Kakinada: కాకినాడ జిల్లాలో జరిగిన హత్య కేసులో 23 ఏళ్ల తర్వాత కీలక పరిణామం చోటు చేసుకుంది. భార్యా పిల్లలను హత్య చేసిన కేసులో యావజ్జీవ శిక్ష అనుభవిస్తున్న శేషుబాబుకు సుప్రీంకోర్టు శిక్షను తాత్కాలికంగా సస్పెండ్ చేస్తూ తీర్పును వెలువరించింది.
Bride Killed: మరికొన్ని గంటల్లో ఒక్కటి కాబోతోన్నారు. కానీ, పెళ్లికి ఒక గంట ముందు వధువు దారుణహత్యకు గురైంది. కాబోయే భర్త చేతుల్లో హత్యకు గురైంది. ఈ సంఘటన గుజరాత్ రాష్ట్రంలోని భావ్నగర్లో జరిగింది. బాధితురాలిని సోనీ హిమ్మత్ రాథోడ్గ గుర్తించారు. నిందితుడు సాజన్ బరైయా చేతిలో ఆమె ప్రాణాలు పోగొట్టుకుంది. ఈ జంటకు శనివారం వివాహం జరగాల్సి ఉంది. పెళ్లికి ఒక గంట ముందు ఈ దారుణం చోటు చేసుకోవడంతో వధువు కుటుంబం కన్నీరుమున్నీరు అవుతోంది.…
Satish Kumar’s mysterious death: టీటీడీ మాజీ అసిస్టెంట్ విజిలెన్స్ సెక్యూరిటీ ఆఫీసర్ (AVSO) సతీష్ కుమార్ మరణానికి గల కారణాలపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
Mystery: గతవారం ఢిల్లీలోని అత్యంత విలాసమైన నోయిడా ప్రాంతంలోని ఒక కాలువలో తల లేకుండా మహిళ మృతదేహం కనిపించడం సంచలనం సృష్టించింది. అయితే, ఈ కేసును పోలీసులు ఛేదించారు. హంతకుడిని అరెస్ట చేశారు. నిందితుడిని సదరు మహిళ ప్రియుడిగా గుర్తించారు. బస్సు డ్రైవర్ అయిన మోను సోలంకి అరెస్ట్ తర్వాత కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. వివాహితుడైన సోలంకి మహిళలో లవ్ ఎఫైర్ పెట్టుకున్నాడు. ఆ తర్వాత ఆమె బ్లాక్మెయిల్ చేయడంతో తాను నేరానికి పాల్పడినట్లు చెప్పాడు.
Kerala: 10 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసిన బీజేపీ కార్యకర్త, పాఠశాల ఉపాధ్యాయుడికి శనివారం కోర్టు జీవితఖైదు విధించింది. తలస్సేరి ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ కోర్టు కడవత్తూర్ నివాసి పద్మరాజన్ కే అలియాస్ పప్పెన్ మాస్టర్(48)కి శిక్షను ఖరారు చేసింది. 2020 జనవరి, ఫిబ్రవరి మధ్య కన్నూర్ లోని పలతాయిలో పనిచేస్తున్న సమయంలో, మైనర్ బాలికపై పదే పదే లైంగిక వేధింపులకు పాల్పడిన కేసులో దోషిగా తేలాడు.
