ఓ యువతిని ప్రేమించిన యువకుడు.. తమ పెళ్లికి అంగీకరించాలని ఆమె కుటుంబ సభ్యులను కోరగా.. మా వాళ్ల అమ్మాయినే ప్రేమిస్తావా అంటూ యువతి బంధువులు ఓ బడుగు వర్గానికి చెందిన యువకుడిని పట్టపగలే వెంటాడి కత్తులతో నరికి చంపిన దారుణ ఘటన ఆదివారం చోటుచేసుకుంది.
సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఇప్పిస్తానని లక్షలు దండుకున్నాడు ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్. కానిస్టేబుల్కు సాఫ్ట్వేర్ ఉద్యోగాలకు సంబంధం ఏమిటనుకుంటున్నారా?. సాఫ్ట్ వేర్ ఉద్యోగాలు ఇప్పిస్తానని ట్రాఫిక్ కానిస్టేబుల్ రూ.లక్షల్లో వసూళ్లకు పాల్పడిన సంఘటన నంద్యాల జిల్లాలో చోటుచేసుకుంది.
Triple Talaq: సైబర్ మోసాల పట్ల ప్రభుత్వాలు ఎన్ని సూచనలు చేసిన ఎక్కడో చోట ప్రజలు అత్యాశకు పోయి డబ్బు పోగొట్టుకుంటున్నారు. విదేశాల నుంచి గిఫ్టులు పంపిస్తామని, లాటరీ తగిలిందని చెబుతూ జనాలను మోసం చేస్తున్నారు. ఇదిలా ఉంటే సైబర్ మోసం 15 ఏళ్ల వివాహబంధానికి తెరపడేలా చేసింది. వివరాల్లోకి వెళితే ఒడిశాకు చెందిన ఓ మహిళ రూ. 1.5 లక్షలను సైబర్ మోసంలో పోగొట్టుకుంది. ఇది తెలిసిన భర్త ఆమెకు ట్రిపుల్ తలాక్ చెప్పాడు.