ఇండియన్ ప్రీమియర్ లీగ్ క్రికెట్ ఫ్యాన్స్ ను జోష్ లో ముంచేస్తుంది. రోజుకో ట్విస్ట్.. ఉత్కంఠభరితమైన మ్యాచ్ లు క్రికెట్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. అయితే ఒక వైపు క్రికెట్ ను ఎంజాయ్ చేస్తుంటే.. మరో వైపు బెట్టింగ్ రాయుళ్లు మాత్రం పందెలు పెడుతున్నారు. పందేం రాయుళ్లపై పోలీసులు ఎన్నిసార్లు దాడులు చేసిన వారు తీరు మాత్రం మారడం లేదు. కొంతమంది బెట్టింగ్ పెట్టేందుకు అప్పులు చేసి తిప్పలు పడుతున్నారు.. మరికొందరు చేసిన అప్పులు తీర్చలేక ఆత్మహత్యలే చేసుకుంటున్నారు. అయితే తాజాగా క్రికెట్ బెట్టింగ్ తో అప్పుల పాలైన ఓ యువకుడు వాటిని తీర్చే మార్గం లేక ఆత్మహత్య చేసుకున్నాడు. అనకాపల్లి జిల్లాలో ఈ ఘటన జరిగింది.
Also Read : Temple Thief: సిద్దిపేట పోచమ్మ ఆలయంలో చోరీ.. హుండీ పటలగొట్టి..
అనకాపల్లి జిల్లాలోని దిబ్బలపాలెం గ్రామానికి చెందిన పెంటకోట మధుకుమార్ ( 20 ) అనకాపల్లిలోని ఓ ప్రైవేట్ డిగ్రీ కళాశాలలో డిగ్రీ సెకండియర్ చదువుతున్నాడు. క్రికెట్ బెట్టింగ్ లు కట్టే అలవాటున్న మధుకుమార్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో పందేల కోసం అదే గ్రామానికి చెందిన పెంటకోట నర్సింగరావు వద్ద అప్పు చేశాడు. ఆ అప్పు తీర్చాలంటూ అతడి నుంచి ఒత్తిడి పెరిగింది. అయితే, తీర్చే మార్గం కనిపించకపోవడంతో ఈ నెల 23న రాత్రి ఎలుకల మందు తాగిన మధుకుమార్ ఆత్మహత్యకు యత్నించాడు. గమనించిన కుటుంబ సభ్యులు అతన్ని వెంటనే విశాఖపట్నంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ నిన్న మృతి చెందాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Also Read : Aishwarya Rai : అవి కనిపించకుండా కవర్ చేస్తున్న ఐశ్వర్య రాయ్
బెట్టింగ్ కోసం చేసిన అప్పులు తీర్చేలేక విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీనికి సంబంధించి మృతుడి తల్లి జయ, గ్రామీణ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్లు ఎస్సై అంజిబాబు వెల్లడించారు. అయితే మృతుడి తల్లి జయ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు పెంటకోట నర్సింగరావును అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు ఎస్ఐ అంజిబాబు వెల్లడించారు.