Maharashtra: తనను ఆటపట్టిస్తుందని 8 ఏళ్ల బాలికను చంపేసిన బాలుడు..తన పక్కింట్లోనే ఉండే 8 ఏళ్ల బాలికను 16 ఏళ్ల బాలుడు దారుణంగా హత్య చేశాడు. పదేపదే తనను ఆటపట్టిస్తుందని, ఏడిపిస్తుందనే కారణంతో హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటన మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లాలోని పెల్హార్ గ్రామంలో డిసెంబర్ 1న ఈ హత్య చేసినట్లు తెలుస్తోంది. హత్య జరిగిన 3 రోజుల తర్వాత బాలిక మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.
Mass Killing: ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలో ఘోరం జరిగింది. ఓ వైద్యుడు తన భార్యను, ఇద్దరు పిల్లల్ని హత్య చేసి తాను కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన ఒక్కసారిగా రాయ్‌బరేలీ నగరాన్ని ఉలిక్కిపడేలా చేసింది. సిటీలోని రైల్వే కాలనీలో ఈ ఘటన జరిగింది. డాక్టర్ అరుణ్ కుమార్ రైల్వేలో మెడికల్ ఆఫీసర్‌గా పనిచేస్తున్నారు. కంటి నిపుణుడు అయిన అరుణ్ కుమార్ రాయ్ బరేలీలోని మెడ్రన్ రైల్ కోచ్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నారు.
చట్టం తన పని తాను చేసుకుపోతుంది. నేరం చేసిన వాళ్లకు ఏదో రోజు శిక్ష పడి తీరుతుంది అనడానికి ఈ ఘటనే ఉదాహరణ. ఓ మానవ మృగం ఇంకిత జ్ఞానం లేకుండా చిన్న పాప అని కూడా చూడ కుండా ఓ మైనర్ బాలిక పైన విచక్షణారహితంగా అఘాయిత్యానికి పాల్పడ్డాడు.
కాన్పూర్‌లో ఓ సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. భార్య ప్రియుడితో కలిసి తన భర్త గొంతుకోసి హత్య చేసింది. హత్యను ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు నిందితులు మృతదేహం దగ్గర పాయిజన్ బాటిల్ ఉంచారు. ఈ ఘటనలో నిందితులిద్దరినీ పోలీసులు అరెస్ట్ చేశారు. భార్య తన మొదటి భర్త నుంచి విడాకులు తీసుకుని.. మరో యువకుడితో రెండో పెళ్లి చేసుకుంది.
మానవత్వం సిగ్గుతో తలదించుకునే ఓ ఉదంతం అమెరికాలో వెలుగు చూసింది. అరిజోనాలోని ఓ ఆసుపత్రి సెక్యూరిటీ గార్డు చేసిన పని ప్రజల ఆగ్రహానికి కారణమైంది. గత నెలలో 79 ఏళ్ల వృద్ధురాలు మృతదేహంతో మార్చురీలో శృంగారంలో పాల్గొన్నాడు. దీంతో ఆ కామాంధుడిని పోలీసులు అరెస్టు చేశారు.