Rajasthan: మహిళలకు రక్షణ లేకుండా పోతోంది. ఒంటరిగా కనిపిస్తే కామాంధుల చేతిలో బలైపోతున్నారు. దేశవ్యాప్తంగా ప్రతీ రోజు ఎక్కడో చోట ఇలాంటి అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. పోక్సో, ఇతర కఠిన చట్టాలు ఉన్నప్పటికీ కొందరిలో మార్పు రావడం లేదు. 2012లో యూపీఏ ప్రభుత్వ హయాంలో దేశాన్ని కదిపేసిన నిర్భయ తరహా సంఘటన మరోసారి రిపీట్ అయింది.
ఏపీలోని కర్నూలులో దారుణ ఘటన చోటుచేసుకుంది. వివాహేతర సంబంధం నేపథ్యంలో కర్నూల్ నగరంలో ఓ ప్రైవేట్ లాడ్జిలో ప్రియురాలిని హత్య చేసి ప్రియుడు ఆత్మహత్య చేసుకున్నాడు. మృతులు నందికొట్కూరుకు చెందగిన విజయ్, రుక్సానాలుగా గుర్తించారు.
సైబర్ నేరగాళ్ల మోసాలు రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. ఏదో ఒక రూపంలో అమాయకులను అందినకాడికి దోచుకున్న నేరగాళ్లు.. తాజాగా మైనర్ బాలికలను లక్ష్యంగా చేసుకున్నారు. విశాఖలో సైబర్ నేరగాళ్లు మైనర్ బాలికలను టార్గెట్ చేశారు. ఆరుగురు కేంద్రీయ విద్యాలయం విద్యార్థినుల అదృశ్యం కేసును పోలీసులు 24 గంటల్లో ఛేదించి బాలికలను సురక్షితంగా రక్షించారు.
Live-in partner: ఇటీవల కాలంలో లివ్ ఇన్ రిలేషన్స్ పెరుగుతున్నాయి. యువతీయువకులు సహజీవనం పేరుతో కలిసి ఉంటున్నారు. గతంలో ఢిల్లీలో శ్రద్ధా వాకర్ అనే యువతి హత్య సహజీవనం ఎంత ప్రమాదకరమో నిరూపించింది. ఈ ఘటన తర్వాత లివ్ ఇన్ రిలేషన్లో ఉన్న యువతులు పలు కారణాలతో హత్యలకు గురయ్యారు.
కోతిని మనం దైవంగా భావిస్తాం. కానీ ఇప్పుడు ఆ కోతి మనకు చుక్కలు చూపిస్తోంది. పర్యావరణ సమతుల్యత దెబ్బతినడంతో అడవుల్లో ఉండాల్సిన కోతులు ఊళ్లలోకి చొరబడి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో చాలా జిల్లాల్లో కోతుల బెడద ఎక్కువైపోయింది.
ఓ మహిళకు పార్ట్‌టైం జాబ్ ఆఫర్ చేసిన స్కామర్లు ఆమె దగ్గర నుంచి ఏకంగా 3.37 లక్షల రూపాయలను కొట్టేశారు. ఈ సంఘటన లక్నోలో వెలుగులోకి వచ్చింది. నగరానికి చెందిన కుష్భు పాల్ అనే మహిళను స్కామర్లు పార్ట్ టైం జాబ్ పేరుతో మోసం చేశారు.
Man Kills Mother: మానవ సంబంధాలు దిగజారిపోతున్నాయి. డబ్బు, భూమి ఇలా కొన్నింటి కోసం సొంతవారినే చంపేస్తున్నారు. కనిపెంచిన తల్లిదండ్రుల పట్ల కర్కశంగా వ్యవహరిస్తున్నారు. తాజాగా యూపీలో ఓ వక్యి తల్లిని దారుణంగా హత్య చేశారు. భూ వివాదం నేపథ్యంలో ఈ హత్య చోటు చేసుకుంది. సీతాపూర్‌కి చెందిన వ్యక్తి, భూమిని తన పేరుపై మార్చకపోవడంతో తల్లి తలనరికి చంపాడు.
Bihar: బీహార్ రాష్ట్రంలో దారుణం జరిగింది. నడిరోడ్డుపై 20 ఏళ్ల యువకుడిని దుండగులు హత్య చేశారు. నిందితుడు ముందుగా యువకుడి కళ్లలో కారం చల్లి, ఆ తర్వాత కత్తితో విచక్షణారహితంగా పొడిచి చంపాడు. వారణాసిలో చదువుతున్న రాహుల్ కుమార్ అనే యువకుడు ఛత్ వేడుకల కోసం సొంతూరికి వచ్చాడు. హత్య జరిగే రోజు రాహుల్‌కి ఒకరి నంచి ఫోన్ వచ్చింది. పోలీసులు ప్రాథమిక విచారణ సందర్భంగా.. కేఎల్ఎస్ కాలేజీ దగ్గరకు రావాల్సిందిగా రాహుల్‌కి ఫోన్ వచ్చింది.
ప్రకాశం జిల్లా దోర్నాలలో దారుణం చోటుచేసుకుంది. విద్యాబుద్దులు నేర్పాల్సిన ఉపాధ్యాయుడి బుద్ది వక్రమార్గం పట్టింది. దోర్నాల ఉన్నత పాఠశాలలో చదువుకునే విద్యార్థినిని ట్రాప్ చేసిన ఉపాధ్యాయుడు ప్రసాద్.. తనను ఇంట్లోకి తీసుకెళ్లాడు. విషయం తెలుసుకొని ఉపాధ్యాయుడి ఇంటికి వెళ్ళి బంధువులు ఆ టీచర్‌ను నిలదీశారు.