జగిత్యాల రూరల్ మండలం వెల్దుర్తిలో మంగళవారం మధ్యాహ్నం ఓ రైతు తన వ్యవసాయ పొలంలో సజీవ దహనమైన ఘటన చోటు చేసుకుంది. పొలంలో కాలిపోయిన మృతదేహాన్ని కుటుంబ సభ్యులు గుర్తించడంతో అర్థరాత్రి ఘటన వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పోతుగంటి లక్ష్మణ్ గౌడ్ (54) మంగళవారం మధ్యాహ్నం తన వ్యవసాయ పొలంలో వరి చెత్తకు నిప్పంటించగా ప్రమాదవశాత్తు మంటలు అంటుకున్నాయి. కంటిచూపు సమస్య ఉన్న లక్ష్మణ్ గౌడ్ మంటలను గమనించలేకపోయాడు. అతడిని రక్షించేందుకు చుట్టుపక్కల…
విశాఖపట్నంలోని తెలుగుతల్లి ఫ్లైఓవర్ పై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అతి వేగంతో డివైడర్ ను బైక్ ఢీకొట్టడంతో అదుపుతప్పి యువతీ, యువకుడు మృతి చెందారు. మృతులు విజయనగరం జిల్లా బొబ్బిలి ప్రాంతానికి చెందిన ప్రశాంత్ (22), ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న మురళీనగర్ ప్రాంతానికి చెందిన రాధిక(17) గా పోలీసులు గుర్తించారు. సీతమ్మధారలోని ఓ సెలూన్లో ప్రశాంత్ పనిచేస్తున్నాడని పోలీసులు తెలిపారు. అయితే ప్రమాదం జరిగినప్పుడు తలకు బలమైన గాయం అవ్వడంతో ప్రశాంత్ అక్కడికక్కడే మృతిచెందాడు.…
ముషీరాబాద్ హరినగర్ రీసాలగడ్డ వాటర్ ట్యాంక్ లో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైన ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. వాటర్ ట్యాంక్ ను శుభ్రం చేయడానికి వచ్చిన వాటర్ వర్క్స్ సిబ్బందికి మృతదేహం కనిపించడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. వెంటనే సిబ్బంది వాటర్ వర్క్స్ అధికారులకు, పోలీసులకు సమాచారం అందించారు. దీంతో సంఘటన స్థలానికి ముషీరాబాద్ సీఐ జహంగీర్ యాదవ్, స్థానిక కార్పొరేటర్ రవి చారి, వాటర్ వర్క్స్ ఇన్ స్పెక్టర్ లు చేరుకున్నారు.…
ప్రజలకు సమస్యలు వస్తే పోలీసుల వద్దకు వెళ్తారు. అదే పొలుసులు సమస్యలు తెస్తే ఎక్కడికి వెళ్ళాలి. కామంతో కళ్ళుమూసుకుపోయి బాధ్యత కలిగిన వృత్తిలో ఉన్నామని కూడా మరిచాడు ఆ పోలీస్ .. సమస్య ఉండి ఫిర్యాదు చేయడానికి వచ్చిన మహిళ సమస్య తీర్చాల్సింది పోయి ఆమెపై నీచానికి ఒడిగట్టాడు. ఫిర్యాదు చేయడానికి వచ్చిన మహిళనుపై అత్యచారానికి పాల్పడి, గర్భవతిని చేసిన ఘటన తమిళనాడులో వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే.. తమిళనాడులోని కన్యాకుమారి జిల్లా కళియకోవిలై పోలీస్ స్టేషన్ లో…
స్మార్ట్ ఫోన్ల వలన ఎంతోమంది తప్పుదారి పడుతున్నారు. చిన్నా, పెద్ద అని తేడా లేకుండా అందరు స్మార్ట్ ఫోన్లకు అడిక్ట్ అవుతున్నారు. ఇక ఇటీవల కరోనా వలన పిల్లలందరికీ స్మార్ట్ ఫోన్లు అవసరంగా మారిపోవడంతో తల్లిదండ్రులు సైతం వారికి ఫోన్లను కొనిస్తున్నారు . అయితే వారు మాత్రం ఫోన్ లను చదువుకోవడానికి కాకుండా గేమ్స్ కోసం, అశ్లీల వీడియోలను చూడడానికి ఉపయోగిస్తున్నారు. తాజాగా ఒక 13 ఏళ్ల బాలుడు అశ్లీల వీడియోలకు అలవాటు పడి మూడేళ్ల బాలికపై…
