డబ్బు మనిషిని ఎలా మారుస్తుంది అంటే డబ్బు వస్తుందని అంటే ఎంత నీచానికి అయిన పాల్పడుతున్నారు. అలాంటి కలికాలం అయ్యింది. ఆస్తి కోసం సొంత వాళ్లను మోసం చేయడంతో పాటుగా దారుణంగా అంత మొందిస్తున్నారు. ఇప్పుడు జరిగిన ఘటన కూడా అలాంటిదే.. ఆస్తి కోసం సొంత బావ మరిదినే ఓ వ్యక్తి సుపారీ ఇచ్చి దారుణంగా హత్య చేయించాడు.
ఈ నెల 2న కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్‌కు చెందిన కొమ్ము రవి.. మానకొండూర్ మండలం ఈదులగట్టెపల్లి కాకతీయ కాలువ వద్ద అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. తన కొడుకు మృతిపై అనుమానం ఉందంటూ తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టగా.. నిజాలు బయటకు వచ్చాయి. ఆస్తి కోసం హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించినట్లు పోలీసులు నిర్ధారించారు. ఈ హత్య కేసులో గోదావరిఖని కార్పొరేటర్ భర్తనే సూత్రధారిగా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. హత్య చేసింది గోదావరిఖని వాసులేనని నిర్ధారించారు. కోటి రూపాయల విలువైన భూమి కోసం గోదావరిఖనికి చెందిన ముఠాకు రూ.3 లక్షల సుపారీ ఇచ్చి హత్య చేయించినట్లు పోలీసులు తెలిపారు.
Hyderabad: నిశ్చితార్థం జరిగినా.. లాడ్జీలకు తీసుకెళ్లి లైంగిక దాడి
కుటుంబ సభ్యుల అనుమానంతో పూడ్చిన శవాన్ని ఓపెన్ చేసి పోలీసులు పోస్టుమార్టం చేయించారు. పోస్టుమార్టంలో హత్యగా తేలడంతో పోలీసులు విచారణ చేపట్టి నిందితులను అదుపులోకి తీసుకున్నారు.