Bangladesh Cricket: ఆసీస్ గడ్డపై ఆస్ట్రేలియానే సుస్సు పోయించిన బంగ్లాదేశ్.. క్రికెట్ ప్రపంచం షాక్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bangladesh Create Test Cricket History: బంగ్లాదేశ్ పురుషుల క్రికెట్ జట్టు క్రికెట్ ప్రపంచాన్ని ఒక్కసారిగా షాక్‌కు గురిచేసింది. ఆసీస్ గడ్డపై ఆస్ట్రేలియాకే సుస్సు పోయించింది. డార్విన్‌లో జరిగిన తొలి టెస్టులో బంగ్లా ఏకంగా 9 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాను ఓడించింది. బంగ్లా బౌలర్ల అద్భుత ప్రదర్శన, బ్యాటర్ల పోరాటంతో.. బంగ్లాదేశ్ క్రికెట్ చరిత్రలోనే చిరస్మరణీయ టెస్ట్ విజయంను అందుకుంది. ఈ విజయంతో ఆస్ట్రేలియా గడ్డపై తొలిసారి టెస్టు విజయాన్ని రుచి చూసింది. ఈ విజయం బంగ్లాదేశ్ క్రికెట్ చరిత్రలో మరింత ప్రత్యేకమైనది. ఆసీస్ గడ్డపై ఆస్ట్రేలియానే ఓడించిన తొలి టెస్టు విజయంగా ఇది ఎప్పటికీ గుర్తుండిపోనుంది.
అవకాశం ఇవ్వని బంగ్లా బ్యాటర్లు:
57 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ ఒక్క వికెట్‌ను మాత్రమే కోల్పోయి సునాయాస విజయాన్ని అందుకుంది. సెంచరీ హీరో తన్జిద్ (0) త్వరగా అవుట్ అవ్వడంతో ఆస్ట్రేలియా ఏదైనా సంచలనం చేస్తుందా? అని అందరూ అనుకున్నారు. కానీ ఓపెనర్ షాద్మన్ ఇస్లామ్ (25), మోమినల్ హక్ (30) ఆ అవకాశం ఇవ్వలేదు. ఈ ఇద్దరు మరో వికెట్ పడనీయకుండా అద్భుతంగా ఆడుతూ.. బంగ్లాకు చరిత్రాత్మక విజయాన్ని అందించారు. ఫాస్ట్ బౌలర్ హసన్ మహ్ముద్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా ఎంపికయ్యాడు. అతడు 9 వికెట్లు, 14 పరుగులు చేశాడు.
Also Read
- Team India: టీమిండియా జట్టులో భారీ మార్పులు.. టీం నుంచి ఆ ముగ్గురు స్టార్ ప్లేయర్లు ఔట్..
- Anaya Bangar: శ్రేయస్‌ను చంపేస్తా.. గిల్‌తో డేటింగ్ చేస్తా.. అభిషేక్‌ను పెళ్లి చేసుకుంటా!
- Shafali Verma: రాత్రంతా నిద్రపోలేదు.. దాని గురించే ఆలోచించా.. షఫాలీ వర్మ ఆసక్తికర వ్యాఖ్యలు!
- Josephine Nkomo: మా ఓటమికి కారణం అదే.. టీమిండియాను చూసి చాలా నేర్చుకోవాలి!
ఆరు వికెట్లు పడగొట్టిన హసన్:
తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియాను కేవలం 198 పరుగులకే ఆలౌట్ చేయడంలో పేసర్ హసన్ మహ్ముద్ కీలక పాత్ర పోషించాడు. అతడు ఏకంగా ఆరు వికెట్లు పడగొట్టాడు. ఆస్ట్రేలియా బ్యాటర్లలో స్టీవ్ స్మిత్ 109 బంతుల్లో 71 పరుగులు చేశాడు. అయితే అతడికి మిగతా బ్యాటర్ల నుంచి తగిన సహకారం లభించలేదు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్ అద్భుతంగా ఆడింది. తన కెరీర్లో రెండో టెస్టు ఆడుతున్న తంజీద్ తమీమ్ శతకం సాధించాడు. 101 పరుగులు చేసి జట్టును పటిష్ట స్థితిలో నిలిపాడు. మొమినుల్ హక్ 49, నజ్ముల్ హుస్సేన్ శాంటో 84, మెహిదీ హసన్ మిరాజ్ 65 పరుగులు చేశారు. బంగ్లా తొలి ఇన్నింగ్స్‌లో 426 పరుగులు చేసి.. ఆస్ట్రేలియాపై ఏకంగా 228 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సాధించింది.
