తాజాగా రవి తండ్రి అప్పారావు సీపీ సజ్జనార్ కు ఒక రిక్వెస్ట్ చేశారు. నా…
Fake TTD Letters: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పేరుతో నకిలీ టీటీడీ లెటర్ల జారీపై విజయవాడ నగర కమీషనర్‌కు ఫిర్యాదు చేశారు.
Minister Partha Sarathy: పరకామణి కేసు వెనుక ఎవరు ఉన్నారో తేల్చాలి అని మంత్రి పార్థసారథి పేర్కొన్నారు. ఇక, సాక్ష్యం చెప్పడానికి వస్తున్న మాజీ ఎవీఎస్ఓ సతీష్‌కుమార్ హత్యకు గురయ్యాడు.
Kakinada: కాకినాడ జిల్లాలో జరిగిన హత్య కేసులో 23 ఏళ్ల తర్వాత కీలక పరిణామం చోటు చేసుకుంది. భార్యా పిల్లలను హత్య చేసిన కేసులో యావజ్జీవ శిక్ష అనుభవిస్తున్న శేషుబాబుకు సుప్రీంకోర్టు శిక్షను తాత్కాలికంగా సస్పెండ్ చేస్తూ తీర్పును వెలువరించింది.
Bride Killed: మరికొన్ని గంటల్లో ఒక్కటి కాబోతోన్నారు. కానీ, పెళ్లికి ఒక గంట ముందు వధువు దారుణహత్యకు గురైంది. కాబోయే భర్త చేతుల్లో హత్యకు గురైంది. ఈ సంఘటన గుజరాత్ రాష్ట్రంలోని భావ్‌నగర్‌లో జరిగింది. బాధితురాలిని సోనీ హిమ్మత్ రాథోడ్గ గుర్తించారు. నిందితుడు సాజన్ బరైయా చేతిలో ఆమె ప్రాణాలు పోగొట్టుకుంది. ఈ జంటకు శనివారం వివాహం జరగాల్సి ఉంది. పెళ్లికి ఒక గంట ముందు ఈ దారుణం చోటు చేసుకోవడంతో వధువు కుటుంబం కన్నీరుమున్నీరు అవుతోంది.…
Satish Kumar’s mysterious death: టీటీడీ మాజీ అసిస్టెంట్ విజిలెన్స్ సెక్యూరిటీ ఆఫీసర్ (AVSO) సతీష్ కుమార్ మరణానికి గల కారణాలపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
Mystery: గతవారం ఢిల్లీలోని అత్యంత విలాసమైన నోయిడా ప్రాంతంలోని ఒక కాలువలో తల లేకుండా మహిళ మృతదేహం కనిపించడం సంచలనం సృష్టించింది. అయితే, ఈ కేసును పోలీసులు ఛేదించారు. హంతకుడిని అరెస్ట చేశారు. నిందితుడిని సదరు మహిళ ప్రియుడిగా గుర్తించారు. బస్సు డ్రైవర్ అయిన మోను సోలంకి అరెస్ట్ తర్వాత కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. వివాహితుడైన సోలంకి మహిళలో లవ్ ఎఫైర్ పెట్టుకున్నాడు. ఆ తర్వాత ఆమె బ్లాక్మెయిల్ చేయడంతో తాను నేరానికి పాల్పడినట్లు చెప్పాడు.
Kerala: 10 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసిన బీజేపీ కార్యకర్త, పాఠశాల ఉపాధ్యాయుడికి శనివారం కోర్టు జీవితఖైదు విధించింది. తలస్సేరి ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ కోర్టు కడవత్తూర్ నివాసి పద్మరాజన్ కే అలియాస్ పప్పెన్ మాస్టర్(48)కి శిక్షను ఖరారు చేసింది. 2020 జనవరి, ఫిబ్రవరి మధ్య కన్నూర్ లోని పలతాయిలో పనిచేస్తున్న సమయంలో, మైనర్ బాలికపై పదే పదే లైంగిక వేధింపులకు పాల్పడిన కేసులో దోషిగా తేలాడు.