తెలుగు రాష్ట్రాల్లో సంచలనం కలిగించింది చింతపల్లి నరబలి కేసు. నల్గొండ జిల్లా చింతపల్లిలో జరిగిన ఈ ఘోరంపై దర్యాప్తు కొనసాగుతోంది. ఘటన జరిగి 10 రోజులు అవుతున్నా నిందితులు ఇంకా దొరకలేదు. ఎవరు హత్య చేశారు? లేకపోతే నరబలి ఇచ్చారా? అన్న కోణంలో విచారణ కొనసాగుతోంది. సీసీ కెమెరాలలో రికార్డ్ అవ్వకపోవడంతో నిందితులను పట్టుకునేందుకు కష్టంగా మారింది కేసు.
తెలిసిన వ్యక్తులతో పాటు అనుమానంగా ఉన్న వ్యక్తులను ప్రశ్నిస్తున్నారు పోలీసులు. కొద్దిరోజుల క్రితం చింతపల్లి మహంకాళి విగ్రహం వద్ద జైహింద్ నాయక్ తలను గుర్తించారు పోలీసులు.జైహింద్ నాయక్ మొండేన్ని తుర్కయాంజల్ సూరజ్ కాలనీ లోని ఓ భవనం లో గుర్తించారు. మొండెం కోసం గాలిస్తుండగా , ఆరునెలలుగా ఆ భవనంలో జైహింద్ నాయక్ నిద్రించేవాడని తేలడంతో అక్కడికి వెళ్ళారు పోలీసులు. భవనంలో ఇటుకల కింద మొండెం గుర్తించారు పోలీసులు. జై హింద్ నాయక్ దుస్తులు, ఇతర వస్తువులు ఆధారంగా అతనేనని గుర్తించారు. సాంకేతికంగా దృవీకరించడానికి డీఎన్‌ఎ కోసం పంపారు నమూనాలు.
ఇది నరబలా లేక ఉద్దేశ పూర్వకంగా ఎవరైనా జై హింద్ నాయక్‌ని హత్య చేశారన్న కోణంలో కొనసాగుతోంది విచారణ. తుర్కయాంజల్ లో హత్య చేసి తల ను యాభై కిలో మీటర్ల దూరంలో పడేయడంతో తెలిసిన వారు ఎవరైనా హత్య చేశారన్న దానిపై పోలీసులు కూపీ లాగుతున్నారు. మొత్తం మీద జై హింద్ నాయక్ హత్య దర్యాప్తు పోలీసులకు సవాల్‌గా మారిందనే చెప్పాలి.