Husband Killed His Wife For Talking With Others On Phone In AP: ఏ భర్త అయినా సరే.. తన భార్య పరాయి వ్యక్తితో మాట్లాడుతుండటాన్నే చూసి ఓర్వలేడు. అలాంటిది.. మరో వ్యక్తితో చనువుగా ఉందని తెలిస్తే ఊరికే ఉంటాడా? ఆ కోపంలో చేయరాని పనులు చేసేస్తాడు. కొందరు మెచ్యూర్‌గా ఆలోచించి విడాకులు ఇస్తే.. మరికొందరు ఆవేశంలో నేరాలకు పాల్పడుతుంటారు. ఇప్పుడు ఓ వ్యక్తి కూడా అలాంటి దారుణానికే ఒడిగట్టాడు. తన భార్య పరాయి వ్యక్తితో ఫోన్‌లో మాట్లాడుతుండటాన్ని చూసి తట్టుకోలేకపోయిన అతను.. రోకలి బండతో తలపై బలంగా కొట్టి, హతమార్చాడు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్‌లో చోటు చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే..
Rishabh Pant: ఆసియా కప్, వన్డే వరల్డ్‌కప్‌కు పంత్ దూరం.. అతని స్థానంలో ఎవరు?
కర్నూలు జిల్లాలోని యనకండ్ల గ్రామానికి చెందిన నాగప్రసాద్‌కు కొంతకాలం క్రితం మాధవి అనే మహిళతో వివాహం అయ్యింది. నాగప్రసాద్ క్లీనర్‌గా పని చేస్తుండగా.. అతని భార్య కూలీ పనులకు వెళ్లేది. కట్ చేస్తే.. భార్య తరచూ ఇతరులతో ఫోన్‌లో మాట్లాడుతుండేది. మొదట్లో నాగప్రసాద్ పట్టించుకోలేదు కానీ, మాధవి మరీ ఎక్కువగా ఫోన్‌లోనే కాలం గడుపుతుండటంతో, అతనికి అనుమానం వచ్చింది. దీంతో.. పలుసార్లు అతడు మందలించాడు. అయినా మాధవి పట్టించుకోకుండా, నిత్యం ఫోన్‌లో మాట్లాడేది. ఈ విషయంలో ఇద్దరి మధ్య తరచూ ఘర్షణలు జరుగుతుుండేవి. కొన్ని రోజుల క్రితం మరోసారి ఇద్దరి మధ్య గొడవ జరగడంతో.. మాధవి తన భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనని వేధింపులకు గురి చేస్తున్నాడని ఫిర్యాదులో పేర్కొంది. అయితే.. పెద్దలు జోక్యం చేసుకొని సర్దిచెప్పడంతో.. ఇద్దరు రాజీకొచ్చారు. దీంతో.. మాధవి తన కేసుని ఉపసంహరించుకుంది.
Woman In Hijab Harassed: హిందూ యువకుడితో తిరుగుతోందని హిజాబ్ ధరించిన యువతికి వేధింపులు..
ఇద్దరు కలిసి మళ్లీ తమ దాంపత్య జీవితాన్ని కొత్తగా ప్రారంభించారు. కానీ.. మాధవి ప్రవర్తనలో మాత్రం మార్పు రాలేదు. ఆమె ఎప్పట్లాగే మళ్లీ ఫోన్‌లోనే ఎక్కువసేపు ఇతరులతో మాట్లాడటం మొదలుపెట్టింది. దాంతో కోపాద్రిక్తుడైన నాగప్రసాద్.. ఈనెల 20వ తేదీన రోకలిబండతో ఆమె తలపై బలంగా కొట్టాడు. ఈ ఘటనలో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. భార్య మృతి చెందడంతో.. నాగప్రసాద్ అక్కడి నుంచి పారిపోయాడు. చివరికి పోలీసుల ఎదట లొంగిపోయి, తానే తన భార్యను కొట్టి చంపానని ఒప్పుకున్నాడు. పోలీసులు అతడ్ని కోర్టులో హాజరుపరిచి, రిమాండ్‌కు తరలించారు.