తూర్పు గోదావరి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది.. ముగ్గురు పిల్లల్తో కలిసి ఒక వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. భార్యను వివాహేతర సంబంధం వలనే అతడు ఈ దారుణ నిర్ణయానికి పాల్పడినట్లు స్థానికులు అనుమానిస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. సీతానగరం మండలం గోకవరంకు చెందిన ఒక వ్యక్తికి కొన్నేళ్ల క్రితం వంగలపూడికి చెందిన మహిళతో వివాహమైంది. వీరికి ముగ్గురు పిల్లలు. సదురు వ్యక్తి ఆటో నడుపుతుండగా.. భార్య కువైట్ వెళ్లి పనిచేస్తోంది. దీంతో పిల్లలు అమ్మమ్మ ఇంటివద్ద చదువుకుంటున్నారు. అప్పుడప్పుడు పిల్లలను చూడడానికి వచ్చి పోతుంటాడు.
కాగా, ఇటీవల సడెన్ గా అత్తగారింటికి వచ్చి ముగ్గురు పిల్లలను తీసుకొని పక్కనే ఉన్న మామిడి తోటకు తీసుకెళ్లి తనతో పాటు తెచ్చిన ఎలుకల మందును ఇచ్చాడు. అందులో ఇద్దరు పిల్లలు తండ్రి మాటను నిరాకరించడంతో.. మరో బాలుడికి ఎలుకల మందు తాగించి , తానూ తాగేశాడు. వెంటనే మరో ఇద్దరు పిల్లలు స్థానికులు విషయం చెప్పడంతో వారిని దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. భార్య కువైట్ లో వేరొక వ్యక్తితో ఎఫైర్ పెట్టుకున్నదని, ఆ వీడియోలను ఇటీవల భర్తకు, బంధువుల ద్వారా చేసరడం మనస్థాపం చెంది అతను ఈ దారుణ నిర్ణయానికి పాల్పడి ఉంటాడని స్థానికులు భావిస్తున్నారు. అయితే మరోపక్క తమ తండ్రి తమను పట్టించుకోడని పిల్లలు చెప్పడం గమనార్హం. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. అ