Hyderabad: నిశ్చితార్థం జరిగినా.. లాడ్జీలకు తీసుకెళ్లి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాష్ట్రంలో యువతులపై అత్యాచారాలు, లైంగిక దాడులు పెరిగిపోతున్నాయి. జూబ్లీహిల్స్ మైనర్ బాలిక రేప్ కేసు ఘటన మరువకముందే మరో ఉందతం వెలుగులోకి వచ్చింది. యువతిని పెళ్లి చేసుకుంటానని నమ్మించి , ఆ యువతిని తనపై నమ్మకం కుదిరేలా చేసుకుని, తనపై వున్న కామవాంఛ తీర్చకున్నాడు. ఆయువతిని గర్భవతిని చేసి చేతులు దులుపుకోవాలని చూసాడు. చివరికి కటకటాలపాలయ్యాడు. ఈ ఘటన హైదరాబాద్ లోని అత్తాపూర్ కిషన్ బాగ్ లో జరిగింది.
తిరుమలగిరి విలేజ్ దర్గా ప్రాంతానికి చెందిన యువతి లెక్చరర్‌గా పనిచేస్తుంది. 2017లో ఆమెకు అత్తాపూర్ కిషన్ బాగ్ ప్రాతానికి చెందిన దూరపు బంధువు నిహాల్ సింగ్‌తో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం ప్రేమకు దారి తీసింది గత ఏడాది జూలై 1న అత్తాపూర్ వెళ్లిన ఆమెను నిహాల్‌సింగ్ టెర్రస్ పైన ఉన్న గదికి రప్పించి పెళ్లి చేసుకుంటానని నమ్మించి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆ తర్వాత కూడా నిహాల్ సింగ్ పలుమార్లు లాడ్జీలకు తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. కాగా బాధితురాలు గత డిసెంబర్‌లో తనకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారని చెప్పగా నిశ్చితార్థం జరిగినా తాను పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు.
Also Read
- Maharashtra: పెళ్లి నిశ్చయం.. ప్రియురాలిని లోయలోకి తోసిచంపిన ప్రియుడు..
- Instagram Love: ఇన్స్టాగ్రామ్ లవ్.. హిందు వివాహం.. భర్త ముస్లిం అని తెలిసి షాక్!
- Operation Firewall 2026: పాక్ ఇంటెలిజెన్స్‌తో నేరుగా టచ్.. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ దర్యాప్తులో సంచలన అంశాలు..
- Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
గత ఫిబ్రవరిలో ఆమెకు నిశ్చితార్థం జరగడంతో తనను వదిలివేయాలని కోరగా తనతో కలిసి ఉన్న వీడియోలు తీశానని తన కోరిక తీర్చకపోతే వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడమేగాక కాబోయే భర్తకు కూడా పంపిస్తానని బెదిరించి పలుమార్లు లైంగికదాడికి పాల్పడ్డాడు. అంతేగాక నిహాల్ సూచన మేరకు పెళ్లి కూడా రద్దు చేసుకుంది. ఇటీవల తాను గర్భం దాల్చినట్లు గుర్తించిన బాధితురాలు పెళ్లి చేసుకోవాల్సిందిగా ఒత్తిడి చేయడంతో ఈనెల 6న తల్లితో సహా తిరుమలగిరికి వచ్చిన నిహాల్ సింగ్ ఆమెను పెళ్లి చేసుకోనని తేల్చిచెప్పడంతో బాధితురాలు మంగళవారం తిరుమలగిరి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
తాజావార్తలు
-
AP Mayor Seats: నేడు సీఎం చంద్రబాబు నివాసంలో కీలక భేటీ.. మేయర్ పీఠాలపై కూటమి కసరత్తు!
-
Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
-
Best Post Office Scheme: పథకం చిన్నదే అయినా.. రూ.25 లక్షలను తెచ్చిపెడుతుంది..
-
Indiramma Towers: గుడ్‌న్యూస్.. జిల్లాల్లో కూడా ఇందిరమ్మ టవర్స్.. రూ.4 లక్షలకే ఫ్లాట్..
-
AP Municipal Elections: ఎస్టీలకు మంగళగిరి, తాడేపల్లి మేయర్.. 8 మంది మహిళలకు మేయర్లుగా అవకాశం?
ట్రెండింగ్
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
T20I World Record: వెస్టిండీస్ సరికొత్త వరల్డ్ రికార్డు.. చరిత్రకు మూడు సిక్సర్ల దూరంలో భారత్.!
-
Boat Sinks: ఘోర పడవ ప్రమాదం.. 15 మంది చిన్నారులు సహా 109 మంది మృతి.!
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..