SBI ATM Gun Fire: కోఠి SBI ప్రధాన కార్యాలయం ATM వద్ద కాల్పుల కలకలం.. రూ. 6 లక్షలతో దుండగుల జంప్..
- కోఠి SBI ప్రధాన కార్యాలయం ఏటీఎం వద్ద కాల్పుల కలకలం..
- గన్‌తో కాల్పులు జరిపి రూ.6 లక్షలు ఎత్తుకెళ్లిన దుండగులు..
- ఉదయం 7 గంటలకు డిపాజిట్ చేయడానికి వెళ్లిన రషీద్ అనే వ్యక్తి..
- గన్‌తో కాల్పులు జరిపి ఆరు లక్షల నగదు ఎత్తుకెళ్లిన దుండగులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
SBI ATM Gun Fire: హైదరాబాద్ నగరంలోని కోఠి ఎస్బీఐ ప్రధాన కార్యాలయం ఏటీఎమ్ వద్ద ఈరోజు (శనివారం) ఉదయం తీవ్ర కలకలం చోటు చేసుకుంది. గన్‌తో కాల్పులు జరిపిన అఘాంతకులు రూ.6 లక్షల నగదును దోచుకెళ్లారు. ఈ ఘటనలో ఓ వ్యక్తికి బులెట్ గాయం కావడం కలకలం రేపింది. ఉదయం 7 గంటల సమయంలో రషీద్ అనే వ్యక్తి ఏటీఎమ్‌లో డబ్బులు డిపాజిట్ చేయడానికి వచ్చాడు. అతడిని ముందుగానే గమనించిన దుండగులు వెనక నుంచి ఫాలో అయ్యారు. రషీద్ ఏటీఎమ్ దగ్గరకు చేరుకున్న వెంటనే అతడిపై గన్‌తో కాల్పులు జరిపి, అతని వద్ద ఉన్న రూ.6 లక్షల నగదును ఎత్తుకెళ్లారు.
Read Also: 9500s చిప్‌సెట్, ట్రిపుల్ రియర్ కెమెరా, భారీ బ్యాటరీతో ఫిబ్రవరిలోనే Xiaomi 17T Series లాంచ్?
Also Read
అయితే, కాల్పుల్లో రషీద్‌కు కాలికి బులెట్ గాయం కావడంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. స్థానికులు వెంటనే స్పందించి అతడిని సమీప ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతడు చికిత్స పొందుతున్నట్లు తెలుస్తుంది. విషయం తెలుసుకున్న సుల్తాన్ బజార్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఏటీఎమ్ పరిసరాల్లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించి దుండగుల ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. నగదు దోపిడీతో పాటు కాల్పులు జరగడంతో కోఠి ప్రాంతంలో తీవ్ర భయాందోళన నెలకొంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను త్వరలోనే పట్టుకుంటామని వెల్లడించారు.
తాజావార్తలు
-
Varanasi Set Leak: ‘వారణాసి’కి లీక్‌ల కలకలం.. ఆలయం ముందు ఆ వింత జీవి ఏంటి జక్కన్న?
-
Ivolga high-speed train: భారత్‌కు రష్యా బంపర్ ఆఫర్.. హైస్పీడ్ ‘‘ఇవోల్గా’’ రైలు ప్రతిపాదన..
-
Mega Mass Moment: ఒకే ఫ్రేమ్‌లో చిరంజీవి, రామ్‌చరణ్, రవితేజ.. ‘ఇరుముడి’ టీమ్‌కు మెగా సర్ప్రైజ్ .. పిక్స్ వైరల్!
-
PM Kisan: పీఎం కిసాన్ 24 విడత డబ్బులు ఎప్పుడు వస్తాయి..? కీలక అప్డేట్..
-
Harmanpreet Kaur: ఆమె డేంజరస్ ప్లేయర్.. త్వరగా ఔట్ చేయకుంటే ఓటమి ఖాయం.. హర్మన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!