Mallepoola Pallaki Song: ‘ఇరుముడి’ నుంచి ‘మల్లెపూల పల్లకి’ సాంగ్ వచ్చేసింది.. సినిమాపై అంచనాలు పెంచేసిన రవితేజ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mallepoola Pallaki Song: మాస్ మహారాజా రవితేజ, దర్శకుడు శివ నిర్వాణ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ‘ఇరుముడి’. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా ఆగస్టు 21, 2026న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ చిత్రం నుంచి ‘మల్లెపూల పల్లకి’ లిరికల్ వీడియో సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు. ‘మల్లెపూల పల్లకి’ పాటలో రవితేజ మాస్ ఎనర్జీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. డప్పు శ్రీను పాడిన ఈ పాటకు చౌడం శ్రీనివాసరావు సాహిత్యం అందించారు. ఈ పాటకు ఒరిజినల్ కంపోజర్ సుంకర అంజనేయులు అందించిన సంగీతాన్ని, ఈ చిత్ర సంగీత దర్శకుడు జి.వి. ప్రకాశ్ కుమార్ రీక్రియేట్ చేశారు. ఇరుముడి నేపథ్యానికి తగ్గట్టుగా పాటలోని సంగీతం, జానపద టచ్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉన్నాయి.
ఇటీవల ఈ చిత్ర డైరెక్టర్ శివ నిర్వాహ మాట్లాడుతూ.. ఈ సినిమాకు ‘ఇరుముడి’ అనే టైటిల్ పెట్టడానికి కారణాలను వెల్లడించారు. ఈ చిత్ర కథ ప్రాథమికంగా మూడు లేయర్లలో సాగుతుందని తెలిపారు. టైటిల్‌కు ఈ కథలోని మూడు లేయర్స్‌కి సంబంధం ఉందని చెప్పారు. అయ్యప్ప స్వామికి, ఆయనను కొలిచే భక్తుడికి మధ్య ఉండే అనుబంధం ఒక లేయర్ కాగా.. తండ్రి, కుమార్తె మధ్య ఉన్న బంధం మరో ముఖ్యమైన అంశమని, ఇక మూడో లేయర్‌గా సినిమాలోని సస్పెన్స్, చిన్న క్రైమ్ యాంగిల్, ఊహించని ప్రపంచం ఉంటుందని వెల్లడించారు. సాధారణంగా ఒక చిక్కుముడిని ‘ముడి’ అని అంటామని, కథలోని అన్ని అంశాలను కలిపే ఆ ముడి ఆధారంగానే ‘ఇరుముడి’ అనే టైటిల్‌ను పెట్టినట్లు తెలిపారు. ఇక ఈ సినిమాలో రవితేజ సరసన ప్రియా భవానీ శంకర్ హీరోయిన్గా నటిస్తున్నారు. బేబీ నక్షత్ర కీలక పాత్రలో కనిపించనుండగా, సాయికుమార్ ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారు. నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్న ఈ సినిమాను శివ నిర్వాణ తెరకెక్కిస్తున్నారు. ఆగస్టు 21న ‘ఇరుముడి’ థియేటర్లలోకి రానున్న నేపథ్యంలో.. తాజాగా విడుదలైన ‘మల్లెపూల పల్లకి’ పాట సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతోంది.
Also Read
- Balakrishna - Koratala Siva: కొరటాల మూవీలో మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్.. ఒకే ఫ్రేమ్‌లో ఇద్దరు బాలయ్యలు!
- Mega Podcast: దశాబ్దం తర్వాత డిజిటల్ స్క్రీన్‌పై మెగా హోస్టింగ్.. ఆ రెమ్యునరేషన్ లెక్కలు ఏంది బాస్!
- Suriya: స్టేజ్‌పై డైరెక్టర్ రాజమౌళికే స్వీట్ షాక్ ఇచ్చిన స్టార్ హీరో సూర్య! వైరల్ అవుతున్న వీడియో...
- Ranabali Documentary: కథపై హైప్ పెంచుతుందా? ఆసక్తిని చంపేస్తుందా?.. రణబాలి డాక్యుమెంటరీ స్ట్రాటజీపై హాట్ డిబేట్!
తాజావార్తలు
-
OTR : పుంగనూరు స్థానిక సమరం రణరంగంగా మారుతుందా.?
-
OTR : ఖైరతాబాద్ బీజేపీ అభ్యర్థిగా చింతల రామచంద్రారెడ్డి.?
-
India-Pakistan: పాక్ గడ్డపై భారత అధికారులు.. ఇస్లామాబాద్‌లో మొదలైన హై-వోల్టేజ్ మీటింగ్! అసలు ఏం జరుగుతోంది?
-
OTR: మానుకోటలో కారు పార్టీ గ్రూప్ వార్‌పై కేటీఆర్ క్లాస్..?
-
CM Revanth Reddy : సిరిసిల్లకు సీఎం రేవంత్.. రూ.345 కోట్ల అభివృద్ధి ప్యాకేజీ
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!