నేటి సమాజంలో మోసాలు పెరిగిపోయాయి. అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించి మంచి పనులు చేస్తుంటే.. మరి కొందరు మాత్రం టెక్నాలజీని వాడి మోసాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి ఘటనే హైదరాబాద్‌లో చోటు చేసుకుంది. గుజరాత్ అహ్మదాబాద్‌కు చెందిన హేమలి అనే మహిళ ఇతర వ్యక్తులను వాట్సాప్ డీపీగా పెట్టుకొని.. వారికి సంబంధించిన వారికి మెడికల్ ఎమర్జేన్సీ అని చెప్పి డబ్బులు కావాలంటూ మెసేజ్‌లు పెట్టేది. అయితే తెలిసిన వ్యక్తి ఆపదలో డబ్బు సహాయం అడుగుతున్నారని వారు కూడా డబ్బులు పంపేవారు.…
ఉదయాన్నే కాలేజీకి వెళ్లిన కూతురు శవమై తిరిగి ఇంటికివస్తే ఆమె తల్లిదండ్రుల మనోవేదన వర్ణానాతీతం. ఇలాంటి ఘటనే మేడ్చల్ జిల్లాలో చోటు చేసుకుంది. గాజులరామరంకు చెందిన మేఘన దుండిగల్ లోని మర్రి లక్ష్మణ్ రెడ్డి కళాశాలలో ఇంజినీరింగ్ మూడవ సంవత్సరం చదువుతుంది. నేడు మధ్యాహ్న సమయంలో మరో స్నేహితురాలు సుమనశ్రీ తో కలిసి కళాశాల నుంచి తిరుగు ప్రయాణంలో గండిమైసమ్మ చౌరస్తా వద్ద ద్విచక్రవాహనంపై వెళ్తుండగా వెనక నుంచి టిప్పర్ లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మేఘన…
నేటి సమాజంలో ప్రాణానికి విలువలేకుండా పోయింది. అర్థంపర్థం లేని అనుమానాలతో మస్తిష్కంలో మంటలు పుట్టించుకోని.. వారి ఆలోచనలతో ఆ మంటలకు ఆజ్యం పోసుకుంటూ నమ్మివచ్చిన వారినే కడతేర్చుతున్నారు. ఇలాంటి ఘటన హైదరాబాద్‌లోని కూకల్‌పల్లిలో చోటు చేసుకుంది. కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని గూడ్స్ షెడ్ రోడ్డులో పుణ్యవతి, సంతోష్ అనే భార్యభర్తలు నివాసం ఉంటున్నారు. అయితే ఈ ఏడాది మే నెలలో వీరికి వివాహం జరిగింది. వివాహం జరిగిననాటి నుంచి భార్య పుణ్యవతిపై భర్త సంతోష్ అనుమానం…
విజయవాడ పోలీసులకు కొన్నిరోజులుగా చెడ్డీ గ్యాంగ్ చెమటలు పట్టిస్తోంది. ఈ నేపథ్యంలో చెడ్డీ గ్యాంగ్ వివరాలను విజయవాడ పోలీసులు కనిపెట్టారు. ఈ మేరకు చెడ్డీ గ్యాంగ్ ఫోటోలను విజయవాడ సీపీ విడుదల చేశారు. గుజరాత్‌లోని దాహోద్ జిల్లా నుంచి చెడ్డీ గ్యాంగ్ వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. కృష్ణా, గుంటూరు జిల్లాల పోలీసులు జాయింట్‌గా గుజరాత్‌లోని దాహోద్ పోలీసులను సంప్రదించి పలు కీలక వివరాలను రాబట్టారు. ఈ విచారణలో చడ్డీ గ్యాంగ్‌లో కొంతమంది ఏపీకి వచ్చారని గుజరాత్ పోలీసులు…
దేశంలో సైబర్ నేరగాళ్ల వలలో పడేవారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. సామాన్యులతో పాటు సెలబ్రిటీలను కూడా సైబర్ నేరగాళ్లు వదిలిపెట్టడం లేదు. తాజాగా టీమిండియా మాజీ క్రికెటర్, సచిన్ బాల్య మిత్రుడు వినోద్ కాంబ్లీ కూడా సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకున్నాడు. డిసెంబర్ 3వ తేదీన కేవైసీ (నో యువర్ కస్టమర్) పేరుతో ఓ వ్యక్తి కాల్ చేసి వినోద్ కాంబ్లీకి కుచ్చుటోపీ పెట్టాడు. ఓ వ్యక్తి తాను బ్యాంకు ఎగ్జిక్యూటివ్ అని చెప్పి… వినోద్ కాంబ్లీకి…
