BRS Protest : రేపు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలకు పిలుపు ఇచ్చిన BRS
- హైకోర్టు స్టేపై బీఆర్ఎస్ తీవ్ర ఆగ్రహం
- కేసీఆర్ ఆదేశాలతో కేటీఆర్ అత్యవసర టెలీకాన్ఫరెన్స్
- అన్ని ఆర్డీవో కార్యాలయాల ఎదుట భారీ ధర్నాలకు పిలుపు
- సిద్దిపేట నిరసనలో హరీష్ రావు పాల్గొననున్నట్లు ప్రకటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BRS Protest: తెలంగాణ రాజకీయాల్లో మరోసారి నిరసనల సెగ రాజుకుంది. పేద మహిళల పెళ్లిళ్ల కోసం అందించే కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల అమలుపై తెలంగాణ హైకోర్టు మధ్యంతర స్టే విధించడంతో ప్రతిపక్ష బీఆర్ఎస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం, సరైన కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయకపోవడం వల్లనే కోర్టులో స్టే వచ్చిందని ఆరోపిస్తూ, రేపు రాష్ట్రవ్యాప్తంగా భారీ నిరసన కార్యక్రమాలకు బీఆర్ఎస్ పిలుపునిచ్చింది.
కేసీఆర్ ఆదేశాలతో కేటీఆర్ టెలీకాన్ఫరెన్స్
పథకాలపై హైకోర్టు స్టే విధించిన నేపథ్యంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ ముఖ్య నేతలు, నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌లతో అత్యవసర టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రజా సంక్షేమ పథకాల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తున్న తీరుపై మండిపడ్డారు. ప్రభుత్వం కోర్టులో బలమైన వాదనలు వినిపించకుండా ఉద్దేశపూర్వకంగానే నిర్లక్ష్యం వహించిందని ఆరోపించారు. పేదల ఇళ్లలో పెళ్లిళ్లకు ఆధారమైన కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను యథావిధిగా కొనసాగించాలని ఈ సందర్భంగా బీఆర్ఎస్ డిమాండ్ చేసింది.
Also Read
- Indiramma Towers: గుడ్‌న్యూస్.. జిల్లాల్లో కూడా ఇందిరమ్మ టవర్స్.. రూ.4 లక్షలకే ఫ్లాట్..
- CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
- El Nino : తెలంగాణలో కరువు ముప్పు.. రెండో పంట వేయొద్దంటూ మంత్రి కీలక విజ్ఞప్తి
- Indigo : పవర్ బ్యాంక్‌లో మంటలు.. శంషాబాద్‌లో ఇండిగో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
అన్ని ఆర్డీవో కార్యాలయాల ఎదుట భారీ ధర్నాలు
పార్టీ నిర్ణయం ప్రకారం రేపు తెలంగాణలోని అన్ని నియోజకవర్గాల్లో ఆర్డీవో (RDO) కార్యాలయాల ఎదుట బీఆర్ఎస్ ఆధ్వర్యంలో భారీ ధర్నాలు, నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నారు. సిద్దిపేటలో జరగబోయే నిరసన కార్యక్రమంలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు తానీరు హరీష్ రావు స్వయంగా పాల్గొననుండగా, మిగతా అన్ని నియోజకవర్గాల్లో స్థానిక నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని నిరసనలు తెలియజేయాలని కేటీఆర్ పిలుపునిచ్చారు.
సెప్టెంబర్ అసెంబ్లీ సవాల్‌కు సిద్ధం
ఇటీవల పరకాల సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ సెప్టెంబర్‌లో అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేస్తామని, పదేళ్ల బీఆర్ఎస్ పాలనతో పాటు తమ రెండున్నరేళ్ల పాలనపై చర్చకు కేసీఆర్‌ను కూడా సభకు తీసుకురావాలని సవాల్ విసిరారు. ఈ సవాల్‌పై స్పందించిన బీఆర్ఎస్ నేతలు, అసెంబ్లీ వేదికగానే కాంగ్రెస్ వైఫల్యాలను, నిరుద్యోగులు, రైతులు , ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తామని స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
Shreyas Iyer: లేడీ ఫ్యాన్‌కు శ్రేయస్ అయ్యర్ క్షమాపణలు.. ‘బెస్ట్ ఇన్నింగ్స్ గిఫ్ట్‌గా ఇస్తా’..
-
T20 World Record: 3 వికెట్లు.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్.. టీ20ల్లో సరికొత్త ప్రపంచ రికార్డు.! అర్ష్‌దీప్‌కు డబుల్ ధమాకా..
-
Riyadh Airport Attack: ఉమ్రా యాత్రలో విషాదం.. బాంబ్ దాడిలో హైదరాబాద్ టెక్కీ మృతి.. భార్య, పిల్లలకు గాయాలు
-
AP Mayor Seats: నేడు సీఎం చంద్రబాబు నివాసంలో కీలక భేటీ.. మేయర్ పీఠాలపై కూటమి కసరత్తు!
-
Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
ట్రెండింగ్
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
T20I World Record: వెస్టిండీస్ సరికొత్త వరల్డ్ రికార్డు.. చరిత్రకు మూడు సిక్సర్ల దూరంలో భారత్.!
-
Boat Sinks: ఘోర పడవ ప్రమాదం.. 15 మంది చిన్నారులు సహా 109 మంది మృతి.!
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..