Tragedy: విషాదం.. కాలకృత్యాలకు వెళ్లిన అక్కాచెల్లెళ్లను పలకరించిన అకాలమృత్యువు
- అల్లూరి జిల్లా సోమన్నపాలెం గ్రామంలో విషాదం
- చెరువులో పడి అక్కాచెల్లెళ్లు మృతి
- గ్రామాన్ని అలుముకున్న విషాద ఛాయలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tragedy: అల్లూరి సీతారామరాజు జిల్లా అడ్డతీగల మండలం సోమన్నపాలెం గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. కాలకృత్యాలకు వెళ్లిన అక్కాచెల్లెళ్లు ఇద్దరు ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందారు. మృతులు వంతల కావ్యశ్రీ (13), సాహితీ (10)గా పోలీసులు గుర్తించారు. తమ పొలం సమీపంలోని చెరువు వద్ద కాలకృత్యాలు తీర్చుకుని ప్రమాదవశాత్తు కాలుజారి చెరువులో పడిపోవడంతో చెల్లిని కాపాడే ప్రయత్నంలో ఇద్దరు చెరువులో మునిగిపోయి మృత్యువాత పడ్డారు. ఈ విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు రామారావు శ్రీలక్ష్మి సంఘటన స్థలానికి చేరుకొని ఇద్దరు కుమార్తెలను గ్రామస్తుల సాయంతో చెరువులో నుంచి బయటకు తీసుకురాగా అప్పటికే పెద్ద కుమార్తె మరణించింది.
Read Also: పడుకునే ముందు ఈ ఆకు రసం తాగితే షుగర్ మటుమాయం..
Also Read
- FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్లో కేసు నమోదు..
- Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
- GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
- Off The Record: ఇప్పుడు ఎమ్మెల్సీ.. తర్వాత అసెంబ్లీ? బీఆర్ఎస్-లెఫ్ట్ కెమిస్ట్రీ కుదిరేనా..?
కొన ఊపిరితో ఉన్న రెండో కుమార్తెను కాపాడేందుకు హుటాహుటిన అడ్డతీగల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేయగా.. ఆ చిన్నారి కూడా మార్గమధ్యలో మృత్యువాత పడింది. ఈ ఘటనతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. అక్కాచెల్లెళ్ల మృతితో సోమన్నపాలెం గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. డి.కొత్తూరు పోలీసులు ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
తాజావార్తలు
-
FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్లో కేసు నమోదు..
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
-
GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
-
Off The Record: కేతిరెడ్డికి ప్రాణహాని ఉందా? ట్రాప్ వెనుక ఎవరు?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!