Cunning Friend : ప్రతి ఒక్కరి జీవితంలో ఓ బెస్ట్ ఫ్రెండ్ తప్పని సరిగా ఉంటారు. స్నేహం చాలా ముఖ్యం. సన్నిహిత మిత్రులతో ప్రతిదీ పంచుకుంటాము. అతడు కనిపించకుంటే చాలా బాధపడతాము.
తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం గంగుడుపల్లెలో జరిగిన సాఫ్ట్వేర్ ఉద్యోగి నాగరాజు హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. నాగరాజు హత్యకు తమ్ముడి వివాహేతర సంబంధంతో పాటు ఆర్థిక కారణాలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.
Sexual assault on girl: దేశరాజధాని ఢిల్లీలో దారుణం జరిగింది. ఓ మైనర్ బాలుడు 16 ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడిన ఘటన వెలుగులోకి వచ్చింది. నిర్మాణంలో ఉన్న భవనంలో దొంగతనం చేయాలని ప్రవేశించిన బాలుడు అక్కడే పనిచేస్తున్న 16 ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారని పోలీసులు బుధవారం తెలిపారు. వాయువ్య ఢిల్లీలోని అశోక్ విహార్ ప్రాంతంలో మంగళవారం ఈ అత్యాచార ఘటన చోటుచేసుకుంది.
పంజాబ్‌లోని గురుదాస్‌పూర్ జిల్లాలో ఓ పోలీసు అధికారి ఊహించని దారుణానికి తెగబడ్డాడు. ఏఎస్సై హోదాలోని అధికారి తన సర్వీస్ రివాల్వర్‌తో భార్య, కొడుకు, పెంపుడు కుక్కను కాల్చి చంపాడు. అమృత్‌సర్‌లో విధులు నిర్వహిస్తున్న ఏఎస్ఐ భూపీందర్ సింగ్ తన సర్వీస్ రివాల్వర్‌తో అతని భార్య బల్జీత్ కౌర్ (40), కుమారుడు లవ్‌ప్రీత్ సింగ్ (19)లను హత్య చేశాడు.
రాజస్థాన్‌లోని నాగౌర్ జిల్లాలో దారుణం జరిగింది. మానసిక స్థితి సరిగా లేని వ్యక్తి తన ఇద్దరు కుమార్తెలను గొడ్డలితో నరికి హత్య చేశాడు. ఈ దారుణాన్ని అడ్డుకునేందుకు వచ్చిన భార్య, కోడలిని గాయపరిచాడు.
Man beats 12th wife to death in jharkhand: జార్ఖండ్ లో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. మద్యం మత్తులో ఓ వ్యక్తి తన భార్యను కొట్టి చంపాడు. ఇక్కడ విషయం ఏమిటంటే మరణించిన మహిళ, నిందితుడికి 12వ భార్య. వివారాల్లోకి వెళితే.. జార్ఖండ్ రాష్ట్రంలోని గయాన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జామ్ దార్ పంచాయతీలోని తారాపూర్ గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
భార్యాభర్తల బంధం అంటే అన్యోన్యతకు కేరాఫ్ అడ్రస్ అని చెబుతూ ఉంటారు. ఒకసారి మూడుముళ్ల బంధంతో దాంపత్య బంధంలోకి అడుగు పెట్టిన తర్వాత ఒకరికి ఒకరు తోడు నీడగా ఉంటూ కడవరకు కష్టసుఖాలను పంచుకోవాలని పెద్దలు చెబుతూ ఉంటారు.
పెద్దపల్లి జిల్లాలో ఓ కానిస్టేబుల్‌పై కొందరు వ్యక్తులు దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కానిస్టేబుల్‌కు తీవ్రగాయాలు అయ్యాయి. వివాహేతర సంబంధం నేపథ్యంలో ఓ కానిస్టేబుల్‌పై కొందరు విచక్షణారహితంగా దాడి చేసిన ఘటన సుల్తానాబాద్‌లో చోటుచేసుకుంది.