CP CV Anand: ఒక మేజర్.. ఐదుగురు మైనర్లు.. ఇదీ అసలు కథ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్ నగరంలో సంచనలం రేపిన జూబ్లీహిల్స్ ఆమ్నేషియా పబ్ అత్యాచారం కేసులో లోతుగా దర్యాప్తు చేశామని హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ వెల్లడించారు. మొత్తం ఆరుగురు నిందితులను అరెస్టు చేశామని, వీరిలో ఒక్కరే మేజర్ అని తెలిపారు. కేసులో ఐదుగురు మైనర్లు ఉన్నారు కాబట్టి సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు పేర్లు వెల్లడించడం లేదన్నారు. వారందరిపై పోక్సో చట్టం కింద కేసు నమోదుచేశామన్నారు. అయితే ఆరో వ్యక్తి బాధితురాలిపై రేప్ చేయలేదన్నారు. రేప్ చేసిన నిందితులకు 20 ఏళ్ల జైలుశిక్ష లేదంటే జీవిత ఖైదు విధించే అవకాశం ఉందన్నారు. కేసుకు సంబంధించి తమ వద్ద పూర్తి ఆధారాలు ఉన్నాయన్నారు. రేప్ కేసులో బాధితురాలు నిందితులను గుర్తించలేకపోతోందని అన్నారు. ఒకరిని తప్ప మిగతా వారిని గుర్తుపట్టలేదన్నారు. సరైన ఆధారాలు లేకపోవడం వల్లే నిందితులను అదుపులోకి తీసుకోవడంలో ఆలస్యమైందన్నారు. కోర్టుకు తాము పూర్తి ఆధారాలు సమర్పించాల్సి ఉంటుందని సీపీ చెప్పారు. సీసీ ఫుటేజీల ద్వారా నిందితులను గుర్తించినట్లు ఆయన వెల్లడించారు.
LIVE: అమ్నీషియా పబ్ రేప్ కేసుపై సీపీ సీవీ ఆనంద్ ప్రెస్‌మీట్
Also Read
- Harish Rao: గోదావరి-కావేరి లింక్‌పై కుట్ర జరుగుతోంది.. మరో నీటి ఉద్యమం మొదలు పెడతాం..
- TGSPDCL: తెలంగాణలో రికార్డు స్థాయి విద్యుత్ డిమాండ్.. ఈ సింపుల్ టిప్స్‌తో మీ ఇంట్లో కరెంట్‌ను సేవ్ చేయండి..
- OTR: బీజేపీలో 25 మందికి షాక్? ఎమ్మెల్సీ టికెట్‌పై బిగ్ ట్విస్ట్!
- El Nino: ఎల్‌నినో ఎదుర్కొనేందుకు తెలంగాణ సర్కార్ రంగంలోకి ..10 జిల్లాలకు ప్రత్యేక ఐఏఎస్‌లు
మే 28న ఘటన జరిగిందని.. మే 31 వరకు బాధితురాలు పేరెంట్స్‌కు చెప్పలేదని.. మే 31న జూబ్లీహిల్స్ పీఎస్‌లో కేసు నమోదైనట్లు సీపీ సీవీ ఆనంద్ తెలిపారు. మే 28న మధ్యాహ్నం 1:10 గంటలకు బాధితురాలు, ఆమె స్నేహితుడు 1:50 గంటల వరకు పబ్‌లో ఉన్నారని.. అనంతరం ఆమె స్నేహితుడు పబ్ నుంచి బయటకు వెళ్లాడని.. అయితే మరో స్నేహితురాలు బాధితురాలిని కలిసినట్లు సీపీ వివరించారు. అదే సమయంలో మైనర్ నిందితుడితో పాటు సాదుద్దీన్ బాధితురాలి దగ్గరకు వెళ్లారని.. వాళ్లు పబ్‌లోనే అసభ్యంగా ప్రవర్తించారని సీపీ పేర్కొన్నారు. వీళ్లు పబ్ నుంచి సాయంత్రం 5:30 గంటలకు బయటకు వచ్చారని.. బాధితురాలి స్నేహితురాలు పబ్‌లో నుంచి వెళ్లి క్యాబ్ బుక్ చేసుకుందని చెప్పారు. పబ్ నుండి బయటకు రాగానే బాధితురాలిని ఎక్కించుకుని నిందితులంతా కాన్సు బేకరీకి బయలుదేరారని తెలిపారు. మధ్యలో బాలికను ముద్దులు పెట్టుకుంటూ వీడియోలు తీసుకున్నారని.. తర్వాత రోడ్డునం.44లోని పెద్దమ్మ టెంపుల్ సమీపంలో నిర్మానుష్య ప్రాంతంలో ఒకరి తరువాత ఒకరు అమ్మాయిని బలవంతం చేశారన్నారు. రాత్రి 7:15 గంటలకు బాధితురాలిని మళ్లీ పబ్ వద్ద దింపారన్నారు. 376(d) 323 పోక్సో, 5g(6), 366(a), ఐటీ యాక్ట్ 67 కింద నిందితులపై కేసులు నమోదు చేసినట్లు సీపీ వివరించారు.
నిందితులు ట్రాప్ చేయడంతో బాలిక వారిని నమ్మి వెళ్లిందని సీపీ ఆనంద్ చెప్పారు. కొందరు అమ్మాయిలు ఇలాంటివి గుర్తించలేరని, బాధితురాలితో ఉన్న మరో అమ్మాయి నిందితుల దురాలోచనను పసిగట్టి క్యాబ్‌లో వెళ్లిపోయిందని తెలిపారు. కానీ ఈ అమ్మాయి వారితో వెళ్లి అత్యాచారానికి గురైందన్నారు. గ్యాంగ్ రేప్ కేసులో హోంమంత్రి మనవడు ఉన్నట్లు వస్తున్న వార్తలు కేవలం ఆరోపణలేనని సీపీ సీవీ ఆనంద్ అన్నారు. దర్యాప్తులో తమకు అలాంటి క్లూ లభించలేదన్నారు. ఎవరి వద్దనైనా ఆధారాలు ఉంటే తమకు సమర్పించాలని, తప్పకుండా విచారణ చేస్తామని సీపీ వెల్లడించారు.
తాజావార్తలు
-
Double Diabetes: మీకు డబుల్ డయాబెటిస్ ఉందా?
-
Destiny : కామెడీ వదిలేసి.. అడవిలో జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్!
-
WHO: ఇంట్లోనే విషం? 35లక్షల మరణాలకు కారణం ఇదే!
-
AP Municipal Elections: తిరుపతిలో తీవ్ర ఉద్రిక్తత.. ఎంపీ గురుమూర్తి చేతిలోని నామినేషన్ పత్రాలు లాక్కెళ్లిన టీడీపీ నేతలు..!
-
భారత్‌లో అత్యధిక మైలేజ్ ఇచ్చే హైబ్రిడ్ ఎస్యూవీ.. Renault Duster Hybrid లాంచ్.. ధర, ఫీచర్స్, ఫుల్ డీటెయిల్స్ ఇవే..
ట్రెండింగ్
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!
-
Chaminda Vaas: ఐపీఎల్లో తొలిసారి కోచ్‌గా శ్రీలంక దిగ్గజం.. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక బాధ్యతలు అప్పగింత..!
-
Kavya Maran – Anirudh Ravichander పెళ్లి ఫిక్స్.! గ్రీస్‌లో పెళ్లి, చెన్నైలో గ్రాండ్ రిసెప్షన్.?