తిరుపతిలో కొందరు దుండగులు ఏటీఎంల ట్యాంపరింగ్‌లకు పాల్పడుతున్నారు. ఏటీఎంలలో ట్యాంపరింగ్ చేసి రూ.70 లక్షలు కాజేసిన ఇద్దరు దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి పలు బ్యాంకులకు చెందిన 99 ఏటీఎం కార్డులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తిరుపతి రామానుజం కూడలిలోని ఎస్బీఐ ఏటీఎంలో ట్యాంపరింగ్ జరిగిందని ఈనెల 2న బ్యాంకు మేనేజర్ ఫిర్యాదు చేసినట్లు తిరుపతి అర్బన్ ఎస్పీ వెంకటఅప్పలనాయుడు తెలిపారు. Read Also: నిరుద్యోగులకు గమనిక.. ఈనెల 23 నుంచి 9,328 పోస్టుల…
హైదరాబాద్ రాజేంద్రనగర్‌లో దారుణం చోటుచేసుకుంది. ఇమాద్‌నగర్‌లో నిద్రిస్తున్న భార్యను గొంతుకోసి ఓ భర్త అతి కిరాతకంగా హత్య చేశాడు. అనంతరం భార్య తలను తీసుకుని పోలీస్ స్టేషన్‌కు వెళ్లి పోలీసుల ముందు లొంగిపోయాడు. వివరాల్లోకి వెళ్తే… 14 ఏళ్ల క్రితం సమ్రీన్ బేగం అనే అమ్మాయిని ఫర్వేజ్ అనే వ్యక్తి వివాహం చేసుకున్నాడు. అయితే భర్త వేధింపులు తాళలేక సమ్రీన్ బేగం గతంలోనే విడాకులు తీసుకుంది. ఈ నేపథ్యంలో భార్యకు నచ్చజెప్పి గత ఏడాది సమ్రీన్ బేగంను…
ఆమె ఒంటరి మహిళ.. భర్త చనిపోవడంతో బిడ్డలతో కలిసి బతకాల్సింది పోయి తప్పుడు మార్గం ఎంచుకొంది . పడక సుఖం కోసం ఒకరు కాదు ఇద్దరు కాదు ముగ్గురుతో అఫైర్ పెట్టుకొంది .. ఎవరికి తెలియకుండా కొన్నిరోజులు కామ కార్యకలాపాలు సాగించింది. చివరికి ముగ్గురు ప్రియులలో ఒకరికి తన అఫైర్స్ గురించి తెలియడంతో మరో ఇద్దరు ప్రియులతో కలిసి మూడో ప్రియుడిని అంతమొందించింది ఈ ఘటన గుంటూరు జిల్లాలో వెలుగు చూసింది. వివరాలలోకి వెళితే.. కృష్ణాజిల్లా జిల్లా…
సమాజం మారుతోంది.. మహిళపై వివక్ష తగ్గుతోంది.. ఆడామగ ఇద్దరు సమానమే అనుకుంటున్నారు తల్లిదండ్రులు.. ఇక సమాజంలో స్త్రీల సంఖ్య పెరుగుతోంది అని ఆశించేలోపు ఎక్కడో ఒకచోట ఈ వివక్ష కనిపించడం బాధాకరమైన విషయం.. ఆడపిల్ల కడుపులో పెరుగుతోందని కడుపులోనే చంపేస్తున్నారు.. ఆడపిల్లలు పుట్టారని.. పుట్టినా వెంటనే గొంతు నులిమేస్తున్నారు.. తాజాగా ఒక తల్లి తనకు వరుసగా ముగ్గురు ఆడపిల్లలు పుట్టడంతో.. మూడో బిడ్డను అతి కిరాతకంగా చంపిన దారుణ ఘటన గుంటూరు జిల్లాలో వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే..…
ముషీరాబాద్ రిసాలగడ్డ వాటర్ ట్యాంక్‌ను శుభ్రం చేసేందుకు వచ్చిన సిబ్బందికి మృతదేహం కనిపించడంతో పోలీసులుకు, అధికారులకు సమాచారం అందించారు. దీంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఎన్డీఆర్ఎఫ్ బృందాన్ని పిలిపించి మృతదేహాన్ని వాటర్ ట్యాంక్ నుంచి బయటకు తీశారు. అయితే 50 అడుగుల ఎత్తున్న వాటర్ ట్యాంక్‌కు రెండు ద్వారాలు ఉన్నాయని.. ఆ రెండూ మూసే ఉన్నాయని పోలీసులు తెలిపారు. అంతేకాకుండా వాటర్ ట్యాంక్ పైన ఓ చెప్పుల జత కనిపించడంతో దాని ఆధారంగా పోలీసులు దర్యాప్తు…