కంగారో గడ్డపై తొలి టెస్టు విజయం:
రెండో ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా కొంత మెరుగ్గా బ్యాటింగ్ చేసింది. కామెరాన్ గ్రీన్ 201 బంతుల్లో 104 పరుగులు చేశాడు. అతడి సెంచరీతో ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌లో 284 పరుగులకు చేరింది. తొలి ఇన్నింగ్స్‌లో భారీ ఆధిక్యం కారణంగా బంగ్లాదేశ్ లక్ష్యం 57 పరుగులుగా మారింది. నాలుగో రోజు స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బంగ్లా బరిలోకి దిగింది. రెండో ఓవర్లోనే తంజీద్ హసన్ తమీమ్ పరుగులేమీ చేయకుండానే ఔటవడంతో కాసేపు ఆందోళన కనిపించినా.. ఆ తర్వాత బంగ్లా బ్యాటర్లు లక్ష్యాన్ని పూర్తి చేశారు. ఈ విజయంతో బంగ్లాదేశ్‌కు ఆస్ట్రేలియాపై చారిత్రాత్మక మైలురాయి దక్కింది. స్వదేశంలో ఆస్ట్రేలియాను ఓడించిన బంగ్లా.. ఇప్పుడు కంగారో గడ్డపై తొలి టెస్టు విజయం అందుకుంది.
ఆస్ట్రేలియా ఐదు విజయాలు:
రెండు జట్ల మధ్య ఇప్పటివరకు జరిగిన ఏడు టెస్టుల్లో ఆస్ట్రేలియా ఐదు విజయాలు సాధించగా.. ఒక మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఇప్పుడు బంగ్లాదేశ్ ఖాతాలో తొలి విజయం అందుకుంది. ఇరు జట్ల మధ్య గతంలో మూడు ద్వైపాక్షిక టెస్టు సిరీస్‌లు జరిగాయి. వాటిలో ఆస్ట్రేలియా రెండు సిరీస్‌లు గెలిచింది. మరో సిరీస్ డ్రాగా ముగిసింది. 2017లో బంగ్లాదేశ్ స్వదేశంలో ఆస్ట్రేలియాను ఓడించినప్పటికీ.. తర్వాతి మ్యాచ్‌లో ఓడిపోవడంతో సిరీస్ 1-1తో సమమైంది. ఇప్పుడు డార్విన్‌లో సాధించిన ఈ విజయంతో బంగ్లా మరో చరిత్రకు చేరువైంది. ఆస్ట్రేలియాపై తొలి టెస్టు సిరీస్ విజయం సాధించాలంటే.. మిగిలిన మ్యాచ్‌లోనూ గెలవాల్సి ఉంది.
తాజావార్తలు
-
Yamaha Festive Offers 2026: Fascino 125 నుంచి R15 వరకు.. యమహా బైక్స్‌పై ప్రత్యేక ఆఫర్లు!
-
Canadian Military: కెనడా మిలిటరీ శిక్షణలో తీవ్ర విషాదం.. నలుగురు సైనికులు మృతి, 39 మందికి గాయాలు
-
Vishwak Sen: తాజుద్దీన్‌కు క్షమాపణలు.. అందుకే ‘కల్ట్’ సినిమాకు నేనే దర్శకత్వం వహిస్తున్నా!
-
Team India: టీమిండియా జట్టులో భారీ మార్పులు.. టీం నుంచి ఆ ముగ్గురు స్టార్ ప్లేయర్లు ఔట్..
-
Anaya Bangar: శ్రేయస్‌ను చంపేస్తా.. గిల్‌తో డేటింగ్ చేస్తా.. అభిషేక్‌ను పెళ్లి చేసుకుంటా!
ట్రెండింగ్
-
Josephine Nkomo: మా ఓటమికి కారణం అదే.. టీమిండియాను చూసి చాలా నేర్చుకోవాలి!
-
Ayudha Pooja : ఆయుధ, సరస్వతీ పూజలకు ఇల్లు సిద్ధమవుతోందా?.. ఈ సింపుల్ టిప్స్‌తో మెరిపించేయండి!
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!