Railway Engineer: విజయవాడలో సీబీఐ మెరుపు దాడి.. రైల్వే ఇంజినీర్ అరెస్ట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విజయవాడలో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ నిర్వహించిన మెరుపు దాడిలో రూ.15 లక్షల లంచం తీసుకుంటూ రైల్వే సీనియర్ సెక్షన్ ఇంజినీర్ బాపిరాజు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. ఈ వ్యవహారంలో ఆయనతో పాటు శ్రీచంద్ అనే ప్రైవేట్ వ్యక్తిని కూడా అధికారులు అరెస్ట్ చేశారు. రూ.179.50 కోట్ల విలువైన ఆటోమేటిక్ బ్లాక్ సిగ్నలింగ్ పనులను గణపతి ఇంజినీరింగ్ వర్క్స్, యెల్లా కన్స్ట్రక్షన్స్ జాయింట్ వెంచర్ సంస్థ చేపట్టింది.
ఈ ప్రాజెక్ట్ పనులను ముందస్తుగా పూర్తి చేసినందుకు సదరు జాయింట్ వెంచర్ రూ.7 కోట్ల బోనస్ కోసం క్లెయిమ్ చేసింది. ఈ బోనస్ మంజూరుకు అనుకూలంగా ఫైల్ తేదీలలో మార్పులు చేసి, బోనస్ త్వరితగతిన విడుదల అయ్యేలా సహకరించడానికి ఇంజినీర్ బాపిరాజు రూ.15 లక్షల లంచం డిమాండ్ చేశారు.
Also Read
- ACB Raids: టీటీడీ డిప్యూటీ ఈవో ఇంట్లో ఏసీబీ దాడులు.. ఏకకాలంలో 5 చోట్ల సోదాలు.. 15 ఏళ్ల తర్వాత!
- IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్.!
- Pawan Kalyan Fan: పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకల్లో పెను విషాదం.. కరెంట్ షాక్‌తో అభిమాని మృతి!
- AICC Disciplinary Action: కొండా సురేఖ, చిన్నారెడ్డిపై క్రమశిక్షణ చర్యలు.? నేడు ఏఐసీసీ కీలక నిర్ణయం
ప్రైవేట్ కంపెనీ ఎండీ కుమారుడు విశాఖపట్నం నుండి విజయవాడ వచ్చి శ్రీచంద్ ద్వారా ఈ లంచం మొత్తాన్ని అందజేస్తుండగా సిబిఐ అధికారులు ట్రాప్ చేసి ఆ సొమ్మును స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసు విచారణలో భాగంగా సిబిఐ బృందాలు విశాఖపట్నం, విజయవాడ, పిఠాపురం, హైదరాబాద్‌లలోని నిందితుల ప్రాంగణాల్లో సోదాలు నిర్వహించాయి. ఈ కుట్రలో మరికొందరి పాత్రపై ఆరా తీస్తూ విచారణను వేగవంతం చేశారు. అరెస్ట్ చేసిన నిందితులను ఆగస్టు 17న విజయవాడ కోర్టులో హాజరుపరచనున్నారు.
తాజావార్తలు
-
OG 2: పవన్ కళ్యాణ్ బర్త్‌డేకు సుజీత్ సర్ప్రైజ్.. సాయంత్రం 4:05కు రాబోయేది ఇదేనా?
-
Mega wishes: ‘సంకల్ప సాధకుడు కళ్యాణ్ బాబు’.. పవన్‌కు చిరంజీవి మెగా బర్త్‌డే విషెస్!
-
ACB Raids: టీటీడీ డిప్యూటీ ఈవో ఇంట్లో ఏసీబీ దాడులు.. ఏకకాలంలో 5 చోట్ల సోదాలు.. 15 ఏళ్ల తర్వాత!
-
Panja Re Release: 15 ఏళ్ల తర్వాత కూడా తగ్గని పవన్ కళ్యాణ్ క్రేజ్.. ‘పంజా’ రీ రిలీజ్‌కు అదిరిపోయే ఓపెనింగ్స్!
-
Soft Roti Tips: పెనం నుంచి తీయగానే రోటీ గట్టిపడిపోతోందా? ఈ సింపుల్ టిప్‌తో రోజంతా సాఫ్ట్‌గా!
ట్రెండింగ్
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్.!
-
8,050mAh బ్యాటరీ, 185Hz AMOLED డిస్ప్లే, 200MP కెమెరాతో ఫ్లాగ్షిప్ ఫోన్ POCO F9 Ultra లాంచ్.!
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!
-
AMOLED డిస్ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!