పైసలు ఇస్తావా.. పడక సుఖం ఇస్తావా.. పోలీస్ అరాచకం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రజలను కాపాడాల్సిన పోలీసులే.. ప్రజలను బాధిస్తున్నారు. అన్యాయం జరిగిందని చెప్పుకోవడానికి పోలీస్ స్టేషన్ కి వస్తే.. లంచం ఇస్తావా.. మంచం ఎక్కుతావా అంటూ దిగజారి మాట్లాడుతూ పోలీస్ వ్యవస్థ పరువు తీస్తున్నారు. తాజాగా ఒక మహిళ ఒక పోలీస్ తనను లైంగికంగా వేధించాడంటూ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడం స్థానికంగా సంచలనం రేపుతోంది. ఈ ఘటన బెంగుళూరులో వెలుగుచూసింది.
వివరాల్లోకి వెళితే.. బెంగుళూరులోని ఐటీ హబ్ లో నివాసముండే ఒక మహిళ తనకున్న రెండు ఇళ్లలో ఒకదాన్ని అద్దెకు ఇచ్చింది. అద్దెకు వచ్చినవారు కొన్నేళ్లు బాగానే ఉన్నా ఒక ఏడాది నుంచి వాటర్ బిల్లు కట్టడం మానేశారు. ఆమె ఇదేంటి అని ప్రశ్నించడానికి వెళితే.. ఆమెపై కత్తితో దాడిచేసి, హత్యాయత్నానికి ప్రయత్నించారు. దీంతో ఆమె గాయాలతో ఆసుపత్రికి వెళ్లి చికిత్స అనంతరం పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఫిర్యాదు చేసింది. అక్కడ ఒక ఇన్స్పెక్టర్ తనతో అసభ్యంగా ప్రవర్తించినట్లు ఆమె వాపోయింది. ఫిర్యాదు తీసుకోకుండా.. త్వరగా నీ కేసు చూడాలంటే పైసల్ ఇస్తావా.. పడక సుఖం ఇస్తావా..? అంటూ చెయ్యి పట్టుకొని లాగి కౌగిలించుకోవడానికి ప్రయత్నించాడని తెలిపింది. అతని లైంగిక వేధింపులు తట్టుకోలేక పోలీస్ కమీషనర్ కి ఫిర్యాదు చేసినట్లు ఆమె తెలిపింది. ఒక పోలీస్ అధికారిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన స్థానికంగా సంచలనం రేపింది. మహిళ ఆరోపణలు నిజమని తెలిస్తే అతడిపై కఠిన చర్యలు తీసుకుంటామని కమీషనర్ తెలిపారు.
Also Read
- Alluri District Blast: మైనింగ్ ప్రాంతంలో భారీ పేలుడు.. ఆరుగురు మృతి
- Hyderabad Crime: ప్రేమికుడి వేధింపులు.. యువతి ఆత్మహత్య
- RGIA: శంషాబాద్ ఎయిర్‌పోర్టులో రూ. 1.56 కోట్ల విదేశీ కరెన్సీ పట్టివేత.. ఇద్దరిని అరెస్ట్ చేసిన డీఆర్ఐ..
- Shankarpally : మేజర్‌ను మైనర్‌గా చూపి అక్రమ కేసు.. శంకర్పల్లి సీఐ, ఎస్ఐలపై యువతి సంచలన ఆరోపణలు!
తాజావార్తలు
-
Railway Group D Recruitment 2026: నిరుద్యోగులకు రైల్వే శాఖ శుభవార్త.. 30 వేల పోస్టులతో నోటిఫికేషన్..!
-
Ind Vs NZ 2nd T20: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా.. జట్టులోకి వైభవ్ ఎంట్రీ..
-
Rohit Sharma: వైభవ్ సూర్యవంశీకి కారు డ్రైవింగ్ ఇవ్వను.. రోహిత్ శర్మ కామెంట్స్ వైరల్..
-
Sai Krishna Custodial Death Case: సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం.. సీబీఐ ఎఫ్ఐఆర్లో సంచలన ఆరోపణలు
-
Rahul Gandhi: పండుగల సమయం.. ర్యాలీ వాయిదా వేయండి.. రాహుల్‌గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి
ట్రెండింగ్
-
Shreyas Iyer History: మరో 25 పరుగులే.. మొదటి టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర!
-
LPG Gas Saving Tips: మీ గ్యాస్ సిలిండర్ త్వరగా అయిపోతోందా?.. ఈ చిన్న టిప్స్ పాటిస్తే ఎంతో ఆదా!
-
Used Tea Leaves: వాడేసిన టీ పొడిని పారేస్తున్నారా? ఆ చెత్తతో గాజు వస్తువులు మెరిపించవచ్చని తెలుసా?
-
Virat Kohli vs Pakistan: భారత్ – పాక్ సమరం.. జీవితంలో మరిచిపోలేని విరాట్ కోహ్లీ మాస్ ఇన్నింగ్స్..!
-
స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో OnePlus Ace 7 Pro.. అక్టోబర్ 29న గ్రాండ్ ఎంట్రీ..!