Loan Apps : 80 వాట్సప్ నెంబర్ల నుంచి యువతికి అశ్లీల ఫొటోలు.. ఎందుకో తెలుసా!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆన్‌లైన్ లోన్‌యాప్స్ ఆగడాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. నిర్వాహకులు జలగల్లా పట్టుకుని అమాయకుల రక్తం తాగేస్తున్నారు. బరితెగించి మరి వేధిస్తున్నారు. లోన్ యాప్‌ల ద్వారా రుణాలిచ్చి, తర్వాత అధికంగా డబ్బు కట్టాలంటూ వేధింపులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. అశ్లీల ఫొటోలు పంపి మరింత ఇబ్బందులకు గురిచేసే ఘటనలు పేట్రేగుతున్నాయి. తీసుకున్న రుణానికి ఒక్కోసారి రెండు నుంచి నాలుగు రెట్ల సొమ్మును వసూలు చేస్తున్నారు. అదేమని ప్రశ్నించిన వారి ఫొటోలను మార్ఫింగ్ చేసి, అశ్లీల చిత్రాలు సృష్టించి బెదిరిస్తున్నారు. నాలుగు రోజుల క్రితం ఏపీలో కొండపల్లికి చెందిన ఓ ప్రైవేటు ఉద్యోగి ఇదే తరహాలో వేధింపులకు గురయ్యారు.
తాజాగా విజయవాడ జేఎన్‌ఎన్‌యుఆర్‌ఎం వైఎస్సార్ కాలనీకి చెందిన మరో యువతిని ఇదే తరహాలో వేధిస్తున్న ఘటన వెలుగుచూసింది. ప్రైవేటు సంస్థలో అకౌంటెంట్‌గా పనిచేస్తున్న యువతి.. కుటుంబ అవసరాల నిమిత్తం 18 ఆన్‌లైన్ రుణ యాప్‌ల నుంచి అధిక వడ్డీకి రూ.55,435 రుణం తీసుకున్నారు. ఇప్పటి వరకు రూ.2,00,750 తిరిగి చెల్లించారు. ఇంకా చెల్లించాల్సింది ఉందంటూ ఆన్‌లైన్ లోన్ యాప్‌ల ఉద్యోగులు ఆ యువతిని వేధించటం ప్రారంభించారు. యువతి ఫొటోలను మార్ఫింగ్ చేసి, అశ్లీల చిత్రాలను సృష్టించి ఆమెకు పంపించారు. ఇలా ఆమె సెల్‌ఫోన్‌కు 80 వేర్వేరు వాట్సాప్ నెంబర్ల ద్వారా మార్ఫింగ్ చిత్రాలు పంపించారు. మరో 4 సెల్‌ఫోన్ల నుంచి వాయిస్ మెసేజ్‌లు పంపించి రుణం చెల్లించాలని బెదిరించారు. బాధితురాలు సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించారు.
Also Read
- CM Chandrababu: ఫిర్యాదుల స్వీకరణ నుంచి పరిష్కారం వరకు పర్యవేక్షణ.. అధికారులకు సీఎం దిశానిర్దేశం
- EV Car Fire Accident: విజయవాడ వెస్ట్ బైపాస్‌పై ఘోర రోడ్డు ప్రమాదం.. ఈవీ కారు దగ్ధం, నలుగురు సజీవదహనం..
- AP Local Body Elections 2026: రేపో, ఎల్లుండో ఎన్నికల నోటిఫికేషన్.. అచ్చెన్నాయుడు కీలక వ్యాఖ్యలు
- AP Municipality Reservations 2026: మున్సిపల్ ఎన్నికలకు కీలక అప్డేట్.. 106 పట్టణాలకు రిజర్వేషన్లు ఖరారు.. పూర్తి జాబితా ఇదే!
తాజావార్తలు
-
Jailer 2: టాలీవుడ్‌ను నెల్సన్ లైట్ తీసుకున్నారా?
-
CM Chandrababu: ఫిర్యాదుల స్వీకరణ నుంచి పరిష్కారం వరకు పర్యవేక్షణ.. అధికారులకు సీఎం దిశానిర్దేశం
-
Rahul Gandhi’s SIR Petition: SIRపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన రాహుల్ గాంధీ.. సీఈసీ రాజీనామాకు విపక్షాల డిమాండ్
-
BYD Sealion 7: BYD సీలియన్ 7 లిమిటెడ్ ఎడిషన్ లాంచ్.. ధర రూ.50.6 లక్షలు, కేవలం 150 యూనిట్లే విక్రయం!
-
Anvay Dravid: రాహుల్ ద్రవిడ్ వారసుడి విధ్వంసం.. బౌలర్లకు చుక్కలు చూపించిన అన్వయ్..
ట్రెండింగ్
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!