Uttar Pradesh: తాజాగా ఉత్తరప్రదేశ్లో మరో కలతపరిచే సంఘటన చోటు వేసుకుంది. నేడు (శుక్రవారం) ఉదయం శ్రావస్తి జిల్లాలోని కైలాసపూర్ మజ్రా మనిహార్ తారా గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు వ్యక్తుల మృతదేహాలు ఇంట్లో నుండి బయటపడ్డాయి. పోలీసుల సమాచారం ప్రకారం.. మృతులు రోస్ అలీ అలియాస్ రఫిక్, అతని భార్య షహ్నాజ్, పిల్లలు తబస్సుం, మొయిన్, గుల్నాజ్గా గుర్తించారు. ప్రాథమిక దర్యాప్తులో రోస్ అలీ ముందుగా భార్య, పిల్లలను గొంతు నులిమి హత్య చేసి,…
Bhimavaram Double Murder: పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో దారుణం చోటు చేసుకుంది. మన్నా చర్చ్ ఎదురుగా ఉండే ఇంటిలో తల్లిని, తమ్ముడిపై కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు దాడి చేశాడు గునుపూడి శ్రీనివాస్ అనే వ్యక్తి.. ఈ ఘటనలో తల్లి గునుపూడి మహాలక్ష్మి, రవితేజ అక్కడికక్కడే మృతి చెందారు. తల్లిని తమ్ముడిని హత్య చేసిన అనంతరం నిందితుడు 112 కాల్ ద్వారా పోలీసులకు సమాచారం అందించడం. ఘటన స్థలానికి చేరుకున్న జిల్లా ఎస్పీ నయీమ్ అస్మి ఆధ్వర్యంలో…
Tragedy : విశాఖపట్నం జిల్లాలోని పెందుర్తిలో అత్తను దారుణంగా హత్య చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. కుటుంబ కలహాల నేపథ్యంలో కోడలు లలిత తన అత్తను నిర్దాక్షిణ్యంగా హతమార్చినట్టు పోలీసులు గుర్తించారు. సాధారణ అగ్ని ప్రమాదంలా చూపించేందుకు లలిత చేసిన నాటకాలు షాకింగ్గా మారాయి. పోలీసుల సమాచారం ప్రకారం.. లలిత ముందుగా ‘దొంగ–పోలీస్ ఆట’ పేరుతో అత్తను కుర్చీలో కూర్చోబెట్టి తాళ్లతో బింగించి కట్టేసింది. ఆ తరువాత క్రూరంగా ఆమెపై పెట్రోలు పోసి నిప్పంటించింది. నిప్పు అంటుకున్న…
Fake Liquor Case: నకిలీ మద్యం తయారీ కేసులో ఏడుగురు నిందితులను ఎక్సైజ్ పోలీసులు కస్టడీకి తీసుకొని విచారణ ప్రారంభించారు.. వీరిని ఐదు రోజులపాటు విచారించనున్నారు.. కోర్టు ఆదేశాలతో నిందితులను జైలు నుంచి ఎక్సైజ్ కార్యాలయానికి శుక్రవారం ఉదయం తరలించారు.. కేసులో నిందితులుగా ఉన్న రవి, బాదల్ దాస్, ప్రదీప్ దాస్, శ్రీనివాస్ రెడ్డి, కళ్యాణ్, రమేష్ బాబు, అల్లా భక్షు లను కస్టడీ కి తీసుకున్నారు. ఈ ఏడుగురు కూడా అద్దేపల్లి జనార్ధన్ కి నకిలీ…
Ganja Gang Attack: రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలోని వనస్థలిపురం ప్రాంతంలో గంజాయి బ్యాచ్ ఆగడాలు అడ్డు అదుపు లేకుండా రెచ్చిపోతున్నాయి. వనస్థలిపురం పరిధిలోని జెమ్ కిడ్నీ హాస్పిటల్ ముందు చోటుచేసుకున్న ఒక దారుణ సంఘటన స్థానికంగా కలకలం రేపింది. గురువారం రాత్రి సుమారు 9 గంటల సమయంలో ఆరుగురు యువకులు హాస్పిటల్ ముందు మద్యం తాగుతూ న్యూసెన్స్ సృష్టించారు. హాస్పిటల్ ముందు మద్యం సేవించవద్దని హాస్పిటల్ సిబ్బంది అభ్యర్థించడంతో, ఆ యువకులు వారిపై దాడికి పాల్పడ్డారు.…