ఏపీలో చెడ్డీ గ్యాంగ్ రెచ్చిపోతోంది. తాడేపల్లిలోని సీఎం జగన్ నివాసం సమీపంలోనే చెడ్డీ గ్యాంగ్ దోపిడీలకు పాల్పడుతోంది. తణుకు ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు, చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌కు సంబంధించిన విల్లాల్లోకి చొరబడిన చెడ్డీ గ్యాంగ్… విలువైన వస్తువులు అపహరించేందుకు ప్రయత్నించింది. ఈ గ్యాంగులో ఉన్న ఐదుగురు సభ్యులు చెడ్డీలు, తలపాగాలు ధరించి ఉన్నారు. చేతిలో మారణాయుధాలు కూడా ఉన్నాయి. ఈనెల 3న అర్ధరాత్రి ఈ ఘటన జరగ్గా… మూడు రోజుల పాటు పోలీసులు ఈ విషయాన్ని…
మహారాష్ట్రలో దారుణం చోటుచేసుకొంది. ఇంట్లో వాళ్ళని కాదని పెళ్లి చేసుకున్న అక్కను, సొంతతమ్ముడు, తల్లి కలిసి అతిదారుణంగా హతమార్చిన ఘటన స్థానికం గ సంచలనం రేపుతోంది. అతి క్రూరంగా తలనరికి, ఆ తలను పట్టుకొని రోడ్డుపైకి వచ్చి సెల్ఫీలు దిగుతూ అరాచకము సృష్టించాడు 18 ఏళ్ళ యువకుడు.. ఈ దారుణ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. ఔరంగాబాద్ జిల్లా పరిధిలో ఉన్న ఒక గ్రామంలో 19 ఏళ్ల యువతి కుటుంబంతో కలిసి నివసిస్తోంది. ఆమెకు…
హైదరాబాద్ నగరంలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. పోలీసులు ఎంత నిఘా వేసినా వాళ్ల కళ్లుగప్పి పలువురు వ్యక్తులు ఫుల్లుగా మద్యం తాగి వాహనాలను డ్రైవింగ్ చేస్తున్నారు. సోమవారం ఒకేరోజు పలువురు వ్యక్తులు తప్పతాగి వాహనాలు నడపటంతో మూడు రోడ్డు ప్రమాదాలకు కారణమయ్యారు. బంజారాహిల్స్, నార్సింగి, ఎస్.ఆర్.నగర్లో ఈ రోడ్డుప్రమాదాలు చోటుచేసుకున్నాయి. Read Also: పాములను తరిమేసేందుకు పొగ పెట్టాడు… ఇంటికి నిప్పంటుకోవడంతో… నార్సింగి వద్ద సంజీవ్ అనే వ్యక్తి మద్యం మత్తులో కారుతో…
హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్‌నెం 2 లో అర్థరాత్రి ఓ కారు బీభత్సం సృష్టించింది. రోహిత్ అనే వ్యక్తి తాగినమత్తులో అతివేగంగా కారు నడుపుతూ రోడ్డు దాటుతున్న ఇద్దరు యువకులను ఢీ కొట్టడంతో వారు అక్కడికక్కడే మృతి చెందారు. కారు దూసుకెళ్లడంతో బీహార్‌కు చెందిన త్రిభువన్‌రాయ్, ఉపేందర్‌కుమార్ దాస్ అనే ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. గమనించిన స్థానికులు వెంటనే రోహిత్‌ను పట్టుకొని పోలీసులకు సమాచారం అందించారు. సమాచారంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు రోహిత్‌ను అదుపులోకి…
ప్రకాశం జిల్లాలోని టంగుటూరులో సంచలనం సృష్టించిన తల్లీ కూతుళ్ల హత్య కేసులో పోలీసులు పురోగతి సాధించారు. పోలీసుల చేతికి కీలక ఆధారాలు లభించాయి. ఓ మొబైల్ నంబర్ ఆధారంగా దర్యాప్తులో ఒక అడుగు ముందుకు వేశారు. తల్లీ కూతుళ్ల హత్యను నరహంతక ముఠా పనిగా పోలీసులు భావిస్తున్నారు. హత్య జరిగిన ప్రదేశంలో ఇంట్లో కీలక ఆధారాలను పోలీసులు గుర్తించారు. హత్య ప్రదేశంలో సేకరించిన వేలిముద్రలతో పాటు బూటు గుర్తులతో నేరస్తుల గుట్టురట్టు అయ్యే అవకాశం ఉందని పోలీసులు…