Haryana : హర్యానాలోని మనేసర్‌లో ఓ మహిళను తన భర్త అత్యంగ కిరాతకంగా హత్య చేశాడు. ముందుగా చేతులు, ఆతర్వాత తలనరికి మృతదేహాన్ని కాల్చేందుకు ప్రయత్నించాడు. ఏప్రిల్ 21న మనేసర్ గ్రామంలో సగం కాలిన మహిళ మృతదేహాన్ని పోలీసులు కనుగొన్నారు. తెగి పడిన చేతులు మాత్రమే ఉండి మృతదేహం తల కనిపించకపోవడంతో మహిళను వేరే చోట హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానించారు. దీని తరువాత, పోలీసులు ఏప్రిల్ 23 న మహిళ చేతులు, ఏప్రిల్ 26 న ఆమె తలని కనుగొన్నారు. మహిళ తల ఖేర్కిదౌలా పోలీస్ స్టేషన్ పరిధిలో కనుగొనబడింది. ఈ కేసులో అనుమానితుడిగా మహిళ భర్త జితేంద్రను పోలీసులు అరెస్ట్ చేశారు. జితేంద్ర గాంధీనగర్ నివాసి. మనేసర్‌లో అద్దెకు ఉంటున్నాడు. పోలీసులు జితేంద్రను విచారిస్తున్నారు. త్వరలోనే మొత్తం కేసును ఛేదిస్తామని పోలీసులు చెబుతున్నారు.
Read Also: Corona Cases: దేశంలో కాస్త తగ్గిన కరోనా కేసులు
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పచ్‌గావ్ చౌక్ సమీపంలోని కుక్డోలా గ్రామంలోని ఓ ఇంట్లో పాక్షికంగా కాలిపోయిన మహిళ మృతదేహం లభ్యమైంది. కాంట్రాక్టుపై తీసుకున్న స్థలంలో ఉమైద్ సింగ్ అనే వ్యక్తి ఈ ఇంటిని నిర్మించాడు. పచ్‌గావ్ చౌక్ నుంచి కసన్ గ్రామానికి వెళ్లే రోడ్డు పక్కన ఉమేద్ సింగ్ ఎనిమిది ఎకరాల భూమిని లీజుకు తీసుకున్నాడు. మృతదేహాన్ని గుర్తించిన ఉమైద్ సింగ్ పోలీసులకు సమాచారం అందించాడు.
Read Also: Delhi: ఆ భవనం మాకిచ్చేయండి.. ఏపీని కోరిన తెలంగాణ
నా పొలంలో నిర్మించిన ఇంట్లోని ఓ గదిలో నుంచి పొగలు వస్తున్నాయని మా పొరుగువారు ఫోన్‌లో చెప్పారని ఉమేద్ సింగ్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో తెలిపారు. పొలానికి వెళ్లి చూడగా గదిలో సగం కాలిన మొండెం కనిపించింది. దీంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. తన భార్యను హత్య చేసినట్లు నిందితుడు జితేంద్ర అంగీకరించాడని పోలీసు వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం పోలీసులు ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించి ఆధారాలు సేకరిస్తున్నారు.