Fake Idols : నకిలీ విగ్రహాలతో మాయాజాలం.. ఆరుగురు ముఠా అరెస్ట్.!
- దివ్యశక్తుల పేరుతో అమాయకులకు టోకరా
- రూ.10 లక్షలకు నకిలీ లక్ష్మీ విగ్రహం కొనుగోలు
- జ్యోతిష్యుడితో కలిసి మోసానికి స్కెచ్
- విగ్రహం, రాయి, రసాయనాలు, కారు సీజ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Fake Idols : నకిలీ పంచలోహ విగ్రహాన్ని చూపుతూ అద్భుత శక్తులు ఉన్నాయంటూ అమాయకులను మోసం చేస్తున్న ఆరుగురు సభ్యుల ముఠాను హైదరాబాదులోని టాస్క్‌ఫోర్స్, మైలార్‌దేవ్‌పల్లి పోలీసులు ఉమ్మడిగా నిర్వహించిన దాడిలో అరెస్ట్ చేశారు. కాటేదాన్ లక్ష్మిగూడ ప్రాంతంలో కొనుగోలుదారుల కోసం ఎదురుచూస్తుండగా విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు ఈ దాడులు నిర్వహించి నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
దివ్యశక్తుల పేరుతో రూ. 10 లక్షల నకిలీ విగ్రహంతో మోసం
పోలీసుల కథనం ప్రకారం, ఈ ముఠా 2024లో రూ. 10 లక్షలు వెచ్చించి ఒక నకిలీ పంచలోహ లక్ష్మీదేవి విగ్రహాన్ని కొనుగోలు చేసింది. ఆ విగ్రహానికి ప్రత్యేక దివ్యశక్తులు ఉన్నాయని, దానిని ఇంట్లో పెట్టుకుంటే అదృష్టం కలసివస్తుందని ప్రచారం చేస్తూ అమాయక ప్రజలను నమ్మించేవారు. ఆపై ఆ విగ్రహాన్ని మరింత భారీ ధరకు విక్రయించి పెద్ద ఎత్తున లాభాలు గడించాలని ప్రణాళిక రచించారు. దీనితో పాటు అరుదైన గులాబీ రంగు రాయి పేరుతోనూ మరొక మోసానికి వారు స్కెచ్ వేశారు.
Also Read
- Traffic: ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత పరిష్కారం.. తెలంగాణలో కొత్త విధివిధానాలు అమల్లోకి..
- iBomma Ravi : ఐబొమ్మ రవికి కోర్టులో ఊరట.. రూ.3 కోట్లపై మాత్రం నో.!
- Off The Record: మాజీ సీఎం కేసీఆర్‌కు నోటీసులు ఇస్తారా? ఒకవేళ ఇస్తే పరిస్థితి ఏంటి?
- Telangana 22A Lands: 22A భూములకు గ్రీన్ సిగ్నల్.. ఇక వాటికి రిజిస్ట్రేషన్లు.!
జ్యోతిష్యుడితో కలిసి ప్లాన్.. ముఠాలో కార్ డ్రైవర్లు, కార్మికుడు
ఈ మోసపూరిత పథకంలో ఒక జ్యోతిష్యుడు కీలక పాత్ర పోషించగా, మిగతా నిందితుల్లో కార్ డ్రైవర్లు , ఒక కార్మికుడు ఉన్నారు. జ్యోతిష్యుడి సలహాలు, నకిలీ ప్రచారాలతో ఈ ముఠా కొనుగోలుదారులను బురిడీ కొట్టించేందుకు ప్రయత్నించింది. నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు వారి వద్ద నుంచి నకిలీ లక్ష్మీదేవి విగ్రహంతో పాటు పింక్ కలర్ రాయి, 3 రసాయన ద్రావణాల బాటిళ్లు, ఒక ఎర్టిగా కారు , 5 మొబైల్ ఫోన్లను సీజ్ చేశారు. అమాయక ప్రజలు ఇలాంటి దివ్యశక్తులు, అదృష్టం తెచ్చే నకిలీ పంచలోహ విగ్రహాల పేరుతో జరిగే మోసాలను నమ్మవద్దని, సమాజంలో మోసాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని టాస్క్‌ఫోర్స్ పోలీసులు హెచ్చరించారు.
తాజావార్తలు
-
Makkah Defence Pact: భారత్‌తో యుద్ధంలో తండ్రి మృతి.. ఇప్పుడు ‘మక్కా కూటమి’కి సారథిగా కుమారుడు
-
OTR: రిజర్వేషన్స్ మారిపోయినా పట్టు తగ్గకుండా సీనియర్స్ జాగ్రత్తలు..
-
Piyush Goyal: భారత్-అమెరికా ఒప్పందంపై పీయూష్ గోయల్ కీలక ప్రకటన
-
Traffic: ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత పరిష్కారం.. తెలంగాణలో కొత్త విధివిధానాలు అమల్లోకి..
-
బాక్సాఫీస్ వద్ద నాని ఊచకోత.. ‘The Paradise’ ప్రీమియర్స్‌తో సరికొత్త హిస్టరీ! కలెక్షన్స్ ఎంతంటే?
ట్రెండింగ్
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!