అల్లూరి జిల్లా హుకుంపేటలో విషాదం నెలకొంది. నేషనల్ హైవే పనుల్లో భాగంగా తీసిన గోతిలో పడి బాలుడు మృతి చెందడంతో విషాదం నెలకొంది. ఇటీవల కురుస్తున్న వర్షాలు కారణంగా చెరువులా మారింది గొయ్యి…నిన్న సాయంత్రం ఈతకు వెళ్ళిన మజ్జి జ్ఞాన దీపక్ అనే కుర్రాడు గోతిలో పడి మరణించాడు. మజ్జి జ్ఞాన దీపక్ 5వతరగతి చదువుతున్నాడు. గోతి వద్ద చెప్పులు,బట్టలు ఆధారంగా మృత దేహాన్ని వెతికి తీశారు స్థానికులు. నిర్లక్ష్యంగా హైవే పనులు చేయడం కారణంగానే తమ పిల్లవాడు మృతి చెందాడని బంధువులు ఆరోపిస్తున్నారు.
అనకాపల్లి దిబ్బ పాలెం గ్రామంలో విషాదం
అనకాపల్లి దిబ్బ పాలెం గ్రామంలో విషాదం ఏర్పడింది. డిగ్రీ విద్యార్థి ప్రాణాలు తీసింది ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్. క్రికెట్ బెట్టింగ్ కోసం చేసిన అప్పులు తీర్చలేక విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తీసుకున్న అప్పు చెల్లించాలి అంటూ ఒత్తిడి తెచ్చాడు క్రికెట్ బుకీ…సుమారు రూ. లక్షా వరకు అప్పు చేశాడు మృతుడు మధు కుమార్ (20). ప్రైవేట్ కాలేజీలో డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు మధు కుమార్..ఈనెల 23వ తేదీన ఎలుకల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. చికిత్స కోసం విశాఖలోని ప్రైవేట్ హాస్పిటల్ కి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందాడు మధుకుమార్. మృతుడి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.
ఇదిలా ఉంటే దిబ్బపాలెం గ్రామంలో ఆత్మహత్యకు పాల్పడిన 20 సంవత్సరాల పెంటకోట మధు కేసులో మరిన్ని విషయాలు బయటపడే అవకాశం కనిపిస్తోంది. క్రికెట్ బెట్టింగ్ కారణంగానే ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది తల్లి. తల్లి ఫిర్యాదుతో విచారణ ప్రారంభించారు అనకాపల్లి రూరల్ పోలీసులు.. విశాఖ కేజిహెచ్ మార్చురీలో యువకుడి మృతి దేహం ఉంచారు. మధు మృతదేహం ఇవాళ మధ్యాహ్నం స్వగ్రామం చేరుకునే అవకాశం ఉందని అంటున్నారు.